22 July 2010

సిరిమల్లి శుభలేఖ చదివావా నెలవంక

పల్లవి:

సిరిమల్లి శుభలేఖ చదివావా నెలవంక
తీయని పిలుపే శ్రావణగీతం
అందిన వలపే ఆమని గానం
అక్షరలక్ష ముద్దుల భిక్ష
కందిన మొగ్గ కమ్మని బుగ్గ
చిరునవ్వే శుభలేఖ చదివావా శశిరేఖ

చరణం1:

జాజిమల్లి తీగనై జూకామల్లి పువ్వునై
నీ చెంత చేరేనులే
ఋతుపవనాలలో రస కవనాలతో
తీర్చాలి నా మోజులే
రాజీలేని అల్లరి రోజాపూల పల్లవి
నీ పాట పాడాయిలే
కథ రమనీయమై చిరస్మరణీయమై
సాగాలి సంగీతమై
అనురాగ శ్రీగంధమై

చిరునవ్వే శుభలేఖ చదివావా శశిరేఖ
అక్షరలక్ష ముద్దుల భిక్ష
కందిన మొగ్గ కమ్మని బుగ్గ
తీయని పిలుపే శ్రావణగీతం
అందిన వలపే ఆమని గానం
సిరిమల్లి శుభలేఖ చదివావా నెలవంక

చరణం2:

రాగాలన్ని నవ్వులై రావాలంట మువ్వవై
నా ప్రేమ మందారమై
తగు అధికారము తమ సహకారము
కావాలి చేయూతగా
బుగ్గబుగ్గ ఏకమై ముద్దే మనకు లోకమై
నూరేళ్ళు సాగాలిలే
ఇది మధుమాసమై మనకనుకూలమై
జరగాలి సుముహూర్తమే
కళ్యాణ వైభోగమే

సిరిమల్లి శుభలేఖ చదివావా నెలవంక
తీయని పిలుపే శ్రావణగీతం
అందిన వలపే ఆమని గానం
లాలాల ఆహాహ లాలాల ఆహాహ

No comments:

Post a Comment