27 February 2010

ఓ బంగరు రంగుల చిలకా పలకవే

ఓ బంగరు రంగుల చిలకా పలకవే
ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ నా మీద ప్రేమే ఉందనీ
నా పైన అలకే లేదనీ
ఓ అల్లరి చూపుల రాజా పలకవా
ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ
నా మీద ప్రేమే ఉందనీ
నా పైన అలకే లేదనీ

పంజరాన్ని దాటుకునీ
బంధనాలు తెంచుకునీ నీ కోసం వచ్చా ఆశతో
మేడలోని చిలకమ్మా మిద్దెలోని బుల్లెమ్మా
నిరుపేదను వలచావెందుకే
నీ చేరువలో నీ చేతులలో పులకించేటందుకే

సన్నజాజి తీగుంది తీగ మీద పువ్వుంది
పువ్వులోని నవ్వే నాదిలే
కొంటె తుమ్మెదొచ్చింది జుంటి తేనె కోరింది
అందించే భాగ్యం నాదిలే
ఈ కొండల్లో ఈ కోనల్లో మనకెదురే లేదులే

ఓ అల్లరి చూపుల రాజా పలకవా
ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ
నా మీద ప్రేమే ఉందనీ నా పైన అలకే లేదనీ

లేరు కుశలవుల సాటి సరి వీరులు ధారునిలో

లేరు కుశలవుల సాటి
సరి వీరులు ధారునిలో
లేరు కుశలవుల సాటి
సరి వీరులు ధారునిలో
తల్లి దీవెన తాతయ కరుణ
వెన్నుకాయగా వెరువగనేలా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
తల్లి దీవెన తాతయ కరుణ
వెన్నుకాయగా వెరువగనేలా
భయమును విడువమురా
లేరు కుశలవుల సాటి

బీరములాడి రాముని తమ్ములు
తురమున మాతో నిలువగలేక
బీరములాడి రాముని తమ్ములు
తురమున మాతో నిలువగలేక
పరువము మాసిరిగా
పరువము మాసిరిగా
లేరు కుశలవుల సాటి

పరాజయమ్మే ఎరుగని రాముని
రణమున మేమే గెలిచ్తిమేమి
పరాజయమ్మే ఎరుగని రాముని
రణమున మేమే గెలిచ్తిమేమి
యశమిక మాదేగా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
యశమిక మాదేగా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
యశమిక మాదే ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
లేరు కుశలవుల సాటి
సరి వీరులు ధారునిలో
లేరు కుశలవుల సాటి

మానవుడే మహనీయుడు మానవుడే మహనీయుడు

మానవుడే మహనీయుడు మానవుడే మహనీయుడు (౨)

శక్తియుతుడు యుక్తి పరుడు మానవుడే మాననీయుడు

మానవుడే మహనీయుడు

మంచిని తలపెట్టినచో మనిశి కడ్డు లేదులే

ప్రేరణ దైవానిదైన సాధించును నరుడే

(మానవుడే)



దివిజగంగ భువిదించిన భగీరధుడు మానవుడే

సుస్ధిర తారగ మారిన ధ్రువుడు కూడ మానవుడే

సృశ్టికిప్రతిసృశ్టిచేయువిశ్వామిత్రుడు నరుడె

జీవకోటి సర్వములొ శ్రెసటతముడు మానవుడే

(మానవుడే)



గ్రహారాశులనధిగమించి ఘన తారల పధమునుంచి (౨)

గగనాంతర రోధసిలో గంధర్వగోళగతుల దాటి (౨)

చెంద్రలోకమైన దేవేంద్రలోకమైన బొందితో జయించి మరల భువికి తిరిగిరాగలిగే

మానవుడే మహనీయుడు

మానవుడే మహనీయుడు మానవుడే మహనీయుడు

శక్తియుతుడు యుక్తి పరుడు మానవుడే మాననీయుడు

మానవుడే మహనీయుడు

26 February 2010

కో అంటే కోయిలమ్మ కోకో.. కో అంటె కోడిపుంజు కొక్కరకో

కో అంటే కోయిలమ్మ కోకో.. కో అంటె కోడిపుంజు కొక్కరకో
కో అంటే కోయిలమ్మ కోకో.. కో అంటె కోడిపుంజు కొక్కరకో
కొండ మీద కో అంటే చుక్కలన్ని కోసుకో
నేల మీద కో అంటే పండింది కోసుకో ...కోసుకో..
కో కాసుకో...
కో అంటే కోయిలమ్మ కోకో.. కో అంటె కోడిపుంజు కొక్కరకో


కోటేరు పట్టినోడికో.. పూట కూడు దక్కదెందుకో
నారు నీరు పోసినోడుకో.. శేరు గింజలుండవెందుకో
అన్నం ఉండదొకడికి తిన్నదరగదొకడికి
ఆశ చావదొకడికి ఆకలారదొకడికీ

కో కాసుకో...
కో అంటే కోయిలమ్మ కోకో.. కో అంటె కోడిపుంజు కొక్కరకో

మేడిపండు మేలిమెందుకో.. పొట్ట ఇప్పి గుట్టు తెలుసుకో
చీమలల్లే కూడబెట్టుకో.. పాములొస్తే కర్రపట్టుకో కో..
పాములొస్తే కర్రపట్టుకో కో..ఒ..ఒ..
కో.. అంటే మేలుకో లోకాన్ని తెలుసుకో
కో.. అంటే మేలుకో లోకాన్ని తెలుసుకో
వేమన్న వేదాలు చెపుతా రాసుకో.. రాసుకో... కో కాసుకో
కో అంటే కోయిలమ్మ కోకో కో అంటె కోడిపుంజు కొక్కరకో

తూరుపింటి ఆంకాళమ్మ కో... కో ...
పడమటింటి పోలేరమ్మ కొక్కో...
దక్షిణాన గంగానమ్మ కో.. కో ..
ఉత్తరాన నూకాలమ్మ కొక్కరకో
కో.. అంటే కోటిమంది అమ్మతల్లులున్నా
పంట చేను కాపలాకు నేను ఎందుకో .. కో... కాసుకో ...
కో అంటే కోయిలమ్మ కోకో.. కో అంటె కోడిపుంజు కొక్కరకో
కొండ మీద కో అంటే చుక్కలన్ని కోసుకో
నేల మీద కో అంటే పండింది కోసుకో ...కోసుకో..

నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా

నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా
నువు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా
నీ ముద్ధూ ముచ్చట కాదన్టాన
సరదా పడితే వద్ధన్తానా హయ్య…- 2

(నీ కోసమే మరు-మల్లెలా పూచిన్ధి నా సొగసూ…
నీ పూజకీ కర్పూరమై వెలిగిన్ధి నా మనసూ…) - 2
దాచినడంత నీ కొరకే… - 2
నీ కోరిక తీర్చే మది-స్పందన చేసే
నా వొళ్ళంతా ఊపేస్తూ ఉంటే…
నాలో ఏదో అవుతోంది ||నువ్వడిగింధీ ఏనాడైనా


నీ మగతనం… నా యవ్వనం… శృంగారమే చిలికె
యీ అనుభవం… యీ పరవసమ్… సంగీతమై పలికే
పరుగులు తేసే నా పరువూ… - 2
నీ కధలే వింధీ… నువు కావాలన్ధీ
నా పాటేమీ వినకున్డ ఉంది
నీకు నాకె జొడన్ది…

నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా
నువు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా
నీ ముద్ధూ ముచ్చట కాదన్టాన
సరదా పడితే వద్ధన్తానా హయ్య

15 February 2010

ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం

ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం ప్రణవ మూల నాదం
ప్రథమలోకపాదం ప్రణతులే చేయలేని ఈ తరమేల ఈ కరమేల
ఈ పాదం పుణ్యపాదం ధరనేలే ధర్మపాదం

మార్కండేయ రక్షపాదం మహాపాదం ఆ...
భక్తకన్నప్ప కన్న పరమపాదం భాగ్యపదం
ఆత్మలింగ సయంపూర్ణ ఆత్మలింగ స్వంపూర్ణుడే సాక్షాత్కరించినా
చేయూతవీడినా అయ్యో అందని అనాధనైతి మంజునాధా
ఈ పాదం పుణ్యపదం ధరనేలే ధర్మపదం
ప్రణయమూల పాదం ప్రళయ నాట్యపాదం
ప్రణతులే చేయలేని ఈ శిరమేల ఈ బ్రతుకేల

