17 November 2010

కత్తులతో సావాసం నెత్తుటితో సమాప్తం

కత్తులతో సావాసం నెత్తుటితో సమాప్తం
కక్షల ఈ సమరం కాటికిరా పయనం
ఈ ముల్ల దారుల్లో అడుగేసినా
మిగిలేది సూన్యం నిజం
కత్తులతో సావాసం నెత్తుటితో సమాప్తం

బుద్ధం సరణం గచ్చామి
ధర్మం సరణం గచ్చామి
సంఘం సరణం గచ్చామి

విలువైన బతుకు వెల లేనిదైతే
మరణాన్ని పూజించరా
పుడుతూనే ఎవడో పగ వాడు కాదు
పోయినోడు కూడా రా
ఈ నడుమున నువ్వు విధి ఆట లోన
పావు అయితే ఓడేవురా
కత్తులతో సావాసం నెత్తుటితో సమాప్తం

పగ అన్నదెపుడు ఏమిచ్చె నేస్తం
నష్టాన్నే మిగిలించు రా
క్షణ కాలమైన మనస్సాంతి లేని
బతుకెంత బరువవునురా
బతికేందుకే ఈ బతుకుందని
చచ్చాకా తెలిసేమి రా

కత్తులతో సావాసం నెత్తుటితో సమాప్తం
కక్షల ఈ సమరం కాటికిరా పయనం
ఈ ముల్ల దారుల్లో అడుగేసినా
మిగిలేది సూన్యం నిజం
కత్తులతో సావాసం నెత్తుటితో సమాప్తం

బుద్ధం సరణం గచ్చామి
ధర్మం సరణం గచ్చామి
సంఘం సరణం గచ్చామి
బుద్ధం సరణం గచ్చామి

No comments:

Post a Comment