పల్లవి:
నీరుగారి పారిపోకు నీరసాన జారిపోకు లే మేలుకో
మారుమూల దాగబోకు పిరికిమందు తాగబోకు లే మేలుకో
ఎందుకీ భయం,అందుకో జయం
నీడలాగ నీకు తోడు నేనే లేనా
నీరుగారి పారిపోకు నీరసాన జారిపోకు లే మేలుకో
చరణం1:
రూపురేఖలో,చురుకైన చూపులో నీవే జాకీచాన్
కొండరాళ్ళని నీకండరాలతో లేపే సూపర్ మేన్
కీచులాటలు,కుంపూల ఫైటులు రావే ఏంచేస్తాం
ఎగిరి దూకడం అలవాటులేదెలా అమ్మో పడిచస్తాం
అహ ఎంతవారలైన నీకు చీమ దోమ
అయ్యో ఎందుకంత చేటు ధీమా భామా
హీమేన్ లా నువ్వు హూంకరించవా
ఆపైన నా ప్రాణం హరించరా
వీరస్వర్గమే వరించురా
మాయదారి మాటలేల మాయలేడి వేటలేల నే రానుపో
చేతకాని శౌర్యమేల,ఈదలేని లోతులేల హా
చరణం2:
బాలకాలుడా,పలనాటి బాలుడా ఏదీ నీ ధైర్యం
కదనవీరుడా,అసహాయశూరుడా కానీ ఘనకార్యం
నీకు మొక్కుతా ఒక మూల నక్కుతా పోరే వద్దంటా
బతుకు దక్కితే బలుసాకు మెక్కుతా పోనీ నన్నిట్టా
అహ కీడు నీడ చూసి నీకు భయమా భీమా
చేయలేదు ఇంతవరకు జీవితభీమా
ఆంజనేయుడా నీ శక్తి తెలుసుకో
అమ్మనాయనో నన్నింక విడిచిపో
జంకుబొంకు లేక నడిచిపో
మాయదారి మాటలేల మాయలేడి వేటలేల నే రానుపో
చేతకాని శౌర్యమేల,ఈదలేని లోతులేల హా
పాడురొంపిలో నన్ను దింపకే,ముందు నుయ్యి వెనుక గొయ్యి చావే ఖాయం
నీరుగారి పారిపోకు నీరసాన జారిపోకు లే మేలుకో
మారుమూల దాగబోకు పిరికిమందు తాగబోకు
No comments:
Post a Comment