భక్త శిరియాళు నేలిన హేమపాదం
బ్రహ్మ విష్ణులే భుజించే ఆదిపాదం అనాదిపాదం
అన్నదాత విశ్వదాత లీలా వినోదిగా
నన్నేలగా దిగిరాగా అయ్యో చీ
పొమ్మంటి నే పాసినై తినే ఈ పాదం పుణ్యపాదం ఈపాదం
ధర్మపాదం
సకల ప్రాణపాదం సర్వమోక్ష పాదం
తెలుసుకోలేని నా ఈ తెలివేల ఈ తనువేల

13 February 2010

హైలో హైలేసా - హంసకదా నా పడవ

హైలో హైలేసా - హంసకదా నా పడవ
ఉయ్యాల లూగినది - ఊగీస లాడినది
హైలో హైలేసా హంసకదా నా పడవ


ఓహోహై - ఓ హోహై,
నదిలో నా రూపు నవనవ లాడినది,
మెరిసే అందములు మిలమిల లాడినవి
వయసూ వయారమా - పాడినవి పదేపదే 1 హైలో 1


ఎవరో మారాజా -
ఎదుట నిలిచాడుఎవో చూపులతో
సరసకు చేరాడుమనసే చలించునే
మాయదారి మగాళ్ళకి 1 హైలో 1

ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్నమాట

ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్నమాట
ఏ ఊరు వెళతారు? ఏదీ కాని వేళ

పసివాని చూచుట కీ తొందరా?
మైమరచి ముద్దాడి లాలింతురా?
శ్రీమతికి బహుమతిగ ఏమిత్తురో
ఇచ్చేందుకేముంది మీ దగ్గరా

అబ్బాయి పోలిక ఈ తండ్రిదా?
అపురూపమైన ఆ తల్లిదా?
అయ్యగారి అందాలు రానిచ్చినా
ఈ బుద్ధి రానీకు భగవంతుడా..

ప్రియమైన మా యిల్లు విడనాడిపోతే
తలదాచుకొన మీకు తావైన లేదే
కపటాలు మానేసి నా మదిలోన
కాపురం చేయండి కలకాలము

ముత్యాల చెమ్మచెక్క రత్నాల చెమ్మచెక్క

ముత్యాల చెమ్మచెక్క రత్నాల చెమ్మచెక్క
ఓ చెలి మురిపెముగా ఆడుదమా
కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగల లాడ //ముత్యాల//

తళ తళ తళ తళ మెరిసే సొగసు
ఇంపైన సంపంగి అమ్మాయి మనసూ పరువము వేసిన పందిరిలో
బుజబుజ రేకులు పూయవలె //ముత్యాల//

ఒప్పులకుప్ప - వయ్యారి భామా
సన్నబియ్యం - చాయపప్పు
చిన్నమువ్వ - సన్నగాజు
కొబ్బరికోరు - బెల్లప్పచ్చు
గూట్లో రూపాయ్ - నీ మొగుడు సిపాయ్
రోట్లో తవుడు - నీ మొగుడెవడు

ఘుమ ఘుమ ఘుమ ఘుమ చారెడేసి మొగ్గలు
గులాబి జవ్వాది అమ్మాయి బుగ్గలు
ఆడిన ఆటలు నోములయి కోరిన పెనిమిటి దొరకవలె //ముత్యాల//

నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా.. క్రిష్ణయ్యా..

నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా.. క్రిష్ణయ్యా..
నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా.. క్రిష్ణయ్యా..

వేణువు విందామని.. నీతో వుందామని..
నీ రాధ వేచేనయ్యా రావయ్యా..
ఓ..ఓ..ఓ..గిరిధర.. మురహర..
రాధా మనోహరా..ఆఆ..ఆఆ..ఆఆ.

||నువ్వు||

నీవూ వచ్చే చోటా... నీవు నడిచే బాటా..
మమతల దీపాలు వెలిగించాను ||2||
కుశలము అడగాలని.. పదములు కడగాలని..
కన్నీటి కెరటాలు తరలించాను..
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
గిరిధర.. మురహర.. నా హృదయేశ్వరా
నీ రాధ గుండెలలో తాపము చల్లార్చ రా ||2||
కృష్ణయ్యా..ఓ..కృష్ణయ్యా..||2||


నీ పద రేణువునైనా.. పెదవుల వేణువునైనా..
బ్రతుకే ధన్యమని భావించాను.. ||2||
నిన్నే చేరాలని.. నీలో కరగాలని..
నా మనసే హారతి గా వెలిగించాను..
గోవింద.. గోవింద..గోవింద.. గోపాలా

వేదంలా ఘోషించె గోదావరి

వేదంలా ఘోషించె గోదావరి
అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రి
వేదంలా ఘోషించె గోదావరి
అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రి
శతాబ్దాల చరితగల సుందర నగరం
శతాబ్దాల చరితగల సుందర నగరం
గత వైభవ దీప్తులతొ కమ్మని కావ్యం

||వేదంలా||

రాజరాజ నరేంద్రుడు కాకతీయులు
తేజమున్న మేటిదొరలు రెడ్డిరాజులు
గజపతులు నరపతులు ఏలిన ఊరు
ఆకధలన్ని నినదించే గౌతమి హోరు

||వేదంలా||

శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షోముఖాన్వేషు
ఏలోకానాం స్తితి మావహంచ విహితాం స్త్రీ పుంసయోగోద్భవాం
తే వేదత్రయ మూర్తాయ స్త్రి పురుషా సంపూజితా వస్సురై ర్భూయాసుహు
పురుషోత్తమాం భుజభవ శ్రీకంధరా శ్రేయసే

ఆదికవిత నన్నయ్య వ్రాసెనిచ్చట
శ్రీనాధకవి నివాసము పెద్ద ముచ్చట
ఆదికవిత నన్నయ్య వ్రాసెనిచ్చట
శ్రీనాధకవి నివాసము పెద్ద ముచ్చట
కవి సార్వభౌములకిది ఆలవాలము
కవి సార్వభౌములకిది ఆలవాలము
నవ కవితలు వికసించే నందనవనమూ

||వేదంలా||

దిట్టమైన శిల్పాల దేవళాలు
కట్టుకధల చిత్రాంగి కనక మేడలు
దిట్టమైన శిల్పాల దేవళాలు
కట్టుకధల చిత్రాంగి కనక మేడలు
కొట్టుకొనిపోయే కొన్ని కోటిలింగాలు
వీరేశలింగ మొకడు మిగిలెను చాలూ

||వేదంలా||

సరికొత్త చీర ఊహించాను సరదాల సరిగంచు నేయించినాను

సరికొత్త చీర ఊహించాను సరదాల సరిగంచు నేయించినాను
మనసు మమతా పడుగు పేక చీరలో చిత్రించినాను
ఇది ఎన్నో కలల కలనేత నా వన్నెల రాశి కి సిరి జోతా

ముచ్చట గొలిపే మోగాలి పొత్తుకు ముల్లు వాసన ఒక అందం
అభిమానం గల ఆడపిల్లకు అలకా కులుకు ఒక అందం
ఈ అందాలన్ని కల బోస్తా నీ కొంగుకు చెంగునా ముడి వేస్తా
ఇది ఎన్నో కలల కాలానేత నా వన్నెల రాశి కి సిరి జోతా
నేయా వన్నెల రాశి కి సిరి జోతా

చుర చుర చూపులు ఒక మారు ని చిరు చిరు నవ్వులు ఒక మారు
మూతి విరుపులు ఒక మారు నువ్వు ముద్దుకి సిద్దం ఒక మారు
నువ్వు ఏ కాలనున్న మహా బాగే ఈ చీర విశేషం అలాగే
నువ్వు ఏ కాలనున్న మహా బాగే ఈ చీర విశేషం అలాగే

సరికొత్త చీర ఊహించాను సరదాల సరిగంచు నేయించినాను
మనసు మమతా పడుగు పేక చీరలో చిత్రించినాను
ఇది ఎన్నో కలల కలనేత నా వన్నెల రాశి కి సిరి జోతా

నా వన్నెల రాశి కి సిరి జోతా .........

