17 August 2011

చంపకమాల నన్ను చంపకే బాలా

Oh Yammaa Lovely baby
My one and only baby
I missing you u like crazy
oh tell me gal you always be my love ||Oh yamma||
I am flowing like a river
Just be with me forever
I won't let you go never
oh come to me gal you are in my mind

చంపకమాల నన్ను చంపకే బాలా
నా దరికి రావా నన్ను నీలో దాచుకోవా
చంపకమాల నన్ను చంపకే బాలా
నాకు దొరికిపోవా నన్ను నీతో పంచుకోవా
బాబ్బాబు నీ మంచే కోరి wanna tell you something
వెంట పడినా ఏం లాభం లేదు I can give you nothing
నా problems నాకున్నాయంటా understand my feelings ||Oh yamma|| ||I am flowing ||

కల్లోకొస్తే నువ్వు లేచి నుంచుoటా నిద్దరంటూ రాకా జోల పాడంటా
బుజ్జిగాడి గోలే వినమoటా
హాయో ఇష్కని వెంటే రాకంటా నువ్వు రిస్కున పడిపోతావంటా
హే నాకున్నదొకటేనటా అది నా మాట వినబోదంటా
అరె నువ్వంటే పడి చస్తదంట దాన్ని కంట్రోలు చేయలేని తంటా
నువ్వు లోవే చెయ్యలేనంటూ ఎస్కేపై పోతుంటే , నోతారు వేడెక్కి అల్లాడిపోతాదే అల్లాడిపోతాదే
చిట్టి గుండే Understand my feelings ||Oh yamma|| ||I am flowing||
చంపకమాల నన్ను చంపకే బాలా

ఆస్తి పాస్తులన్నీ పిచ్చ సూపరే వాస్తు లెక్కలన్నీ బచ్చినాయిలే
ఆగలేక అర్జెంటైనాదే
నేను రోజా పువ్వే అవునంటా ముల్లు గుచ్చేస్తుంది వద్దంటా
నేను కోరేది నీ దగ్గరుందే అది లేకుంటే ఏదోళ ఉందే
వయసు నీ మీద బెంగెట్టుకుందే దాచిపెట్టింది తెచ్చియ్యమందే
దాన్ని అత్తర్లో ముంచేసి, పాకెట్లో చుట్టేసి, పువ్వుల్లో పెట్టేసి నా చేతికిచ్చేయ్ నా చేతికిచ్చేయ్
నీ చిట్టి గుండే wanna tell you something ee ee ||Oh yamma||
I am flowing like a river
you gonna get me never
you gotta think it over
our destiny can never become love
చంపకమాల నన్ను చంపకే బాలా

13 August 2011

అన్నయ్య హృదయం దేవాలయం

అన్నయ్య హృదయం దేవాలయం
చెల్లెలే ఆ గుడి మణిదీపం || అన్నయ్య||
అనురాగమే కొలువున్న దైవం
అనుబంధమే గోపురం
మా అనుబంధమే గోపురం
అన్నయ్య హృదయం దేవాలయం

పంచుకున్నది ఒకటే రక్తం
పెంచుకున్నది ఒకటే పాశం
బ్రతుకున్నది ఆ పాశం కోసం
కోరుకున్నది ఇద్దరి క్షేమం
అన్నయ్య హృదయం దేవాలయం

ఊయలలూపి జోలలు పాడే తల్లినెరగను
మోసుకు తిరిగి ముచ్చట తీర్చే తండ్రినెరగను
కళ్ళు తెరిచి నే చూచినదే ఈ కరుణామూర్తిని
మాట నేర్చి నే పిలిచినదే అన్నా అన్నదీ
అన్నయ్య హృదయం దేవాలయం

కృష్ణుడు పల్కిన గీతవాక్కు
వేదం అయినా ఎందుకు నాకు
నా పాలి వేదం అన్నయ్య పలుకు
అన్నయ్య నవ్వే నా దారి వెలుగు || అన్నయ్య||

