వేయి శుభములు కలుగు నీకు పోయి రావే మరదలా
ప్రాణపదముగ పెంచుకొంటిమి నిను మరవగలేములే ||వేయి||
వాసుదేవుని చెల్లెలా నా ఆశయే ఫలియించెలే||2||
దేవదేవుల గెలువజాలిన బావయే పతి ఆయెనే ||వేయి||
భరతవంశము నేలవలసిన వీరపత్నివి నీవులే||2||
ధీరవీరకుమారునితో మరల వత్తువుగానిలే ||వేయి||
No comments:
Post a Comment