టాటా వీడుకోలు… గుడ్ బై ఇంకా సెలవు

టాటా వీడుకోలు… గుడ్ బై ఇంకా సెలవు
తొలినాటి స్నేహితులారా… చెలరేగే కోరికలారా…
టాటా వీడుకోలు… గుడ్ బై ఇంకా సెలవు…
టాటా వీడుకోలు…

ప్రియురాలి వలపులకన్నా నునువెcచనిదెది లేదని…
నిన్ననే నాకు తెలిసింది… ఒక చిన్నది నాకు తెలిపింది…
ఆ… ప్రేమ నగరుకే పోతాను… పోతాను… పోతాను…
ఈ… కామ నగరుకు రాను… ఇక రాను…

టాటా వీడుకోలు గుడ్ బై ఇంకా సెలవు
టాటా వీడుకోలు…

ఇచ్చుటలో ఉన్న హాయీ వేరెచ్ఛటను లేనే లేదనీ…
లేటుగా తెలుసుకున్నాను… నా లోటును దిద్దుకున్నాను
ఆ స్నేహ నగరుకే పోతాను… పోతాను… పోతాను…
ఈ మోహా నగరుకు రాను… ఇక రాను…

టాటా వీడుకూలు గుడ్ బై ఇంకా సెలవు
టాటా వీడుకోలు…

మధుపాత్ర కెదలొ ఇంక ఏమాత్రం చోటు లేదనీ… -
మనసైన పిల్లె చెప్పింది… -
నా మనసంతా తానై నిండింది
నే… రాగ నగరుకే పోతాను…
అనురాగ నగరుకే పోతాను… పోతాను…

వేదంలా ఘోషించే గోదావరి అమరధామమ్ లా శోభించే రాజమహేంద్రీ

వేదంలా ఘోషించే గోదావరి అమరధామమ్ లా శోభించే రాజమహేంద్రీ
శతాబ్దాల చరిత గల సుందర నగరం
గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం

రాజ రాజ నరేంద్రుడు కాకతీయులూ తేజమున్న మేటి దొర లు రెడ్డి రాజులు
గజపతులు నరపతులూ ఏలీనా వూరు
ఆ కధలన్నీ నినదించే గౌతమి హోరు

1|| ఆది కవిత నన్నయ్యా వ్రాసేనిచట
శ్రీనాధ కవి నివాసము పెద్ద ముచ్చటా
కవి సార్వ భౌములకిది ఆలవాలము
నవకవితలు వికసించే నందన వనము

2|| దిట్ట మైన శిల్పాల దెవళాలు
కట్టు కధల చిత్రాంగి కనక మే డలు
కొట్టు కొని పోయే కొన్ని కోటి లింగాలు
వీరెసలిన్గమొకడు మిగిలేను చాలు

కనిపించిన ఛాయతోనే కలవరించిపోయేదొకరు

కనిపించిన ఛాయతోనే కలవరించిపోయేదొకరు
వినిపించిన మాయకోసం వెతికి వెతికి పోయేదొకరు
కనిపించిన ఛాయతోనే కలవరించిపోయేదొకరు

తపన ఆగిపోగానే వలపు వీగిపోయేను
తపన ఆగిపోగానే వలపు వీగిపోయేను
పోనీ వెతికి పోని వలపే బ్రతికి పోనీ

కనిపించిన ఛాయతోనే కలవరించిపోయేదొకరు
వినిపించిన మాయకోసం వెతికి వెతికి పోయేదొకరు
కనిపించిన ఛాయతోనే కలవరించిపోయేదొకరు

సింగపూరు సింగారి వయసు పొంగు వయ్యారి

సింగపూరు సింగారి వయసు పొంగు వయ్యారి
రాజమండ్రి కోడలుగ రానుంది
అహ సింగపూరు సింగారి వయసు పొంగు వయ్యారి
రాజమండ్రి కోడలుగ రానుంది
రాజమండ్రి కోడలుగ రానుంది అహహహ
మన్మధలీలమ్మ ఈ జన్మకు చాలమ్మ
ఇది మన్మధలీలమ్మ ఈ జన్మకు చాలమ్మ
సింగపూరు సింగారి వయసు పొంగు వయ్యారి
రాజమండ్రి కోడలుగ రానుంది
రాజమండ్రి కోడలుగ రానుంది
దొరికింది గుర్రపు నాడం దొరుకుతుందనుకుంటి గుర్రం
ఊరంత గాలించినాను గాడిదై పోయాను నేను
నేనలసిపోయి సొలసిపోయి మరచిపోయి నిలిచిపోతే మెరుపల్లే వచ్చావు శంభో
నా నిదురపోయి అదిరిపోయి మూగపోయి ఆగిపోతె గిలిగింత పెట్టావు శంభో

ఇది మన్మధలీలమ్మ ఈ జన్మకు చాలమ్మ
ఇది మన్మధలీలమ్మ ఈ జన్మకు చాలమ్మ
సింగపూరు సింగారి వయసు పొంగు వయ్యారి
రాజమండ్రి కోడలుగ రానుంది
రాజమండ్రి కోడలుగ రానుంది

నీ కళ్ళు నా కళ్ళు కలిసి నీ కోర్కె నా కోర్కె తెలిసి
నీ సొగసు పువ్వల్లే విరిసి నా వయసు గువ్వల్లే ఎగసి
నేనదును చూసి తెగువ చేసి చెయ్యి వేసి చుట్టుకుంటె మంచల్లే కరిగావే శంభో
నీ సిగ్గు చూసి ఆకలేసి చెమట పోసి దాహమేసి అల్లాడిపోతున్న శంభో

ఇది మన్మధలీలమ్మ ఈ జన్మకు చాలమ్మ
ఇది మన్మధలీలమ్మ ఈ జన్మకు చాలమ్మ
సింగపూరు సింగారి వయసు పొంగు వయ్యారి
రాజమండ్రి కోడలుగ రానుంది
రాజమండ్రి కోడలుగ రానుంది

నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ నీసరి ఎవరమ్మ

నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ నీసరి ఎవరమ్మ
దినమొక రకము గడసరితనము
దినమొక రకము గడసరితనము
నీలో కలవమ్మ నీవొక కళవమ్మ
నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ

నువ్వే నువ్వయ్య నవ్వులరవ్వయ్య నీసరి ఎవరయ్య
దినమొక రకము గడసరితనము
దినమొక రకము గడసరితనము
నీకై కలవయ్య నా కళ నీవయ్య
నీకై కలవయ్య నా కళ నీవయ్య

ఒకే రోజు దినము దినము ఒక గమకం ఒక మధురం
ఒకే రోజు దినము దినము ఒక గమకం ఒక మధురం
ఒక మేఘం క్షణ క్షణము ఒక రూపం ఒక శిల్పం
ఆ సరిగమలు ఆ మధురిమలు
నీకై కలవయ్య నా కళ నీవయ్య
నీకై కలవయ్య నా కళ నీవయ్య

ఒకే వెన్నెల జత జతకు ఒక సౌరు ఒక పోరు
ఒకే వెన్నెల జత జతకు ఒక సౌరు ఒక పోరు
ఒక కౌగిలి ప్రతి రేయి ఒక స్వర్గం ఒక దుర్గం
ఆ జివజివలు ఆ మెలుకువలు
నీలో కలవమ్మ నీవొక కళవమ్మ
నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ

నువ్వే నువ్వయ్య నవ్వులరవ్వయ్య నీసరి ఎవరయ్య
దినమొక రకము గడసరితనము
నీలో కలవమ్మ నీవొక కళవమ్మ
నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ

ప్రతి ఋతువు ఈ ప్రకృతికి ఒక వింత పులకింత
ప్రతి ఋతువు ఈ ప్రకృతికి ఒక వింత పులకింత
మనసుంటే మనకోసం ప్రతి మాసం మధుమాసం
ఋతువుల సొగసు చిగురుల వయసు
నీకై కలవయ్య నా కళ నీవయ్య
నీకై కలవయ్య నా కళ నీవయ్య

