11 November 2010

చెలియా నీవైపే వస్తున్నా

చెలియా నీవైపే వస్తున్నా
కంటపడవా ఇకనైనా ఎక్కడున్నా

నిద్దురపోతున్న రాతిరినడిగా
గూటికిచేరిన గువ్వలనడిగా
చల్లగాలినడిగా ఆ చందమామనడిగా
ప్రియురాలిజాడ చెప్పరేమనీ
అందరినీ ఇలా వెంటపడి అడగాలా
సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా ||చల్లగాలి||

ఓ అసలే ఒంటరితనం అటుపై నిరీక్షణం
అసలే ఒంటరితనం అటుపై నిరీక్షణం
అరెరే పాపమని జాలిగా చూసే జనం
గోరంత గొడవ జరిగితే కొండంత కోపమా
నన్నొదిలి నువ్వు ఉండగలవ
నిజం చెప్పవమ్మా ||అందరినీ|| ||నిద్దురపోతున్న||

ఓ నువ్వు నా ప్రాణం అని విన్ననించు ఈ పాటని
నువ్వు నా ప్రాణమని విన్నవించు ఈ పాటని
ఎక్కడో దూరానున్నా చుక్కలే విన్నాగానీ
కదిలించలేద కాస్త కూడా నీ మనస్సుని
పరదాలు దాటి ఒక్కసారి పలకరించవేమే ||అందరినీ|| ||నిద్దరపోతున్న||

No comments:

Post a Comment