13 November 2010

చుట్టు చుట్టి వచ్చావా చూపుడువేలితో పెల్చావా

చుట్టు చుట్టి వచ్చావా చూపుడువేలితో పెల్చావా
అయ్యొ నా సిగ్గే పారిపోగా
కళ్ళతో ఏదో చూసావా కాయా పండా అడిగావా
నాలోని ప్రాయం రేగిపోగా
చుట్టు చుట్టి వచ్చావా చూపుతో నన్ను కాల్చావా
ముద్దాడే ఆశ ముదిరిపోగా ఎందరో పడుచులు వచ్చారు
నన్ను తొందర పెట్టగ చూసారు
నీవేనను కొంగున కట్టావు
సుందరి సొగసు ఉక్కిరి బిక్కిరి కాగా
సుందర వదనా తీయ్యని వేదన సాగా
చెలి పాంపు గుర్తుతో ప్రేమ ఎన్నికలో గెల్చి నువు వర్ధిల్లు

చుట్టు చుట్టి

నా చెవిని కొరుకు చెవిని కొరుకు
పంటికి గాయపరచు గాయ పరచు
గాజుకి యదనుతాకు యదనుతాకు కాలికి ముద్దులివ్వనా
నా సొగసుతాకు సొగసుతాకు
పెదవికి మనసులాగు మనసులాగు
కంటికి బుగ్గగిల్లు బుగ్గగిల్లు గోటికి ముద్దులివ్వనా
అరె..తుమ్ము వచ్చినా చీమకుట్టినా విడిపోవద్దు
తమ తపన తీరగా ముసుగు కప్పుకొని పడుకోవద్దు
నా కనులుసోలినా చేతులూరుకోవుగా
మన పెళ్ళికి ముందుగ ఊయ్యలూపించకు

చుట్టు చుట్టి

నే పాలవోలె పాలవోలె
పొంగుగ పెరుగువోలె పెరుగువోలె
మారగా తాడు మీద తాడువేసి అయ్యొ చిలికేవా
నే మత్తు మత్తు మత్తు మత్తుగ సోలగ
మత్తు వదిలి మత్తు వదిలిలేవగ
చిత్తగించి కొత్త వలపు అయ్యొ ఒలికేవా
మండుటెండలో ఐస్ఫ్రుట్ లా కరిగే పోకు
చలి వేంద్రమా దాహ మన్నచో తోసెయ్యకు
హద్దు దాటెయ్యకు నన్ను కాటెయ్యకు
నా అధరాని కదరాన్ని అందించిన అడ్డేయకు

చుట్టు చుట్టి

No comments:

Post a Comment