నీ కళ్ళు నా కళ్ళు కలిసుంటే విరిజల్లు
నీ కళ్ళు నా కళ్ళు కలిసుంటే విరిజల్లు
మమతలతో మనసల్లిన హరివిల్లే మన ఇళ్ళు
వలపుల జల్లులు పలుపలు వన్నెలు
నీలో కలవమ్మ నీవొక కళవమ్మ
నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ

నువ్వే నువ్వయ్య నవ్వులరవ్వయ్య నీసరి ఎవరయ్య
దినమొక రకము గడసరితనము
దినమొక రకము గడసరితనము

హల్లో నేస్తం బాగున్నావా

హల్లో నేస్తం బాగున్నావా
హల్లో నేస్తం గుర్తున్నానా
హల్లో నేస్తం బాగున్నావా
హల్లో నేస్తం గుర్తున్నానా
నేనే నువ్వొయ్ నువ్వే నేనోయ్
నెనరు నెయ్యం మనమిద్దరమోయ్
నేనే నువ్వొయ్ నువ్వే నేనోయ్
నెనరు నెయ్యం మనమిద్దరమోయ్
మినిజూగా ఫ్రండ్స్‌ ఇన్‌ మలేషియా
అరౌండ్ ది వరల్డ్ friendship welcomes యు
మినిజూగా ఫ్రండ్స్‌ ఇన్‌ మలేషియా
అరౌండ్ ది వరల్డ్ friendship welcomes యు
హల్లో నేస్తం బాగున్నావా
హల్లో నేస్తం గుర్తున్నానా

ఊగే అలపై సాగే పడవ ఒడ్డు పొడ్డు చేర్చింది
ముచ్చటలన్ని మోసే గాలి దిక్కుదిక్కులను కలిపింది
కలకల పోయే చిలుకల గుంపు వరసా వావి నేర్పింది
నేల పీటగా నింగి పందిరిగా జగతికి పెళ్ళి జరిగింది
సాయా అన్నా సింగపూరా
సాయారుక మలేషియా
సాయారేమో ఇండియా
సాయావాడ చైనా
హల్లో నేస్తం బాగున్నావా,హల్లో నేస్తం గుర్తున్నానా

ఏ కళ్ళైనా కలిసాయంటే కలిగేదొకటే అనురాగం
ఏ మనసైనా తెరిసాయంటే తెలిపేదొకటే ఆనందం
సరిగమలైనా డొరనిపలైనా స్వరములు ఏడే గానంలో
పడమటనైనా తూరుపునైనా స్పందన ఓకటే హృదయంలో
సాయా అన్నా సింగపూరా
సాయారుక మలేషియా
సాయారేమో ఇండియా
సాయావాడ చైనా
హల్లో నేస్తం బాగున్నావా,హల్లో నేస్తం గుర్తున్నానా
చైనా ఆట మలయా మాట హిందూ పాట ఒకటేను
నీ నా అన్నది మానాలన్నది నేటి నినాదం కావాలోయ్
సాయా అన్నా సింగపూరా
సాయారుక మలేషియా
సాయారేమో ఇండియా
సాయావాడ చైనా

హల్లో నేస్తం బాగున్నావా,హల్లో నేస్తం గుర్తున్నానా
నేనే నువ్వొయ్ నువ్వే నేనోయ్
నెనరు నెయ్యం మనమిద్దరమోయ్
మినిజూగా ఫ్రండ్స్‌ ఇన్‌ మలేషియా
అరౌండ్ ది వరల్డ్ friendship welcomes యు
మినిజూగా ఫ్రండ్స్‌ ఇన్‌ మలేషియా
అరౌండ్ ది వరల్డ్ friendship welcomes యు

శంభో శివ శంభో శివ శంభో శివ శంభో

శంభో శివ శంభో శివ శంభో శివ శంభో
వినరా ఓరన్నా అనెరా వేమన్న
జగమే మాయన్నా శివ శంభో
నిన్న రాదన్న రేపూ లేదన్న నేడే నీదన్న శివ శంభో
వినరా ఓరన్నా అనెరా వేమన్న
జగమే మాయన్నా శివ శంభో
నిన్న రాదన్న రేపూ లేదన్న నేడే నీదన్న శివ శంభో

అందాన్ని కాదన్న ఆనందం లేదన్న
బంధాలు వలదన్న బ్రతుకంతా చేదన్న
సిరులున్నా లేకున్నా చెలితోడు నీకున్నా
అడవిలో నువ్వున్నా అది నీకు నగరంరా

వినరా ఓరన్నా అనెరా వేమన్న
జగమే మాయన్నా శివ శంభో
నిన్న రాదన్న రేపూ లేదన్న నేడే నీదన్న శివ శంభో


ఈ తేటిదీ పువ్వు అని అన్నదెవరన్న
ఏ తేనె తాగిన తీపొకటేకదరన్న
నీదన్న నాదన్న వాదాలు వలదన్న
ఏదైనా మనదన్న వేదాన్నే చదువన్న
ఊరోళ్ళ సొమ్ముతో గుడికట్టి గోపన్న
శ్రీరామ భక్తుడై పేరొందెరోరన్న
భక్తైనా రక్తైనా భగవంతుడేనన్న
ఈనాడు సుఖమన్న ఎవడబ్బ సొమ్మన్న

వినరా ఓరన్నా అనెరా వేమన్న
జగమే మాయన్నా శివ శంభో
నిన్న రాదన్న రేపూ లేదన్న నేడే నీదన్న శివ శంభో

పడవ వచ్చిందే పిల్లా పండుగ వచ్చిందే

పడవ వచ్చిందే పిల్లా పండుగ వచ్చిందే

పండుగ వచ్చిందోయ్ మావా పండూ

వెన్నెలవచ్చింది ..పండూ వెన్నెల పడుచుదనంతో పందెం వెసింది (పడవ)



నీలిసంద్రం పొంగి పొంగి నింగిని రమ్మంది

నీలాకాశం వంగీ వంగీ నాకో ముద్దందీ

చిలిపి గాలీ గోలచెసింది చిన్నదానికి

సిగ్గూ కమ్మింది బుగ్గా కందింది-హాయ్ బుగ్గా కందింది (పడవ)



చిన్నతనంలో కట్టామిక్కడ ఎన్నో పిచ్చుక గూళ్ళ్లు

పరువంలో అదె ఫలించె పిల్లా వెచ్చని కౌగిళ్ళ్లూ ..ఈ వెచ్చని కౌగిళ్ళ్లూ

అద్రుశ్ట దేవత తెరిచెను కళ్ళ్లూ

అందరికిద్దాం భాగాలూ

ఈ కలిమి నిచ్చినా దేవుని కాళ్ళ్ల కు రోజూ

పెడదాం దండాలు- ప్రతి రోజూ పెడదాం దండాలు

పచ్చగ వుందామూ ముద్దూ ముచ్చట గూందాము (పడవ)

పాటకు పల్లవి ప్రాణం, నా జీవనజీవం గానం

ఆ . . .

పాటకు పల్లవి ప్రాణం, నా జీవనజీవం గానం

పాటకు పల్లవి ప్రాణం, నా జీవనజీవం గానం

అహం అలా కాదు, . . . జీవనజీవం గానం

పాటకు పల్లవి ప్రాణం, నా జీవనజీవం గానం

పాటకు పల్లవి ప్రాణం

సా

రీ

గా

మా

పా దా నీ సా

సరిగమపదని సప్తస్వరాలూ నా సిరులూ చెలులూ దివ్యవరాలూ

పాటకు పల్లవి ప్రాణం . .



ఞవ్వని మువ్వల ఘలఘలలూ (2)

జలపాతాల జలజలలూ

గువ్వలజంటల కువకువలూ సంగీతానికి శృతులూ లయలూ

పాటకు పల్లవి ప్రాణం . .



