15 November 2010

చిన్నగౌను వేసుకున్న పెద్దపాప హొయ్

చిన్నగౌను వేసుకున్న పెద్దపాప హొయ్ ||2||
నీ చిన్ననాటి ముద్దుపేరు లాలిపప్పా ||చిన్న||
హైటెక్కు టెక్కు చూస్తే హీటు పుట్టు వెంటనే ||2||
ప్లైటెక్కు నిన్ను చేరి కన్నుకొట్టు క్లింటనే ||చిన్న||

నీనోటి మాటచాలు ప్లాటినాలు ఎందుకే
నీ తీపిముద్దు చాలు మారుతీలు ఎందుకే
నీ కొంటెలుక్కు చాలు చెక్కు బుక్కులెందుకే
నీ వంటిలుక్కు చాలు హాటు లిక్కరెందుకే
పైటచాటు చోటుచాలు టైటాను ఇంకెందుకే
నీ గోటితోటి గీటుచాలు ఏ టానిక్కెందుకే
అందాల కోకోనట్టు అంతులేని సోకుపట్టు
కొంతకొంత పంచిపెట్టు ఇంతసేపా ||చిన్న||

నీవేడి ఈలచాలు సెల్యూలార్ లెందుకే
నీ ఈడు లీలచాలు సెల్యులాయి డెందుకే
నీ కన్నె ఊసుచాలు మారిషస్‌ లెందుకే
నీ కస్సుబుస్సు చాలు ఎయిర్ బస్సు లెందుకే
కమ్మనైన పెదవి చాలు అమృతాలు ఎందుకే
చల్లనైన చేయి చాలు అమృతాంజ నెందుకే
కవ్వింత క్లాసులోనా కైగిలింత కోర్సులోనా
నీకు పోటి ఎవరు లేరు నువ్వు తప్ప ||చిన్న||

No comments:

Post a Comment