20 November 2010

ఆలుమగల అన్యోన్యం

ఆలుమగల అన్యోన్యం
అంతులేని ఆనందం
పండిన వలపులా దాపత్యం
పాలూ తేనెల మాధుర్యం||2||

మగని మనసు తెలిసీమసిలే మగువే గౄహలక్ష్మీ
మగువమాట తీర్చగలిగేమగడె ఇలవేల్పూ
మమతలోన లేని మైకంమధువులో లేదూ
కోరుకొన్న మమతలుంటేకొరతలే రావూ
ఆలుమగల అన్యోన్యంఅంతులేని ఆనందం
పండిన వలపులా దాపత్యంపాలూ తేనెల మాధుర్యం

సేవలందున దాసిగాభావమెరిగిన మంత్రిగా
వలపులందున రంభగావనిత మెలగాలీ
జీవితమ్మున చెలిడుగాచేయివీడని సఖుడుగా
మరులుగొలిపే మరుడుగామగడు మెలగాలీ

మల్లెకన్న తెల్లనైనదిమగని దరహాసం
మంచుకన్న చల్లనైనదీమగువ సంతోషం
నవ్వులుపూచే నందనవనమేచక్కని సంసారం
నందనంలో కల్పతరువేనాతి సౌభాగ్యం
ఆలుమగల అన్యోన్యంఅంతులేని ఆనందం
ఆలుమగల అన్యోన్యంఅంతులేని ఆనందం
పండిన వలపులా దాపత్యంపాలూ తేనెల మాధుర్యం
ఆలుమగలాఅన్యోన్యం

No comments:

Post a Comment