(నేలా నింగీ లాలనలో మావీ మలతి మేళనలో) (2)

నీవే నేనను భావనలో

అనురాగాలే మన రాగాలు

మన రాగాలే మన రాజ్యాలు

(పాటకు పల్లవి ప్రాణం)

చిటాపటా చినుకులతో కురిసింది వాన మెరిసింది జాణ

చిటాపటా చినుకులతో కురిసింది వాన మెరిసింది జాణ (చిటా..)

తళాతళా మెరుపులతో మెరిసింది పైన ఉరిమింది లోన (తళా..)



వచ్చే వచ్చే వానఞల్లు ఞల్లు కాదది

పొంగివచ్చు పడుచుదనం వరదలే అది

వరద కాదది ఆగలేని చిలిపితనం వాగులే అది నీ వేగమే అది (చిటా..)



నల్లమబ్బు తెల్లమబ్బు ముద్దులాడుకున్నవి

చుక్కలన్ని చీకట్లో ముసుగు కప్పుకున్నవి

ఉల్లిపొర చీర తడిసి ఒంటికంటుకున్నది

మెరిసి మెరిసి రెండు కళ్లు వాకిళ్లు కావవి

వలపు తేనెలూరే రసగుళ్లులే అవి సెలయేళ్లులే అవి (తళా..)

శ్రీమతి ఏమన్నా శ్రీవారు తందాన తాన

శ్రీమతి ఏమన్నా శ్రీవారు తందాన తాన

శ్రీవారేమనుకున్నా శ్రీమతి తానతందనాన

చెట్టా పట్టగ కాలంగీలం నెట్టుకునేరానా

చెట్టూ తీగలవలెనే నిన్నూ చుట్టుకొనేపోనా

గిలిలేని కౌగిలిలోన చలికి చెలికి చెర వేయనా

కలలూరే కన్నుల్లో న తొలి చూపుతో బందీ చేయనా

పొద్దేతెలియని ముద్దూముచ్చట నీలో వింటున్నా

హాద్దేచూడని ఆవేశాలు నీ లో కంటున్నా

వేగంఉన్నది నాలోనా బిగువులు ఉన్నవి నీలోనా

ఒదిగి ఒదిగి నీ ఎదలోనా నేనోడి పోదు నీ ఒడిలోన

పోంగే పొంగుకు కట్టలు వేసి నీ కై చూస్తున్నా

మనసు కుదురుగా ఉంటున్నా సొగసూరించెను పంతానా

పంతాలెందుకు మనలోనా నీ సొంతం కానని అన్ననా

మిడిసి పడకు మిడిసి పడకు అత్త కూతురా

మిడిసి పడకు మిడిసి పడకు అత్త కూతురా

ముందు ముందు ఉందిలే సంబరాల జాతరా (2)

మిడిసి పడకు మిడిసి పడకు అత్త కూతురా రా



దోరవయసు అలవి కాని భారమయింది

ఆ బరువు మోయలేక నడుము పలచబడింది (2)

నడుములేని నడకే ఒక నాట్యమయింది (2)

చూచి చూచి బావ మనసు సొంమసిల్లింది.. సొంమసిల్లింది (మిడిసి)



అత్తకూతురంటేనే హక్కు ఉందిలే

అల్లరెంత చేసినా చెల్లుతుందిలేమ్ (2)

ముక్కు తాడు వేయువేళ ముంచుకొచ్చు సిగ్గులో (2)

ఇంత అత్త కూతురూ కొత్త పెళ్ళి కూతురే కొత్త పెళ్ళి కూతురే (మిడిసి)

చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్యా

పల్లవి:

ప్చ్ చ్ చ్ ప్చ్ చ్ చ్
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్యా
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య

అమ్మ నన్ను కొట్టింది బాబోయ్ అమ్మ నన్ను తిట్టింది బాబోయ్

ఊరుకో మా నాన్నా నిన్నూఋఅడించనేనున్నా


చరణం:
నల్లనయ్య కనరాక తెల్లవార్లు నిదరోకా
తల్లి మనసు తానెంత తల్లడిల్లి పోయిందో
వెన్నకై దొంగలా వెళ్ళితివేమో
మన్ను తిని చాటుగా దాగితివేమో

అమ్మా మన్ను తినంగ నే శిశువునో ఆకొంటినో వెర్రినో చూడు నోరు ఆ

వెర్రిది అమ్మేరా వెర్రిదీ అమ్మేరా పిచ్చిదాని కోపం-రా
పచ్చి కొట్టి వెళ్దామా బూచికిచ్చి పోదామా

ఏడుపొత్తోంది నాకేడుపొత్తోంది
పచ్చికొట్టిపోయామా పాలెవరు ఇత్తారు
బూచాడికి ఇచ్చామా బువ్వెవరు పెడ్తారు చెప్పూ

అమ్మతోనే ఉంటాము అమ్మనొదిలి పోలేమూ
అన్నమైన తింటాము తన్నులైన తింటాము

కొట్టమ్మ కొట్టు బాగా కొట్టు ఇంకా కొట్టూ కొట్టూ

||చిన్నారి పొన్నారి||

చరణం:
చిన్నవాడవైతేనూ చెయ్యెత్తి కొట్టేనూ
పెద్దవాడవైతేనూ బుద్ధిమతి నేర్పేను
యశోదనూ కానురా నిన్ను దండించ
సత్యనూ కానురా నిన్ను శాసించ
ఎవ్వరు నువ్వనీ... ఎవ్వరు నువ్వనీ నన్నూ అడగకు
ఎవరూ కాననీ విడిచీ వెళ్ళకూ
నన్నూ విడిచీ వెళ్ళకూ

ఆ వెళ్ళమూ వెళ్ళము లేమ్మా
||చిన్నారి పొన్నారి||

నేల మీది జాబిలి

నేల మీది జాబిలి
నింగి లోని సిరి మల్లి
నా చెలి నెచ్చెలి
చేరుకొరావా నా కౌగిలి

పిలిచెను కౌగిలింత రమ్మనీ.. ఊరుకొమ్మని
తెలిపెను పులకరింత ఇమ్మనీ.. దోచి ఇమ్మని

మనసుకు వయసు వచ్చు తీయని రేయిని
వయసుకు మతిపొయి పొందని హాయిని

తొలి ముద్దు ఇవ్వనీ మరు ముద్దు కొసరని
మలి ముద్దు ఏదని మైమరచి అడుగనీ || నేల మిది||

వెన్నల తెల్లబొయి తగ్గనీ .. తనకు సిగ్గనీ
కన్నులు సిగ్గు మాని మొగ్గనీ .. కలలు నెగ్గనీ

పరచిన మల్లె పూలు ఫక్కుమని నవ్వనీ
పగటికి చోటివ్వక ఉండనీ రత్రినీ

దీపలు మలగనీ తాపాలు పెరగనీ
రేపన్నదానిని ఈ పూటే చూడనీ || నేల మిది||

చీరలెత్తుకెల్లాడ చిన్ని క్రిష్ణుడు

చీరలెత్తుకెల్లాడ చిన్ని క్రిష్ణుడు
చీరలెత్తుకెల్లాడ చిన్ని క్రిష్ణుడు
చిత్తమే దోచాడీ చిలిపిక్రిష్ణుడు
చూడబోతే వాడేంతో మంచివాడూ
వాడికన్న వీడుమరీ కొంటేవాడూ..

