15 November 2010

ఇంటర్ చదివే రోజుల్లోనే జంటేకట్టే మూడొచ్చిందే

ఇంటర్ చదివే రోజుల్లోనే జంటేకట్టే మూడొచ్చిందే
డిగ్రీలోకి అడుగెట్టేకే నూటమూడు వేడొచ్చింది
నువ్వు కనిపించాకే కవ్వించాకే లవ్వొచ్చింది నవ్వొచ్చింది
హట్సాఫ్ చెప్పేయనా నీ ముందే కేరాఫ్ ఇచ్చేయనా
బేయాస్ బెంగాలైనా నీతోటే టే కాఫ్ తానందనా
జాలీ చేద్దాము జల్సా చేద్దాము ||ఇంటర్||

ఊటీలో కోటిలో నువ్వు నేనే వుండాలి
బళ్లల్లో ఓడల్లో నువ్వు నేనే సాగాలి
భూగోళం ఇరుకైపోతై చెక్కేయాలి రోదసి
మనకోసం రెక్క తెరిచి పరిచేస్తుంది ఊర్వశి
ప్రేమించే డెమక్రసిక్ తకిట తకిట తం
సురగంగ దించేయనా బాత్రూంలో షవరల్లే మార్చేయనా
విచ్చే విచ్చే పూలే మనకు కూలినాలి
వీచే వీచే గాలే మనకు కూలినాలి
వీచే వీచే గాలే మనకు వాకీ టాకీ ||జాలీ||ఇంటర్||

నీరైనా బీరైనా నువ్వు నేనే తాగాలి
ధూళైనా దుమ్మయినా నిన్ను నన్ను తొక్కాలి
సూర్యుణ్ణే చిన్నగమార్చి బల్బే చెయ్యనా
కృష్ణుణ్నే ఫించం అడిగి ప్రేమంతా నే కూర్చనా
ఊగాలి మైకంలోనా తకిట తకిట తం
వీక్లీకి టూ సండేస్ వుండేలా కాలాన్ని సవరించనా ||విచ్చే||ఇంటర్||

No comments:

Post a Comment