22 July 2010

వరించి వచ్చిన మానవ వీరుడు

పల్లవి:

వరించి వచ్చిన మానవ వీరుడు ఎమైనాడమని విచారమా
వరించి వచ్చిన మానవ వీరుడు ఎమైనాడమని విచారమా
ఔన చెలి ఔన సఖి ,ఔన చెలి ఔన సఖి
ఐతే వినవే మా మాట
ఐతే వినవే మా మాట

చరణం1:

నీవు చేసిన మాయలు మించి నవ మన్మధుడే ఆయెనే
అహ నవ మన్మధుడా ఆయెనే
ఒహొ మన్మధుడై నిన్ను ఆవేశించి మైమరపించేనే హల
నిను మైమరపించేనే హల
వరించి వచ్చిన మానవ వీరుడు ఎమైనాడమని విచారమా
ఔన చెలి ఔన సఖి ,ఔన చెలి ఔన సఖి
ఐతే వినవే మా మాట
ఐతే వినవే మా మాట

చరణం2:

అలిగిన చెలిని లాలన సేయ మళయానిలుడే ఆయెనే
ఒహొ మళయానిలుడే ఆయెనే
ఒహొ ఓ ఓ ఓ మళయానిలుడై చల్లగ చెలిపై వలపులు విసిరేనే హల
అహ వలపులు విసిరేనే హల
వరించి వచ్చిన మానవ వీరుడు ఎమైనాడమని విచారమా
ఔన చెలి ఔన సఖి ,ఔన చెలి ఔన సఖి
ఐతే వినవే మా మాట
ఐతే వినవే మా మాట

చరణం3:

చెలి అడుగులలో పూలు జల్లగ లలితవసంతుడె ఆయెనే
అహ లలితవసంతుడె ఆయెనే
కూకూ కుకుకుకూ కు
వసంతుడై నిను కోయిలపాటల చెంతకు పిలిచేనే హల
తన చెంతకు పిలిచేనే హల
వరించి వచ్చిన మానవ వీరుడు ఎమైనాడమని విచారమా
ఔన చెలి ఔన సఖి ,ఔన చెలి ఔన సఖి
ఐతే వినవే మా మాట
ఐతే వినవే మా మాట

No comments:

Post a Comment