05 September 2015

గోపికమ్మా చాలునులేమ్మా నీ నిదరా

గోపికమ్మా చాలునులేమ్మా నీ నిదరా
గోపికమ్మా నిను విడనీమ్మా మంచు తెరా

విరిసిన పూమాలగా  వెన్నుని ఎద వాలగా  తలపును లేపాలిగా బాలా
పరదాలే తీయక పరుపే దిగనీయక పవళింపా ఇంతగా లేరా
కడవల్లో కవ్వాలు సడి చేస్తున్నా వినక
గడపల్లో కిరణాలు లేలెమన్నా కదలక
కలికి ఈ కునుకేల తెల్లవార వచ్చెనమ్మ

గోపికమ్మా చాలునులేమ్మా నీ నిదరా
గోపికమ్మా నిను విడనీమ్మా మంచు తెరా

నీ కలలన్నీ కల్లలై రాతిరిలో కరగవని
నువ్వు నమ్మేలా ఎదురుగా నిలిచెనే కన్యామణి
నీ కోసమని గగనమే భువి పైకి దిగి వచ్చెనని
ఆ రూపాన్ని చూపుతో అల్లుకుపో సౌదామిని
జంకేల జాగేల సంకోచాల జవ్వని
బింకాలు బిడియాలు ఆ నల్లనయ్య చేత చిక్కి
పిల్లనగ్రోవై ప్రియమార నవ రాగాలే పాడని
అంటూ ఈ చిరుగాలి నిను మేలుకొలుపు సంబరాన

గోపికమ్మా చాలునులేమ్మా నీ నిదరా
గోపికమ్మా నిను విడనీమ్మా మంచు తెరా

ఏడే అల్లరి వనమాలి నను వీడే మనసున దయ మాలి
నంద కుమారుడు మురళీలోలుడు నా గోపాలుడు ఏడే ఏడే
లీలా కృష్ణ కొలనులో కమలములా కన్నె మది
తనలో తృష్ణ తేనెలా విందిస్తానంటున్నది
అల్లరి కన్న దోచుకో కమ్మని ఆశల వెన్న ఇది
అందరి కన్నా ముందుగా తన వైపే రమ్మన్నది

విన్నావా చిన్నారి ఏమందో ప్రతి గోపిక
చూస్తూనే చేజారే ఈ మంచి వేళ మించనీక
త్వరపడవమ్మా సుకుమారి ఏమాత్రం ఏమారక
వదిలావో వయ్యారి బృందావిహారి దొరకడమ్మ

గోపికమ్మా చాలునులేమ్మా నీ నిదరా
గోపికమ్మా నిను విడనీమ్మా మంచు తెరా
గోపికమ్మా చాలునులేమ్మా నీ నిదరా
గోపికమ్మా నిను విడనీమ్మా మంచు తెరా

24 August 2015

ఓ చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాటసాల

Oh my beautiful girl
do you really wanna get on the floor
oh my glittery pearl
lets get to rock n roll

Oh my beautiful girl
do you really wanna get on the floor
oh my glittery pearl
lets get to rock n roll

ఓ చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాటసాల
మల్లిపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల
యే hot hot hot hot mexican tequila
చిక్కినావే చిన్ననాటి ఫేంటసీల
ఓ part part cute indian masala
నీ స్మైలే love symbol  ఆ
ఓ చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాటసాల
మల్లిపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల
Oh my beautiful girl
do you really wanna get on the floor
oh my glittery pearl
lets get to rock n roll
Coniacula కొత్తగుంది కిక్
చేతికందెనె సోకు blank check check
mercury  మబ్బుని పూలతో చెక్కితే
శిల్పమై మారినా సుందరి
కాముడు రాసిన glamour dictonary
నీ నడుము వంపున scenery

ఓ చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాటసాల
మల్లిపూల మాఫియాల రేపినావే నాలోన గోల

love missile లా దూకుతున్న హంస హంస
wildfire పై వెన్నపూస వయసా వయసా
నా ముని వేళ్ళకు కన్నులు మొలిచెనె
నీ సిరి సొగసును తాకితే
నా కను రెప్పలు కత్తులు దూసినే
నువ్విలా జింకలా దొరికితే
ఓ చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాటసాల
మల్లిపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల


జత కలిసే జత కలిసే జగములు రెండు జతకలిసే

జత కలిసే జత కలిసే జగములు రెండు జతకలిసే
జత కలిసే జత కలిసే అడుగులు రెండు జతకలిసే
జనమోక తీరు వీళ్ళోక తీరు ఇద్దరొకలాంటి వారు
అచ్చు గుద్దినట్టు ఒక కలగంటూ ఉన్నారిద్దరు
ఏ కన్ను ఎపుడు చదవని పుస్తకమై వీరు
చదివేస్తున్న రానందంగా ఒక్కరినీ ఇంకొకరూ

