30 September 2010

శ్రీశైలంలో మల్లన్న సింహాద్రిలో అప్పన్న

శ్రీశైలంలో మల్లన్న సింహాద్రిలో అప్పన్న
తిరపతిలో ఎంకన్న భద్రగిరిలో రామన్న
ఆ దేవుళ్ళందరి కలబోత
అయ్యా సామీ నువ్వేనంటా

దండాలయ్యా సామికి దండలు వేయరా సామికి
దాసుల గాచే సామికి దండకాలు దండాలయ్యా సామికి
దండలు వేయరా సామికి దాసుల గాచే సామికి దండకాలు

కొండంతా అండల్లే కొలువైన
మా రేడు కొంగు బంగారైనాడు
ఈ దొర ఓ మా దొర ఓ

సిరులిచ్చే సంద్రమంటే దైవం మా దొరకి
సెమటోచ్చే వాడంటే ప్రాణం మా సామికి
మచ్చలేని మనిషిరా మచ్చరమే లేదురా
ఎదురులేని నేతరా ఎదురులేని నేతరా
చేతికెముకలేని దాతరా ఎముకలేని దాతరా
ఎదలో నిలుపుకుంటే ఒదిగిపోవు దేవరా

దండాలయ్యా సామికి
దండలు వేయరా సామికి
దాసుల గాచే సామికి దండకాలు

దండాలయ్యా సామికి
దండలు వేయరా సామికి
దాసుల గాచే సామికి దండకాలు

కొండంతా అండల్లే కొలువైన
మా రేడు కొంగు బంగారైనాడు
ఈ దొర ఓ మా దొర ఓ

No comments:

Post a Comment