02 June 2010

లేలేబాబా నిద్దుర లేవయ్యా

లేలేబాబా నిద్దుర లేవయ్యా
ఏలే స్వామి మేలుకోవయ్యా
రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ
చరణాలను చేరగ తలుపు తీసెరా బాబా

వేగుచుక్క తిలకమెట్టి
వేదమంత పువ్వులు పెట్టీ ఆ..ఆ..
పాదసేవ చేసుకునే వేళ దాటిపోయెనని
ప్రశ్నలేయకుంటే మంచిదే ఇద్దరికి
పెద్దకొడుకంటే ముద్దేలే ఏ తండ్రికి
అందుకనే గుండె నీ గురుపీఠమైనది
ఆరాధ్యదైవమని కొనియాడుతున్నది
అంతకు మించిన భాగ్యమేదిరా బాబా


నీలకంఠ స్వామి లో నిండుకున్న జ్యోతివై
సత్యమైన వెలుగులో దత్తాత్రేయ రూపమై
లోకములు కాచే తండ్రివీ నీవేనని
రూపములనేకములైన శ్రీ సాయివీ
నమ్ముకున్న వారికెల్ల నారాయణత్మవై
కుమ్మరించు వరములే సుఖశాంతి నెలవులై
వెన్నంటి నువ్వుంటె లోటే లేదుగా బాబా

No comments:

Post a Comment