11 November 2010

తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం

తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం
పరవశమై పాడేనా హృదయం ||తెలియని||

కలకలలాడెను వసంత వనము
మైమరిపించెను మలయా నిలము ||కలకల||
తీయని ఊహల ఊయలలూగి తేలే మానసము ఏమో ||తెలియని||

రోజూ పూచే రోజా పూలు ఒలికించినవి నవరాగాలు ఆ ||2||
పరిచయమైన కోయిల పాటే
కురిసే అనురాగం ఏమో ||తెలియని||

అరుణ కిరణముల గిలిగింతలలో కరిగిన తెలిమంచు తెరలే తరలి ||2||
ఎరుగని వింతలు ఎదుటే నిలిచి వెలుగే వికసించే ఏమో ||తెలియని||

No comments:

Post a Comment