చిఠారు కొమ్మను చిఠారు కొమ్మను
మిఠాయి పొట్లం చేతికందదేం గురుడా
వాటం చూసి వడుపు చేసి వంచర కొమ్మను నరుడ
వాటం చూసి వడుపు చేసి వంచర కొమ్మను నరుడ
హోయ్ చిఠారు కొమ్మను
పక్కను మెలిగే చక్కని చుక్కకు చక్కిలిగింత లేదేం గురుడా
ఆపక్కను మెలిగే చక్కని చుక్కకు చక్కిలిగింత లేదేం గురుడా
కంచు మోతగా కనకం మోగదు నిదానించరా నరుడా
కంచు మోతగా కనకం మోగదు నిదానించరా నరుడా
వాటం చూసి వడుపు చేసి వంచర కొమ్మను నరుడ
హోయ్ చిఠారు కొమ్మను
పండంటి పిల్లకు పసుపు కుంకం నిండుకున్నవేం గురుడా
పండంటి పిల్లకు పసుపు కుంకం నిండుకున్నవేం గురుడా
దేవుడు చేసిన లోపాన్ని నీవు దిద్దుకురారా నరుడా
దేవుడు చేసిన లోపాన్ని నీవు దిద్దుకురారా నరుడా
కొద్దిగ హద్దు మీరరా నరుడా
చిఠారు కొమ్మను
మిఠాయి పొట్లం చేతికందదేం గురుడా
వాటం చూసి వడుపు చేసి వంచర కొమ్మను నరుడ
హోయ్ చిఠారు కొమ్మను
విధవలందరికి శుభకార్యాలు విధిగా చెయమంటావా గురుడ
విధవలందరికి శుభకార్యాలు విధిగా చెయమంటావా గురుడా
అవతారం నీదందుకోసమె అవతారం నీదందుకోసమె
ఆరంభించర నరుడా
వాటం చూసి వడుపు చేసి వంచర కొమ్మను నరుడ
హోయ్ చిఠారు కొమ్మను
చిఠారు కొమ్మను
మిఠాయి పొట్లం చేతికందదేం గురుడా
వాటం చూసి వడుపు చేసి వంచర కొమ్మను నరుడ
హోయ్ చిఠారు కొమ్మను
No comments:
Post a Comment