22 July 2010

నీల గగన ఘనశ్యామా ఘనశ్యామా దేవ

పల్లవి:

నీల గగన ఘనశ్యామా ఘనశ్యామా దేవ నీల గగన ఘనశ్యామా
నీల గగన ఘనశ్యామా దేవ నీల గగన ఘనశ్యామా
హాని కలిగితే అవతారాలను
హాని కలిగితే అవతారాలను పూని బ్రోచునది నీవే కావా
నీల గగన ఘనశ్యామా
నీల గగన ఘనశ్యామా ఘనశ్యామా దేవ నీల గగన ఘనశ్యామా

చరణం1:

చదువులు హరించి అసురుడేగిన జలచరమైతివి ఆగమరూపా

వేద నిధులనే విధాత కొసగిన ఆదిదేవుడవు నీవే కావా
నీల గగన ఘనశ్యామా
నీల గగన ఘనశ్యామా ఘనశ్యామా దేవ నీల గగన ఘనశ్యామా

చరణం2:

కడలి మధించగ కదిలే నగమును వెడలి కూర్మమై వీపున మోసి

అతివ రూపమున అమృతము గాచిన ఆదిదేవుడవు నీవే కాదా
నీల గగన ఘనశ్యామా
నీల గగన ఘనశ్యామా ఘనశ్యామా దేవ నీల గగన ఘనశ్యామా

చరణం3:

సుజనుల కోసము ఎపుడే వేషము ధరియించెదవో తెలియగనేరము

పెండ్లి కొడుకువై వెడలి నాడవు ఎందుల కొరకో హే జగదీశా
నీల గగన ఘనశ్యామా
నీల గగన ఘనశ్యామా ఘనశ్యామా దేవ నీల గగన ఘనశ్యామా

No comments:

Post a Comment