22 July 2010

జిగిజిగి జిగిజ జాగేల వనజా

పల్లవి:

జిగిజిగి జిగిజ జాగేల వనజా
రావేల నా రోజా
జిగిజిగి జిగిజ ఓ బాలరాజా
నీదేలే ఈ రోజా
నీదేలే వలపుల వైభోగం
నాదేలే మమతల మణిహారం
జిగిజిగి జిగిజ జాగేల వనజా
రావేల నా రోజా
జిగిజిగి జిగిజ ఓ బాలరాజా
నీదేలే ఈ రోజా

చరణం1:

లాలి లాలి ప్రేమ రాణి అనురాగంలోనే సాగిపోని
మేనాలోన చేరుకోని సురభోగాలన్ని అందుకోనీ
పెదవి పెదవి కలవాలి
ఎదలో మధువే కొసరాలి
బ్రతుకే మమతై నిలవాలి
మురళీ స్వరమై పలకాలి
ప్రేయసి పలుకే మాణిక్యవీణ ప్రేమావేశంలోన
కౌగిలి విలువే వజ్రాల హరం మోహావేశంలోన
రావే రావే రస మందారమా

జిగిజిగి జిగిజ ఓ బాలరాజా
నీదేలే ఈ రోజా
జిగిజిగి జిగిజ జాగేల వనజా
రావేల నా రోజా
నాదేలే మమతల మణిహారం
నీదేలే వలపుల వైభోగం

చరణం2:

స్నానాలాడే మోహనాంగి ఇక సొంతం కావే శోభనాంగి
దూరాలన్ని తీరిపోనీ రస తీరాలేవో చేరుకోనీ
తనువు తనువు కలిసాక వగలే ఒదిగే శశిరేఖ
ఎగసే కెరటం ఎదలోన సరసం విరిసే సమయాన
ముందే నిలిచే ముత్యాలశాల పువ్వై నవ్వే వేళ
రమ్మని పిలిచే రత్నాల మేడ సంధ్యారాగంలోన
వలపే పలికే ఒక ఆలాపన

జిగిజిగి జిగిజ జాగేల వనజా
రావేల నా రోజా
జిగిజిగి జిగిజ ఓ బాలరాజా
నీదేలే ఈ రోజా
నీదేలే వలపుల వైభోగం
నాదేలే మమతల మణిహారం
హొయ్ జిగిజిగి జిగిజ జాగేల వనజా
రావేల నా రోజా
జిగిజిగి జిగిజ ఓ బాలరాజా
నీదేలే ఈ రోజా

No comments:

Post a Comment