03 June 2010

యా యా యా నెమలి కన్నుల కలయా

యా యా యా నెమలి కన్నుల కలయా
యా యా యా మురళి మోహన కళయా
చిలిపిగా ఓలమ్మో ఏదో తాళం
కడవలో పాలన్నీ తోడే రాగం
కన్నా కన్నా జతై కలసిన లయా
కౌగిళ్ళ నిలయా కవ్వించుకోవయ్యా

నీ లీలలే నా డోలలై
వేడి ఈల వేసే వేణుగానమల్లే
వాలు సందేవేళ చందనాలు చల్లే
మోమాటమే పైపెదవిలో
తేనటీగలొచ్చి కుట్టినట్టు గిల్లే
లేత చెక్కిలంత ఎర్రముగ్గు చల్లే
గోపిక మనువాడే గోవుల కన్నుల్లో
వెన్నెల తెరవేసే పొన్నల నీడల్లో
విరిసిన పూలే జల్లి దీవుల్లోన
తడిపొడి తానలడించే ప్రియా
చిలికినదయా చిలిపిహృదయా కౌగిళ్ళనిలయా

ఈ నాటిదా ఈ సంగమం
చూసి చూడలేని చూపులమ్మ చుంబనం
కంటి రెప్ప చాటు రేతిరమ్మ శొభనం
నీ మాటలే సయ్యాటలై
కొల్లగొట్టనేల కోకమాటువగలే
కన్ను కొట్టనేల కాముడల్లే పగలే
ఎదుకుల గొపెమ్మా ఆ..
ముసిముసి మురిపాలు ఆ...
యమునల వరదమ్మా ఆ..
అడిగెను రాధమ్మా ఆ...
అతిసుఖ రాగాలెన్నో అలాపించే
సాయంత్రాల నీడల్లో
జతై కలసిన లయా కౌగిళ్ళ నిలయా కవ్వించుకోవయ్యా

No comments: