20 November 2010

ఆకు పచ్చని చేలు అల్లోనేరెల్లో

ఓహోఓహోఓహోఆహాఆహా
ఆకు పచ్చని చేలు అల్లోనేరెల్లో
ఆపైన పైరగాలి అల్లోనేరెల్లో
అందాల మాపల్లె అల్లోనేరెల్లో
ఆనాటి రేపల్లె అల్లోనేరెల్లో
ఆకు పచ్చని చేలు అల్లోనేరెల్లో
ఆపైన పైరగాలి అల్లోనేరెల్లో

నీలిమబ్బుల్లోన కనిపించేవి
బాలకృష్ణుని మేని నిగనిగలే |2|
అల్లరిగాలిలోవినిపించేవి |2|
పిల్లనగ్రోవినవ్వడులే
పాల పొదుగులాఆలమందలే2
ఊరించే తీయని కోరికలే

ఆకు పచ్చని చేలు అల్లోనేరెల్లో
ఆపైన పైరగాలి అల్లోనేరెల్లో

తీయమావిళ్ళ తొలకరిపూతలూ
తెలుగు కన్నియల తొలిసిగ్గులే |2|
చిలిపిగపాడేకలికి కోయిలలూ |2|
పలికేది నెరజాణ భావాలే
ఏటితరగలానీటినురగలా
మెరిసేవిపరువాలచిరునవ్వులే

ఆకు పచ్చని చేలు అల్లోనేరెల్లో
ఆపైన పైరగాలి అల్లోనేరెల్లో
అందాల మాపల్లె అల్లోనేరెల్లో
ఆనాటి రెపల్లె అల్లోనేరెల్లో
ఓహోఓఓఓఓహోఓఓహో
ఓహోఓఓఓఓహోఓఓహో

No comments:

Post a Comment