మల్లెపూల పడవలో..ఆ..ఆ
మంచుతెరల మాటులో..ఆ..ఆ
ఏటి నీటి పోటులా..మాట వినని వయసులో
మల్లెపూల పడవలో..
మంచుతెరల మాటులో..
ఏటి నీటి పోటులా..మాట వినని వయసులో
నీవే నా మురళివని పెదవి చేర్చినాడూ
నీవే నా మురళివని పెదవి చేర్చినాడూ
ఆ పెదవిమీద తనపేరు రాసి చూసుకొన్నాడు
చీరలెత్తుకెల్లాడ చిన్ని క్రిష్ణుడు
చిత్తమే దోచాడీ చిలిపిక్రిష్ణుడు

మబ్బుచీర కట్టిందీ ఆకాశం
మెరపు చూపు విరిసిందీ నీ కోసం
మబ్బుచీర కట్టిందీ ఆకాశం
మెరపు చూపు విరిసిందీ నీ కోసం
తళుకులే చినుకులుగా చిలుకుతుంది వర్షం
తళుకులే చినుకులుగా చిలుకుతుంది వర్షం
తడిసిపోయి యవ్వనం వెతుకుతుంది వెచ్చదనం
చీరలెత్తుకెల్లాడ చిన్ని క్రిష్ణుడు
చిత్తమే దోచాడీ చిలిపిక్రిష్ణుడు

పొన్నచెట్టు నీడలో..ఓ..ఓ..
ఎన్ని ఎన్ని ఊసులో..ఆ..ఆ..ఆ..
వెన్నముద్దబుగ్గలో ఎన్ని ఎన్ని ముద్దులో
పొన్నచెట్టు నీడలో..
ఎన్ని ఎన్ని ఊసులో..
వెన్నముద్దబుగ్గలో ఎన్ని ఎన్ని ముద్దులో
నీవే నా రాధవు ఆ నాటి రాసక్రీడలో
నీవే నా రాధవు ఆ నాటి రాసక్రీడలో
నీవే నా రాగము ఈనాటి ప్రణయగీతిలో
చీరలెత్తుకెల్లాడ చిన్ని క్రిష్ణుడు
చిత్తమే దోచాడీ చిలిపిక్రిష్ణుడు
చూడబోతే వాడేంతో మంచివాడూ
వాడికన్న వీడుమరీ కొంటేవాడూ..

కొమ్మ మీద కొకిలమ్మ

కొమ్మ మీద కొకిలమ్మ
కుహు అన్నది
కుహుకుహు అన్నది
అది కూన విన్నది..ఒహో అన్నది


ఈనాడు చిగురించు చిగురాకు వగరే
ఏ గొంతులో రేపు ఏ రాగమవునో
నాడు ఆ రాగమే గుండె జతలో
తానే శ్రుతి చేసి లయ కూర్చునో
అని తల్లి అన్నది
అది పిల్ల విన్నది
విని నవ్వుకున్నది..కలలు కన్నది

ఈ లేత హ్రుదయాన్ని కదిలించినావు
నాలోన రాగాలు పలికించినావు
నాకు తెలిసింది నీ నిండు మనసే
నేను పాడేది నీ పాటనే
అని ఎవరు అన్నది
అది ఎవరు విన్నది
ఈ జిగురు చెవులకే గుర్తు ఉన్నది

పువ్వులో గువ్వలో వాగులో తీగలో

పల్లవి; పువ్వులో గువ్వలో వాగులో తీగలో
అంతట నీవే నమ్మ అన్నిట నీవే నమ్మ
నీ వొడిలో నన్ను దాచుకోవమ్మ
నీ పాపగా నన్ను చుసుకోవమ్మ అమ్మ
కొమ్మ కొమ్మ ఫై కుసుమంలో
కమ్మని తేనెవు నీవే నీవే
జాలి గుండెతో జల జల పారే సెలయేరువు నీవే
నింగిలో నేలలో రంగు రంగుల హరి విల్లులో (అంతట నీవే )


చరణం1; సీత కోక చిలుకలతో చేరి వసంత లాడేను
బంగారు వన్నెల జింకలతో
చెంగు చెంగున ఎగిరెను
కొండలో కొనలో తోటలో బాటలో (అంతట నీవే )


చరణం2; నీ చల్లని నీడే నా ఇల్లు
ఈ మూగ జీవులే నా వాళ్ళు
అంతు లేని ఈ అందాల లోకం అంట నాదే నమ్మ
మనసులో మమతలో కనులలో నా కలలలో (అంతట నీవే )

ఈ చల్లని లోగిలిలో ఈ బంగరు కోవెలలో

పల్లవి ; ఈ చల్లని లోగిలిలో ఈ బంగరు కోవెలలో
ఆనందం నిండాలి అనురాగం పండాలి (ఈ చల్లని )


చరణం1; ఇల్లాలే శ్రీ అన్నపూర్ణగా ప్రతి రోజు ఒక పండుగగా
వచ్చే పోయే అతిధులతో మీ వాకిలి కళకళ లాడాలి (ఈ చల్లని )


చరణం2; పిల్లల పాపల అల్లరితో ఈ ఇల్లంతా విలసిల్లాలి
పసుపు కుంకుమ కొల్లలుగా ఈ పచ్చని ముంగిట కురవాలి (ఈ చల్లని )


చరణం3; శుభముల నొసగే ఈ మందిరము శాంతికి నిలయం కావాలి
లక్ష్మి,సరస్వతి ఒద్దికగా ఈ ఇంటను కాపురం వుండాలి (ఈ చల్లని )

వీణ లోన తీగ లోన ఎక్కడున్నది నాదము

పల్లవి ; వీణ లోన తీగ లోన ఎక్కడున్నది నాదము
అది ఎలా గయి నది రాగము (వీణ లోన )

చరణం1; మాట లోన మనసులోన ఎక్కడున్నది భావము
అది ఎప్పుడవును గానము
నాదమునకు స్వరమే రాగము మనసులోని మాటె భావము
రాగ భావము లేక మైనవి రమ్య మైన రాగము (వీణ లోన )

చరణం2; గత జన్మ శృతి చేసుకున్నది అది ఈ జన్మ సంగీత మైనది
స రి గ మ ప ద ని సా ని ద ప మ గ రి స
రాగాల ఆరోహ ణవరోహ నయినది
అనురాగ హృదయాల అందించ నయినది (వీణ లోన )

చరణం3; గుండె లోన గొంతులోన ఎక్కడున్నది ఆవేదన
అది ఎలా గవును సాధన
గీతమునకు గళమే వేదన రాగమునకు మెరుగే సాధన
గుండె గొంతుక లేక మైనవి నిండు రాగాలాపన (వీణ లోన )

నా మాటే నీ మాటై చదవాలి

నా మాటే నీ మాటై చదవాలి
నేనంటే నువ్వంటూ రాయాలి
అఅ ఈ ఈ ఉఉ ఎఎ

మట్టిలో రాసిన రాతలు గాలికి కొట్టుకుపోతే ఎట్టాగ
మనసులో రాసి మననం చేస్తే జీవితం అంతా ఉంటాయి.. నిలుచుంటాయి..

ఆ మాటే నిజమైతే నేర్పమ్మా .. మనసంతా రాస్తా కోకమ్మ

నా మాటే నీ మాటై చదవాలి
నేనంటే నువ్వంటూ రాయాలి

పడవ..గడవ
చిలక..పలక

కొండలు కొనలు ఎం చదివాయి
కో అంటే అవి కో అంటాయి

హృదయలుండి కదిలయంటే.. చదువులు చదవకే వస్తాయి.. బదులిస్తాయి
ఆ చదువే నేనింకా చదవాలి.. ఆ బదులే నీ నుంచి రావాలి

నా హృదయమా .. నా హృదయ ఉదయ రాగమా

నా హృదయమా .. నా హృదయ ఉదయ రాగమా
మాయనీ.. తీయనీ .. మధుర గీతి పాడుమా

అందమై.. మకరందమై
మందబంధ మలయానిత గంధమై
మదనుని విరివిల్లున అరవిందమై
ఎలతేటి ఎద మీటు ఆనందమై.. ఎలతేటి ఎద మీటు ఆనందమై..
పులకరించు కుసుమమా.. పులకరించు కుసుమమా

నా హృదయమా .. నా హృదయ ఉదయ రాగమా

ఆటవై.. సయ్యాటవై..
చిలిపి వలపులాడే చెలగాటమై
తలపుల తత్తరల తచ్చాటవై..
పరువాల సరదాల బూచాటవై..పరువాల సరదాల బూచాటవై..
కరిగిపోవు స్వప్నమా.. కరిగిపోవు స్వప్నమా..

నా హృదయమా .. నా హృదయ ఉదయ రాగమా
మాయనీ.. తీయనీ .. మధుర గీతి పాడుమా

వాణివి.. వర వీణవై
బృందావన సమ్మోహన వేణువై
పదకవిత మృదుబాషల బాణివై
అనురాగ రాగాల నెరజాణవై.. అనురాగ రాగాల నెరజాణవై..
గానమై మౌనమా.. గానమై మౌనమా..

