23 July 2010

కాదా ఔనా ఏదని మీరు

కాదా! ఔనా
కాదా ఔనా ఏదని మీరు
వాదులొ ఉన్నారనుకొంటా
వాదు ఏదైన వలపు మదిలోన లేదనలేరని నేనంటే ఏమంటారు?

పలుకు పసజూపి తెలివిచూపించ తలచారని నేననుకుంటా
తెలివి కలవారు తమరే కారని తెలియుట మేలని నేనంటే ఏమంటారు?

సిగ్గాపలేక మాటాడలేక తగ్గారని నేననుకుంటా
మూగబోయి అనురాగము కన్నుల మూగిందని నేనంటే ఏమంటారు?

అనుకొని అనుకొని అవేశంలో అవస్థ పడతారనుకుంటా
ఔరా సైయని ఎదటబడితే దిగజారతారని నేనంటే ఏమంటారు?

తారకలే తమ గతులు తపినా జారిపోననీ అనుకుంటా
మారిపోననీ నేనంటా

మారిపోనీ మమతైతే కల నిజమౌతుందని అనుకుంటా
కల నిజమౌతుందని అనుకుంటా ఏమంటారు?

No comments:

Post a Comment