బంగారుకళ్ళా బుచ్చమ్మో....... చెంగావి చెంపా లచ్చమ్మో
కోపంలో ఎంతో ముద్దమ్మో..... ఓ బుంగమూతి సుబ్బమ్మో
సందె పొద్దుల్లో ముద్దబంతల్లే ఎంత ముద్దుగున్నావే
వెండిమువ్వల్లే ఘల్లు మంటుంటే గుండె ఝల్లుమన్నాదే ||బంగారు||
నీలో చింతచిగురు పులుపున్నదే.....
బుల్ బుల్ పిట్టా...... మల్ మల్ పట్టా
కవ్వంలాగా చిలికే కులుకున్నదే.....
తళుకుల బుట్టా.... మెరుపుల తట్టా
నీలో చింతచిగురు పులుపున్నదే కవ్వంలాగా చిలికే కులుకున్నదే
కొంటెమాట వెనక చనువున్నదే తెలుసుకుంటె మనసు పిలుపున్నదే
కళ్ళేమూసి చీకటిఉందంటె వెన్నెల నవ్వుకుంటందే
ముసుగే లేకుంటె మనసే జగాన వెలుగై నిలిచిఉంటుందే ||బంగారు||
నిన్న నేడు రేపు ఒక నిచ్చెన....
సొగసుల పువ్వా..... గడసరి గువ్వా
మనకు మనకు చెలిమే ఒక వంతెన......
సిరి సిరిమువ్వా.... కులుకుల రవ్వా
నిన్న నేడు రేపు ఒక నిచ్చెన మనకు మనకు చెలిమే ఒక వంతెన
ఎవరికి వారై ఉంటే ఏముందమ్మా మురళికాని వెదురై పోదా జన్మ
చేయి చేయి కలిపేకోసమే హృదయం ఉంచాడమ్మాయి
జారిపోయాక తిరిగిరాదమ్మో కాలం మాయమరాఠి ||బంగారు||
No comments:
Post a Comment