గాలివై.. చిరుగాలివై
సిరిమల్లెల చిరుజల్లుల వేళవై
కనుసన్నల తెలివెన్నెల జాలువై
జోజోల ఉయ్యాల జంపాలవై .. జోజోల ఉయ్యాల జంపాలవై ..
సేదదీర్చు నేస్తమా.. సేదదీర్చు నేస్తమా..

నా హృదయమా .. నా హృదయ ఉదయ రాగమా
మాయనీ.. తీయనీ .. మధుర గీతి పాడుమా

పాడాలనే ఉన్నది.. విని మెచ్చి.. మనసిచ్చే మనిషుంటే

పాడాలనే ఉన్నది.. విని మెచ్చి.. మనసిచ్చే మనిషుంటే (2)
పాడాలనే ఉన్నది..

పాడాలంటే హృదయం ఉండాలి (2)

హృదయానికి ఏదో ఒక కదలిక రావాలి

భావం పొంగలి.. రాగం పలకాలి.. దానికి జీవం పోయాలి (2)

పాడాలనే ఉన్నది.. విని మెచ్చి.. మనసిచ్చే మనిషుంటే
పాడాలనే ఉన్నది..

పాడానంటే రాళ్ళే కరగాలిఆ.. రాళ్ళకు నోళ్ళొచ్చి కధలే చెప్పాలి..(2)

ముసుగులు తొలగాలి.. మసకలు పోవాలి.. గదిలో దేవత కను తెరవాలి

పాడాలని ఉన్నది..

గాలికదుపు లేదు.. కడలికంతులేదు

ఆఆ అ .. ఆఆ అ.. ఆఆఆ అ.. ఆ ఆ ఆ ఆ.. అ అ అ.. అ అ అ
అ అ అ.. అ అ అ

గాలికదుపు లేదు.. కడలికంతులేదు
గంగ వెల్లువ కమండలంలో ఇమిడేదేనా..
ఉరికే మనసుకు గిరిగీస్తే ఆగేదేనా

గాలికదుపు||

సనిస స.. సరి సరి సరి రిస సని.. సనిస స.. సరి సరి సరి రిస సని (౨)

ఆ నింగిలో మబ్బునై పాడనా పాటలు ఎన్నో
ఈ నేలపై నేమలినై ఆడనా ఆటలు ఎన్నో..
తుళ్ళి తుళ్ళి గంతులు వేసే లేడి కేది కట్టుబాటు
మళ్ళి మళ్ళి వసంతంమొస్తే మల్లె కేల ఆకుచాటు

గాలికదుపు||

ఓ తెమ్మెరా.. ఊపవే ఊహల ఊయల నన్ను..
ఓ మల్లికా.. ఇవ్వవే నవ్వుల మాలిక నాకు..
తల్లి మళ్ళి తరుణయ్యింది.. పువ్వు పూసి మొగ్గయ్యింది
గుడిని విడిచి వేరొక గుడిలో ప్రమిదనైతే తప్పేముంది

గాలికదుపు||

అ అ ఆ ఆ అ అ
అ అ ఆ ఆ అ అ

చినుకు చినుకు పడుతూ వుంటే .. తడిసి తడిసి ముద్దవుతుంటే

చినుకు చినుకు పడుతూ వుంటే .. తడిసి తడిసి ముద్దవుతుంటే
ఒదిగి ఒదిగి ఒకటైపోతూ.. ఒకరికొకరు చలిమంటైతే..
అయితే!
జోహారు జోహారు ఈ వానకు.. ఈ హాయి లేదోయి ఏ జంటకూ..

చినుకు||

ఆహా హా హహ.. హ హ హ .. హ హ హ..

చేయి నడుము చుట్టేస్తుంటే ..చంప చంప నొక్కేస్తుంటే
చిక్కు కురులు చిక్కం వేయగా
చేయి నడుము చుట్టేస్తుంటే ..చంప చంప నొక్కేస్తుంటే
చిక్కు కురులు చిక్కం వేయగా
ఆఆ.. ఆఆ..ఆఆ..
ఊపిరాడలేదని నువ్వు .. ఉక్కిరి బిక్కిరి అవుతూ వుంటే
జేజేలు జేజేలు ఈ రోజుకు .. ప్రతి రోజు ఈ రోజు అయ్యేందుకు

చినుకు చినుకు పడుతూ వుంటే.. ఆ .. ఆఆ
తడిసి తడిసి ముద్దవుతుంటే.. ఆ .. ఆఆ
ఒదిగి ఒదిగి ఒకటైపోతూ.. ఒకరికొకరు చలిమంటైతే..
జోహారు జోహారు ఈ వానకు.. ఈ హాయి లేదోయి ఏ జంటకూ..

సొంపులన్నీ దాచే మేర .. ఒంటినంటి ఉన్నది చీర
తొలగిపోతే రట్టవుతుందిరా..
సొంపులన్నీ దాచే మేర .. ఒంటినంటి ఉన్నది చీర
తొలగిపోతే రట్టవుతుందిరా..
ఆఆ.. ఆఆ..ఆఆ..
గుట్టుగున్న నిను చూస్తుంటే .. కోటే కోర్కె నాకొస్తుంటే
పదునైన పరువాన్ని ఆపేందుకు .. పగ్గాలు లేవింక జంకెందుకు

చినుకు చినుకు పడుతూ వుంటే.. ఆ .. హా
తడిసి తడిసి ముద్దవుతుంటే.. ఆ .. హా
ఒదిగి ఒదిగి ఒకటైపోతూ..ష్.. ఆ.. హా
ఒకరికొకరు చలిమంటైతే..
జోహారు జోహారు ఈ వానకు.. ఈ హాయి లేదోయి ఏ జంటకూ..

దాసోహం దాసోహం దాసోహం

దాసోహం దాసోహం దాసోహం (2)
మల్లెలాంటి మనసుకు .. మనసులోని చలువకు .. చలువలోని చెలిమికి .. దాసోహం (2)

దాసోహం దాసోహం దాసోహం (2)
వెల్లువంటి మనిషికి .. మనిషిలోని దుడుకుకు .. దుడుకులోని ప్రేమకు .. దాసోహం (2)

దాసోహం దాసోహం దాసోహం (2)

నేల పరిచింది పూలబాట నీ నడకకు
గాలి పాడింది స్వగతాలు నీ రాకకు
నేల పరిచింది పూలబాట నీ నడకకు
గాలి పాడింది స్వగతాలు నీ రాకకు

ఎదురు వచ్చింది నీ చూపు నా తోడుకు (2)
కలిసి నడిచింది .. కబురులాడింది .. కడకు చేర్చింది నీ నీడకు

మల్లెలాంటి మనసుకు .. మనసులోని చలువకు .. చలువలోని చెలిమికి .. దాసోహం (2)
వెల్లువంటి మనిషికి .. మనిషిలోని దుడుకుకు .. దుడుకులోని ప్రేమకు .. దాసోహం (2)
దాసోహం దాసోహం దాసోహం (2)

నడక నేర్పింది నీ పిలుపే నా కాళ్ళకి
పలుకు నేర్పింది నీ పేరే నా పెదవికి
నడక నేర్పింది నీ పిలుపే నా కాళ్ళకి
పలుకు నేర్పింది నీ పేరే నా పెదవికి

తలుపు తెరిచింది నీ రూపే నా మనసుకి (2)

అడుగు పెట్టింది .. దీపమెట్టింది .. దేవతయ్యింది నా ఇంటికి

వెల్లువంటి మనిషికి .. మనిషిలోని దుడుకుకు .. దుడుకులోని ప్రేమకు .. దాసోహం (2)
మల్లెలాంటి మనసుకు .. మనసులోని చలువకు .. చలువలోని చెలిమికి .. దాసోహం (2)
దాసోహం దాసోహం దాసోహం (2)

అందమయిన లోకమని రంగురంగులుంటాయని

అందమయిన లోకమని రంగురంగులుంటాయని
అందరు అంటుంటారు రామ రామ ..
అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మా ..
చెల్లెమ్మా .. అందమైంది కానేకాదు చెల్లెమ్మా..