08 August 2011

వెన్నెలవే వెన్నెలవే

వెన్నెలవే వెన్నెలవే
నీకోసం వెండిమబ్బు వెదికినదే
నీవు అలా నిదురిస్తే
ఈ కాలం కన్నీరై కరిగినదే
వెన్నెలవే వెన్నెలవే
నీకోసం వెండిమబ్బు వెదికినదే
నీవు అలా నిదురిస్తే
ఈ కాలం కన్నీరై కరిగినదే
మనసే మనసే నీదేలే
నువ్వు లేకుంటే అది లేదే
నీవే నీవే నీవల్లే
హృదయం ఎపుడో విడిచావే

నిన్నే నేను నిన్నే నేను తలిచెదనే
గాలిల్లోన వాసననీదై పీల్చెదనే

వెన్నెలవే వెన్నెలవే
నీకోసం వెండిమబ్బు వెదికినదే

ఏ చోట ఉన్నావే
నా కళ్ళు వేచి వేచి అలసినవే
ప్రేమ ప్రేమ
నీవల్లేలే చదివా నేనే వలపులనే
రాత్రి పగలు ఎపుడైనా
నీకై నేను వెతికానే

ఆడ ఈడ ఎక్కడున్నా వెతికెదనే
అర్ధం లేదే నువ్వే లేని బ్రతుకంటే

నారె నారె నారె నారె నారె రరె రె
నారె నారె నారె నారె నారె రరె రె

06 August 2011

ప ప ప ప పాప పాప పుడతాదింకా పాప

ప ప ప ప పాప పాప పుడతాదింకా పాప
అబ్బాబ్బా బ బ బ బ బ మెరిసే అమ్ములబ్బా
ఇక నుంచి ఆటలే సయ్యటలే దులు దులు తప్ప హ్హహ్హహ్హహ్హ

యో యో యో యో

ప ప ప ప పాప పాప పుడతాదింకా పాప
అబ్బాబ్బా బ బ బ బ బ మెరిసే బొమ్మలాబ్బా
ఇంకా నుంచి ఆటలే సయ్యటలే దులు దులు తప్ప

అన్ని డబ్బులేంటి కృష్ణ ఏం కొనబోతున్నావ్

కన్నుకి కాటుక పూయిస్తా కలికి అందెలు తెచ్చేస్తా
అప్పుడింకేదో చెప్పారే అయ్యయ్యో మరిచానే
ఊ చొక్కా వేసి చూస్తా గౌనులు వేసి చూస్తా
కొట్టులోకి నేను వెళ్తా గుర్రం ఎక్కి

అన్నని పాపకేనా భానుకేం కొనవా
ఆ ఉంది

ఆపిల్స్ వేసుకొస్తా హొర్‌లిక్స్ వేసుకొస్తా
తనని నే చూసుకుంట పసి కందల్లే
కాతుముకి గొలుసు వేయిస్తా
నడుముకి నగలు చేయిస్తా
అప్పుడింకేదో చెప్పారే ఆ ఇదిగో దా
ఒహో ఇది భానుకేనా

ప ప ప ప పాప పాప పుడతాదింకా పాప
అబ్బాబ్బా బ బ బ బ బ మెరిసే బొమ్మలాబ్బా
ఇంకా నుంచి ఆటలే సయ్యటలే దులు దులు తప్ప

ఏం కృష్ణ పాప నాన్న లా ఉండాలా అమ్మలా ఉండాలా
అమ్మ మల్లె ఉండదుగా
నాన్న మల్లె ఉండదుగా
రెండు కలిసిన మెరుపుయిదే ఆ చిరునవ్వే
హ్హహ్హహ్హాహ్
ఏయే ఆ అందమైన నవ్వు ఇదేనా
ఎంతైనా పాప పుట్టబోతుంది మా అందరికి ఏం కొనిస్తావ్
చాక్లెట్ వేసుకొస్తా ఉత్తిక్కే తీసుకెళ్తా ఇంకేనా ఇవ్వగలన
తరవాత చెప్పుతా
సరేయ్ పాప తో ఏం చేస్తావ్
పలక మోగ్గడుకుంటా పక్చంటు పండు ఇస్తా
అప్పుడింకా ఏం చేస్తా ఏంచెస్తావ్
భాను ని అడిగి చెప్తా హ్హహ్హహ్హ
ఐతే ఇంకా భాను తో ఆడుకోవా
పది నెలలు ఆగాలంటా పాపింకా ఎదగాలంటా
ఇప్పుడూరికే ఉండాలంటా డాక్టర్ చెప్పారు డ డు డు డు డు దిదిడ్
ఆటలే సయ్యటాలే డు డు డు డు డా డా

