18 November 2010

అంచెలంచెలు లేని మోక్షము చాల కష్టమే భామినీ

అంచెలంచెలు లేని మోక్షము చాల కష్టమే భామినీ
కష్టమైనను ఇష్టమేనని కోరి నిలిచితి చినమునీ ||అంచెలంచెలు||

అయిన కుదురుగ ఎదుట కూర్చుని గాలి గట్టిగా పీల్చుమా
స్వామీ స్వామీ ఏమీ ఏమీ
నేను పీల్చిన గాలి నిలువక అకటా మీపై విసిరెనే
అకట మీపై విసిరినే అందుకే మరి ||అంచెలంచెలు||

కనులు మూసుకు చూపులు ముక్కుపై నిలుపుమా
స్వామీ స్వామీఈ మారేమీ
అచట నిలువక చుపులన్నీ అయ్యో మీపై దూకెనే
అయ్యో మీపై దూకెనే అదే మరి ||అంచెలంచెలు||

No comments:

Post a Comment