24 November 2010

చందమామా అందాలమామా

చందమామా అందాలమామా
నీ ఎదుట నేను వారెదుట నీవు
మా ఎదుట ఓ మామ ఎప్పుడుంటావు
పెళ్ళి చూపులకు వారొచ్చారు
చూడాలని నే ఓరగ చూశా
వల్లమాలిన సిగ్గొచ్చింది
కన్నుల దాకా కన్నులు పోక
మగసిరి ఎడదనె చూశాను
తలదాచుకొనుట కది చాలన్నాను ||నీ ఎదుట||

పెళ్ళి చూపులలో బిగుసుకొని
పేరేమి నీ చదువేమి
నను ప్రేమిస్తావా వయసెంత
అని అడిగారా అసలొచ్చారా
నాలో వారు ఏం చూశారో
నా వారయ్యారుఅందులకే
మా ఇద్దరి జంట అపురూపం అంట ||నీ ఎదుట||

చల్లని వెన్నెల దొరవంటారు
తియ్యని నవ్వుల సిరివంటారు
ఆ వెన్నెలలో వేడిగాడ్పులు
నవ్వులలోని నిప్పురవ్వలు
అనుభవించి అనమంటాను
వయసుకు వైరవి నీవంటాను
చందమామా! అందాలమామ ||నీ ఎదుట||

No comments:

Post a Comment