వెలిగినదొక వానవిల్లు

వెలిగినదొక వానవిల్లు
నిను తలవంచి చూసెనే
ఎదలోపల వానలే ఇలా గుచ్చే సరం
నువ్వు నన్ను చూడగ
నన్ను చూడగా ఏమయినదో ప్రేమ
నువ్వు నన్ను తాకగా
నన్ను తాకగ ఏమవుతదో ఏమో
తొలి తొలి గా వయసదిరే
కొన్నాల్లు ఊసు రాదులె
నిన్నే స్మరించినానులే
కలా నిజం ఇంకా

వెలిగినదొక వానవిల్లు
నిను తల వంచి చూసెనే
ఎదలోపల వానలే ఇల గుచ్చే సరం

నీ వస్తేనే నా జన్మలో
పూ పూసేనా చూపులో
నేడెలా నీ ఆగతం
నా జ్ఙాపకం అయ్యిందెలా
వేచుంది పున్నాగలాంటి కన్నే కదా
ఎవ్వడు ఎవ్వడు ఓ మాయడు నన్నాపడు ఇంతే
ఎవ్వడు ఎవ్వడు నన్నెందుకో లాగేస్తడు అంతే
ఇది తెలుసా ఒక విధమౌ
మత్తేదో చల్లినాడుగా మొత్తంగా మార్చినాడుగా
మరో జగం ఇదే

వెలిగినదొక వానవిల్లు
నిను తల వంచి చూసెనే
ఎదలోపల వానలే ఇలా గుచ్చే సరం

నీ ముందుండి సాగితే ఎవరో వెనుకుంది తోసెనో
మౌనమై నేనుండగా గానమై ఎవరూగెనో
నీవున్న క్షణములో గాలి ఈలేసెనో ఓ
అంతే ఓ తొందరై నా ఊహలే చిందేసెనే ఏంటో
వింతల్లే ఎందుకో నా ఆశలై అల్లేసెనే ఎంతో
మెల్ల మెల్లగా సగమవనా
వర్ణాలు నన్ను ముంచెనో వందేళ్ళ వైనం చూపెనో
నిరంతరం ఇలా

తర నన న న నా న నా
తర న న నా న నా
తర నన నా న నా
న నా న నా న నా

05 August 2011

కథ చెబుతానే కథ చెబుతానే

కథ చెబుతానే కథ చెబుతానే
ఏం కథ నాన్న??
రాజా రాణి కథ చెబుతానే, కాకి నక్క కథ చెబుతానే
రాజు కథ కాకి కథ??
ఆఆ ఏం కథ ఏం కథ
కథ కథేందుకు చెప్పొద్దు చెప్పొద్దు
ఎవరైన విని సినిమా తీసేస్తే
కాకి కథ చెప్పు కాకి కథ చెప్పు
రాజా కథ చెప్పు రాజాధీ రాజా ఇళయరాజా కథ చెప్పు

ఒకానొక ఉరిలోన ఒకే ఒక రాజార
ఒకే ఒక రాజేన ఊర్లో ఇంకెవరు లేరా?
అం అం ఉన్నారమ్మ
రాజా వారి మంత్రులు నాలుగు వాళ్ళు ఒట్టి కుజాల్రా
కూజాలా హు హు హుం
ఒకానొక ఉరిలోన ఒకే ఒక రాజార
రాజా వారి మంత్రులు నాలుగు వాళ్ళు ఒట్టి కుజాల్రా