నలుపు జాడ నలుసైనా అంటుకోని  హృదయాలు
తలపు లోతున ఆడామగలని గుర్తులేని పసివాళ్ళు
మాటలాడుకోకున్న మది తెలుపుకున్న భావాలు
ఒకరికొకరు ఎదురుంటే చాలులే నాట్యమాడు ప్రాయాలు
పేరుకేమో వేరు వేరు బొమ్మలేమరీ
ఇరువురికి గుండెలోని ప్రాణమొక్కటే కదా
బహుశా బ్రహ్మ పొరపాటులోన ఒక్కరే ఇద్దరు అయ్యారు
ఏ కన్ను ఎపుడు చదవాని పుస్తకమై వీరు
చదివేస్తున్న రానందంగా ఒకరిని ఇంకొకరు

ఉన్నచోటు వదిలేసి ఎగిరిపోయెనీలోకం
ఏకమైన ఈ జంట కొరకు ఏకాంతామివ్వటం కోసం
నీలి రంగు తెర తీసి తొంగి చూసే ఆకాశం
చూడకుండా ఈ అద్బుతాన్ని అసలుండలేదు ఒక నిమిషం
నిన్నరాక ఇందుకేమో వేచి ఉన్నది
ఎడతెగని సంబరాన తేలినారు నేడిలా
ఇప్పుడే కలిసి అప్పుడే వీరు ఎప్పుడో కలిసిన వారయ్యారు
ఏ కన్ను ఎపుడు చదవని పుస్తకమై వీరు
చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరూ

23 August 2015

ధీవర ప్రసర శౌర్య ధార

హు నన హూన్నన హూన్నన హూన్నన నచ్చానా
హు నన హూన్నన హూన్నన హూన్నన అంతగానా
అందని లోకపు చంద్రికనై ఆహ్వానిస్తున్నా
అల్లరి ఆశల అభిసారికనై నీకై చూస్తున్నా ఆ
ధీవర ప్రసర శౌర్య ధార
ఉత్సర స్థిర గంభీర
ధీవర ప్రసర శౌర్య ధార
ఉత్సర స్థిర గంభీర

అలసినా సొలసినా ఒడిలో నిన్ను లాలించనా
అడుగునై నడుపనా నీజంట పయనించనా
పడి పడి తల పడి వడి వడి త్వరపడి వస్తున్నా ఏదేమైనా
సిగముడి విడిచిన శిఖరపు జలసిరి ధారల్ని జటాఝూటంలా
ఢీకొని సవాలని తెగించి నీవైపు దూసుకొస్తున్నా

ఉత్క్రమా అసమ శౌర్యధామ ప్రోధ్గమ తవ భీతిర్మా
ఉత్క్రమా అసమ శౌర్యధామ ప్రోధ్గమ తవ భీతిర్మా

నిలువనా ఎదుగరా నిను రమ్మంది నా తొందరా
కదలికే కదనమై గగనాకెదురీదరా
విజితరిపు రుధిరధార కలిత అసిధర కఠోర
కుల కుధర తిలిత గంభీర జయ విరాట్ వీరా
విలయ గగన తల భీకరా గర్జత్ ధారాధరా
హృదయ రసకాసారా విజిత మధు పారావార

భయదరం సౌ విభవ సింధు సుపర ధం గం భరణ రండి
భయదరం సౌ విభవ సింధు సుపర ధం గం భరణ రండి
భయదరం సౌ విభవ సింధు సుపర ధం గం భరణ రండి
భయదరం సౌ విభవ సింధు సుపర ధం గం భరణ రండి

ధీవర ప్రసర శౌర్య ధార ఉత్సర స్థిర గంభీర
ధీవర ప్రసర శౌర్య ధార ఉత్సర స్థిర గంభీర

ధీవర ధీవర ప్రసర శౌర్య ధార
దరికి చేరరార ఉత్సర సుందర స్థిర గంభీర  చెలి నీదేరా

పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో

పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో
పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా
జంటకట్టేసిన తుంటరోడ నీతో
కొంటె తంటాలనే తెచ్చుకుంటా దొరా
వేయి జన్మాల ఆరాటమై
వేచి ఉన్నానే నీ ముందర
చేయి నీ చేతిలో చేరగా
రెక్క విప్పిందే నా తొందర

పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో
పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా

మాయగా నీ సోయగాలాలు  వేసి
నన్నిలా లాగింది నువ్వే హలా
కబురులతో కాలాన్ని కరిగించే వ్రతమేలా
హత్తుకుపో నను ఊపిరి ఆగేలా
బాహు బంధాల పొత్తిళ్లలో విచ్చుకున్నావే  ఓ మల్లిక
కోడె కౌగిళ్ల ఒత్తిళ్లలో  పురి విప్పింది నా కోరిక

పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో
పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా

కానలో నువు నేను ఒకమేను కాగా
కోనలో ప్రతి కొమ్మ మురిసేనుగా
మరుక్షణమే ఎదురైనా మరణము కూడా పరవశమే
సొంతము నేనే  సొంతము అయ్యాకా
చెమ్మ చేరేటి చెక్కిళ్లలో చిందులేసింది  సిరివెన్నెల
ప్రేమ ఉరేటి నీ కళ్లలో  రేయి  కరిగింది తెలిమంచులా

పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో
పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా
జంటకట్టేసిన తుంటరోడ నీతో
కొంటె తంటాలనే తెచ్చుకుంటా దొరా
                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips