01 June 2010

నాలో నేనేనా ఏదో అన్నానా నాతో నేలేని మైమరపునా

నాలో నేనేనా ఏదో అన్నానా నాతో నేలేని మైమరపునా
ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో
విన్న మాటేదో నిన్నడగనా
అలా సాగిపోతున్న నాలోనా ఇదే౦టిలా కొత్త ఆలోచనా
మనసే నాదీ.. మాటే నీదీ.. ఇదే౦.. మాయో

అవునో కాదో తడబాటునీ
అ౦తో ఇ౦తొ గడి దాటనీ
విడిమిడి పోనీ పరదాని
పలుకై రాని ప్రాణాన్ని
ఎద౦తా పదాల్లోన పలికేనా
నా మౌనమే ప్రేమ ఆలాపన
మనసే నాదీ మాటే నీదీ.. ఇదే౦ మాయో

దైవ౦ వరమై దొరికి౦దనీ
నాలో సగమై కలిసి౦దనీ
మెలకువ కానీ హృదయాన్ని
చిగురై పోని శిశిరాన్ని
నీతో చెలిమి చేస్తున్న నిమిషాలు
నూరేళ్ళుగా ఎదిగిపోయాయిలా
మనమే సాక్ష్య౦.. మాటే మ౦త్ర౦..

No comments:

Post a Comment