అమ్మాయి బాగుంది అందంగా ఉంటుంది
ఏవేవో చేసింది వారేవా
మందారం లా వుంది మువ్వల్లే నవ్వింది
రాగాలే తీసిందీ వారేవా
గుండె లోపలా ఎండ మావి లా ఎందుకిలా ఈ మాయా
కంటి పాపలో స్వప్నమే ఇలా ఎదురుగా రాదేల
ఎవ్వరిదీ యవ్వన వీణ రువ్వినది నవ్వుల వాన
మైనా గుండె లోన
మాటలకే అందని జాన అందములో అప్సరసేనా
అవునా అందుకోనా
ఆమె నవ్వే పాడుతూ మౌన సంగీతం
కాలి మువ్వై మోగుతూ ప్రేమ సంకేతం
ఎటు చూసినా అటు వైపునే ఎదురయ్యే ఆరూపం
చెప్పకనే చెప్పెను ప్రాయం ఎప్పటికీ తీరని దాహం
మోహం వింత మోహం
గుపిటలో దాగని గానం గుప్పుమనే ఆసల తీరం
దూరం ఎంత దూరం
ఆమె తోనే చేయమంది జన్మలో స్నేహం
ఆమె తోనే సాగమంది తోడుగా ప్రానం
సందె వేళలో చల్ల గాలి లా నన్ను చేరే సంతోషం
No comments:
Post a Comment