24 July 2010

సుఖీభవ సుమంగళి సుఖీభవ

సుఖీభవ సుమంగళి సుఖీభవ
సుశీలవై చిరాయువై సుఖీభవ
ఈ బాలవాక్కు బ్రహ్మవాక్కు ఒక్కటేనని
నిండుగా నూరేళ్ళుగా ఉండిపొమ్మని
సుఖీభవ సుమంగళి సుఖీభవ
సుశీలవై చిరాయువై సుఖీభవ

శతమానం భవతి అని నిన్ను దీవించి
గతకాలం స్మృతిలోనే బ్రతుకు సాగించి
ఆ కుంకుమరేకుల కెంపులు పూయగా
ఆ పూసిన పువ్వుల నోములు పండగా
కదలి రావమ్మా ఆ

ఈ బాలవాక్కు బ్రహ్మవాక్కు ఒక్కటేనని
నిండుగా నూరేళ్ళుగా ఉండిపొమ్మని
సుఖీభవ సుమంగళి సుఖీభవ
సుశీలవై చిరాయువై సుఖీభవ

అనురాగం కోవెలలో ఆది దంపతులై
కనులారా మిము చూసే జన్మ ధన్యమై
ఒక జీవిత కాలం చాలని ప్రేమలో
సుఖశాంతులు విరిసే చల్లని తల్లిగా
నిలిచిపోవమ్మా ఆ

ఈ బాలవాక్కు బ్రహ్మవాక్కు ఒక్కటేనని
నిండుగా నూరేళ్ళుగా ఉండిపొమ్మని
సుఖీభవ సుమంగళి సుఖీభవ
సుశీలవై చిరాయువై సుఖీభవ

No comments:

Post a Comment