వక్రతుండా మహాకాయ కోటి సూర్య సమప్రభా
నిర్విఘ్ణం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
జయ జయ శుభకరా వినాయక
శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక
బాహుదా నది తీరంలోన బావిలొన వెలసిన దేవ
మహిలొ జనులకు మహిమలు చాటి ఇహ పరములు ఇడు మహనుభావ
ఇష్టమైనది వదిలిన నీ కడ ఇష్టకమ్యములు తీర్చే గణపతి
కరుణములు కురియుచు వరములు నొసగచు దినకరము పెరిగే మహా కౄతి
సకల చరచర ప్రపంచమే సన్నుడి చేసే విఘ్నపతి
నీ గుడిలొ చేసే సత్య ప్రమాణం ధర్మ దేవతకు నిలుపును ప్రాణం
విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకమున నీ దర్శనం
వెండి బొమ్మవై ప్రతిభను చూపి బ్రహ్మండ నయకుడివి అయినావు
మాతా పితా ప్రదిక్షనలతో మహా గణపతిగా మారావు
భక్తుల మొర ఆలకించుటకు బ్రోచుటకు గజ ముఖ గణపతి అయినావు
బ్రహ్మండమే బొజ్జలొ దాచి లంబోదరుడు అయినావు
లాభము శుభము నీతిని పుర్వగ లక్ష్మి గణపతి అయినావు
వేద పురాణములు అఖిల శాస్త్రములు కధలు చాటును నీ వైభవం
వక్రతుండమే ఓం కారమని విభుదులు చేసే నీ కీర్తనం
No comments:
Post a Comment