22 July 2010

ఆనందమాయే అలినీలవేణి

పల్లవి:

ఆనందమాయే అలినీలవేణి
ఆనందమాయే అలినీలవేణి అరుదెంచినావా అందాల దేవి
ఆనందమాయే అలినీలవేణి
ఆ ఆ ఆ అనువైన వేళ అనురాగ శోభ
అది ప్రేమపూజ నా భాగ్యమాయే
అలనాటి నోము కల నేడు పండే
అరుదైన హాయి నాలోన నిండె
ఆనందమాయే అసమాన తేజా అపురూపమైన అందాల దేవా
ఆనందమాయే అసమాన తేజా

చరణం1:

సొగసైన రూపే సొలించు చూపే సగమైన కనులా సంతొషమిటులే
నగుమోముపైన నడయాడు కలలే అగుపించగానే మధువూరు నాలో
ఆనందమాయే అలినీలవేణి అరుదెంచినావా అందాల దేవి
ఆనందమాయే అలినీలవేణి

చరణం2:

ఎనలేని స్వామి నిను చేరబోతే నునులేతప్రేమ నను సాగనీదే
తనువేమో నీకై తపియించ నిలచి మనసేమో నీలో మునుపే కలిసే
ఆనందమాయే అసమాన తేజా అపురూపమైన అందాల దేవా
ఆనందమాయే అలినీలవేణి అరుదెంచినావా అందాల దేవి
ఆనందమాయే అలినీలవేణి

No comments:

Post a Comment