11 November 2010

నూటికో కోటికో ఒక్కరు

నూటికో కోటికో ఒక్కరు
ఎప్పుడో ఎక్కడో పుడతారు ||2||
అది మీరే మీరే మాస్టారు
మా దేవుడు మీరే మాస్టారు ||2|| ||నూటికో||

దారే దొరకని చీకటిలో తానే వెలుగై నడిచాడు
జాతే నా వెలుగన్నాడు జాతిపిత మన జాతిపిత
దిక్కులు తెలియని సమయంలో
తానే దిక్కుగ నిలిచాడు శాంతిని నేతగ నిలిపాడు
శాంతిదూత మన శాంతిదూత
ఆ జాతిపిత బాపూజీ మీలో వెలిశాడు
ఆ శాంతి దూత నెహ్రూజీ మీలో కలిశాడు
ఎందరో ఇంకెందరో మీలో ఉన్నారు
మా దేముడు మీరే మాస్టారు ||2|| ||నూటికో||

జరిగే జీవిత సమరంలో జారే నైతిక విలువల్లో
నీతిని నేతగా నిలపాలి నవయువత యువనేత
చుక్కలు మాడే గుండెల్లో నిప్పులు వెలగని గుడిసెల్లో
ఆశను జ్యోతిగా నిలపాలి నవయువత యువనేత
ఈ యువత తాత గాంధీజీ మీలో మిగిలారు
మీ నవతకు నేతాజీ మీలో రగిలారు
అందరూ ఆ అందరూ మీలో ఉన్నారు
దేశానికి మీరే సారధులు ||2||

No comments:

Post a Comment