వాడలా పోరు వచ్చెను పోరు లో సైన్యం ఉరికెను
వాడలా పోరు వచ్చెను పోరు లో సైన్యం ఉరికెను
సైన్యమే వెళ్లు విరిచిను డామ్ డామ్ డామ్
సైన్యమా? ఎందుకు??
సైన్యమే ఎందుకురికెను సైన్యమే ఎందుకురికెను
కాకి వడ ఎత్తుకెళ్లింది కదా అదే అందుకే
సైన్యమే ఎందుకూరికెను కాకి వడ ఎత్తుకెళ్లేను
నక్క మరి పాడమన్నది స రీ గా మా ప
కాకి పాడిందా ఓ పాడదా సరేయ్ క క క
అయ్యో వడ పోయిందే కాకి పాపం కదా
రాజా వదులుతాడ హ హ హ హ హ
రాజా పాటే పాడే నక్క వడ నోరు జారే
నాడు రాజా కి ఆ కాకి థాంక్సే చెప్పే
ఊరంత చింది సందళ్ళాయే నక్కళ్లో సంతోషలే పొంగే

అందరు అన్నారు రాజా కి జై
రాజు కి జై రాజు కి జై
ఇది రాజు కథ కాకి కథ?
కాకి రాజా కథ
హాహాహాహాహాహాహ్
కాకి రాజుకి జై కాకి రాజుకి జై

తలిచి తలిచి నే కథ చెబుతే మురిసి మురిసి నువ్వే వింటావే
ఎన్నో కథాలింకా ఉన్నాయే వింటు నన్ను భేష్ అంటావే

ఒకానొక ఉరిలోన ఒకే ఒక రాజా ర
రాజా వారి మంత్రులు నాలుగు అయ్యో మళ్లీ రాజు కథేన?
వీడు ఆ రాజా కధ వేరే రాజా అహ్హహ్హ

హం ఈ రాజాకి ఏం కథ
ఆ సూపర్ మన్ ఆ సూపర్ మన్ ఆ చెప్పకు ఆ చెప్పకు
అనాకొండ కథ చెప్పు అనాకొండ కథ చెప్పు
ఎవరు సర్ ఎవరు సర్ ఆ డైనాసార్

ఆడల రాజనంత డైనాసార్ పీడింసింది
పౌరులే రాజా సభకి వెళ్లారు
డైనోసౌర్ ని వేటాడ్లేక సూపర్ మన్ వళ్ళే మారి
రాజా నే రావాలంటు అడిగారు
వస్తుంటే అనకొండ బెదిరించింది
అనకొండపోయాక సుడి వచ్చింది
హే వస్తుంటే అనకొండ బెదిరించింది
అనకొండ పోయాక సుడి వచ్చింది
సుడి గాలి పోయాక పులి ఉరిమింది
రాజా కెవ్వంటుంటే పులి జడిసింది
డైనాసార్ కదా చావాలి పులి ఎందుకు చక్చింది
ఏ ఏ అందరు అన్నారు రాజా కి జై
రాజా కి జై రాజా కి జై
ఇక చాలు నాన్నా ఆపేసేయ్

తలచి తలచి నే కథ చెబుతే ఇఱుకు ఇఱుకు పది అడిగేవే
ఎన్నో కథాలింకా ఉన్నాయే అన్ని వింటూ భేష్ అంటావే

ఒకానొక ఉరిలోన ఒకే ఒక రాజార
రాజా వారి కథ చెబుతుంటే కునుకు తీయ్ వెన్నేల
లాలలే లాలాలలే లాలలే లాలాలలే
లాలలే లాలాలలే లాలలేల
లాలలే లాలాలలే లాలలేల

తిరిగి తిరిగి నే కథ చెబుతే రెప్ప మూసి నువు విన్నావే
ఎన్నో కథలింకా ఉన్నాయే అన్నీ వింటూ భేష్ అంటావే