తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే ||2||
చలిగాలి రమ్మంటు పిలిచిందిలే
చెలిచూపు నీపైన నిలిచిందిలే ||2||
ఏముందిలే ఇపుడేముందిలే ||2||
మురిపించు కాలమ్ము ముందుందిలే నీ ముందుందిలే ||తెలి||
వరహాల చిరునవ్వు కురిపించవా
పరువాల రాగాలు పలికించవా ||2||
ఔనందునా కాదందునా ||2||
అయ్యారె విధి లీల అనుకొందునా అనుకొందునా ||తెలి||
సొగసైన కనులేమొ నాకున్నవి
చురుకైన మనసేమొ నీకున్నదీ ||2||
కనులేమిటో ఈ కథ ఏమిటో ||2||
శృతి మించి రాగాన పడనున్నది పడుతున్నది
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ..
తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే
No comments:
Post a Comment