ఆకలి ఆశలు ఈ లోకానికి మూలమమ్మా ..(2)

ఆకలికి అందముందా రామ రామా ..
ఆశలకి అంతముందా చెప్పమ్మా .. చెల్లెమ్మా
ఆశలకి అంతముందా చెప్పమ్మా ..

అందమయిన లోకమని ||

గడ్డిమేసి ఆవు పాలిస్తుంది..పాలు తాగి మనిషి విశమౌతాడు..(2)

అది గడ్డి గొప్ప తనమా..ఇది పాల దోశ గుణమా..(2)

మనిషి చాల దొడ్డాడంమా చేలేమ్మ..
చెల్లెమ్మా.. తెలివి మీరి చెడ్డాడమ్మ చిన్నమ్మా..

అందమయిన లోకమని ||

ముద్దు గులాబీకి ముళ్ళుంటాయి..మొగలిపువ్వులోన నాగుంటాది..(2)

ఒక మెరుపు వెంట పిడుగు .. ఒక మంచిలోన చెడుగు
లోకమంతా ఇదే తీరు చెల్లెమ్మా
చెల్లెమ్మా .. లోతుకెళ్తే కధే వేరు పిచ్చమ్మా ..

అందమయిన లోకమని ||

డబ్బు పుట్టి మనిషీ చచ్చాడమ్మా .. పేదవాడు నాడే పుట్టాడమ్మా (2)

ఆ ఉన్నవాడు తినడు .. ఈ పేదను తిననివ్వడు
కళ్ళు లేని భాగ్యశాలి నువ్వమ్మా ..
ఈ లోకం కుళ్ళు నీవు చూడలేవు చెల్లెమ్మా

అందమయిన లోకమని ||

కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసూ

కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసూ
కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసూ
రాళ్ళలో ఉన్న నీరూ కళ్ళకెలా తెలుసూ
రాళ్ళలో ఉన్న నీరూ కళ్ళకెలా తెలుసూ

నాలో ఉన్న మనసూ నాకు గాక ఇంకెవరికి తెలుసూ

కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు
రాళ్ళలో ఉన్న నీరూ కళ్ళకెలా తెలుసు

తానే మంటై వెలుగిచ్చు దీపం
చెప్పదు తనలో చెలరేగు తాపం
నే వెళ్ళు దారీ ఓ ముళ్ళ దారీ (2)
రాలేరు ఎవరూ నాతో చేరీ
నాలో ఉన్న మనసూ నాకు గాక ఇంకెవరికి తెలుసూ

వేసవిలోనూ వానలు రావా
కోవెల శిలకూ జీవం రాదా
జరిగే నాడే జరుగును అన్నీ (2)
జరిగిన నాడే తెలియును కొన్నీ

నాలో ఉన్న మనసూ నాకు గాక ఇంకెవరికి తెలుసూ

కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసూ
రాళ్ళలో ఉన్న నీరూ కళ్ళకెలా తెలుసూ

నాలో ఉన్న మనసూ నాకు గాక ఇంకెవరికి తెలుసూ !

కోడికూసే జాము దాకా తోడురారా చందురూడా

కోడికూసే జాము దాకా తోడురారా చందురూడా
కోడెకారు కొత్త కోర్కెలు తరుముతున్నవి అందగాడా |2|
కోడికూసే జాము దాకా తోడురారా చందురూడా

కన్నెబుగ్గకు సిగ్గు కమ్మెను కళ్ళు చూస్తే కైపులెక్కెను (2)
కాపురానికి కొత్తవాళ్ళం కాడిమోయని కుర్రవాళ్ళం
కలలు తెలిసిన చిలిపివాడా కలుపరా మము కలువ రేడా

కోడికూసే జాము దాకా తోడురారా చందురూడా
కోడెకారు కొత్త కోర్కెలు తరుముతున్నవి అందగాడా |2|
కోడికూసే జాము దాకా తోడురారా చందురూడా

కంటికింపౌ జంటలంటే వెంట పడతావంట నువ్వు (2)
తెల్లవార్లూ చల్ల చల్లని వెన్నెలలతో వేపుతావట (2)
మత్తు తెలిసిన చందురూడా మసక వెలుగే చాలులేరా

కోడికూసే జాము దాకా తోడురారా చందురూడా

అల్లుకున్న మనసులున్నవి అలసిపోని బంధమున్నది (2)
చెలిమి నాటిన చిన్న ఇంట ఎదగనీ మా వలపు పంట (2)
తీపిమబ్బుల చందురూడా కాపువై నువ్వుండిపోరా

కోడికూసే జాము దాకా తోడురారా చందురూడా
కోడెకారు కొత్త కోర్కెలు తరుముతున్నవి అందగాడా
కోడికూసే జాము దాకా తోడురారా చందురూడా

శేషశైలావాస శ్రీ వే౦కటేశా

శేషశైలావాస శ్రీ వే౦కటేశా!
శయని౦చు మా అయ్య శ్రీ చిద్విలాసా! |2|

శ్రీదేవి వ౦కకు చిలిపిగా చూడకు
అలమేలు మ౦గకు అలుక రానీయకు
ముద్దు సతులిద్దరిని ఇరువైపులా జేర్చి
మురిపి౦చి లాలి౦చి ముచ్చటల తేల్చి
శేషశైలావాస శ్రీ వే౦కటేశ!

పట్టుపానుపు పైన పవళి౦చర స్వామి!
భక్తుల౦దరు నిన్ను ప్రస్తుతి౦చి పాడ!
చిరు నగవులొలుకుచు నిదురి౦చు నీ మోము
కరువు తీరా కా౦చి తరియి౦తుము మేము
శేషశైలావాస శ్రీ వే౦కటేశ !
శయని౦చు మా అయ్య శ్రీ చిద్విలాసా!

తెల్లచీర కట్టుకున్నది ఎవరి కోసము

తెల్లచీర కట్టుకున్నది ఎవరి కోసము
మల్లెపూలు పెట్టుకున్నది ఎవరి కోసము

తెల్లచీర కట్టుకున్నదెవరికోసము
మల్లెపూలు పెట్టుకున్నదెవరికోసము ||2||
తెల్ల చీర కట్టిన మల్లెపూలు పెట్టినా
కల్లకపటమెరుగని మనసు కోసము
మనసులోని చల్లని మమత కోసము

దాచుకున్న మమతలన్ని ఎవరికోసము
దాపరిక౦ ఎరుగని మనిషి కోసము ||2||
దాగని యవ్వన౦ ఎవరి కోసము
దాచుకుని ఏలుకునే ప్రియుని కోసము

పొద్ద౦తా కలవరి౦త ఎవరికోసము
నిద్దురైన రానీ నీ కోసము ||2||


ని౦గి నేల కలసినది ఎ౦దుకోసమూ
నీవు నన్ను చేరదీసిన౦దుకోసము ||2||
నేల మీద ఒక్కరై సాగిపోదము
ని౦గిలోన చుక్కలై నిలిచిపోదమూ

చె౦గావి ర౦గు చీర కట్టుకున్న చిన్నదీ

చె౦గావి ర౦గు చీర కట్టుకున్న చిన్నదీ
దాని జిమ్మ దీయా దాని జిమ్మ దీయా
అ౦దమ౦తా చీరలోనే ఉన్నది
చె౦గావి ర౦గు చీర కట్టుకున్న చిన్నదీ
దాని జిమ్మ దీయా దాని జిమ్మదీయా
కొ౦గుపొ౦గు కలిపి చూడమన్నదీ

మెరుపల్లే వచ్చి౦ది నా ఇ౦టికీ
నన్ను మెల్ల౦గా ది౦చి౦ది ముగ్గులోనికీ
తలదాచుకొమ్మనీ తావిస్తివి
తలదాచుకొమ్మనీ తావిస్తివి
పిల్ల దొరికి౦ది చాలనీ ఇల్లాల్ని చేస్తివి

ప్రేమ౦టే నేర్పి౦ది పిచ్చివాడికి
దా౦తో ఎర్రెత్తిపోయి౦ది కుర్రవాడికి
పిచ్చివాడనే పేరు చాటున మాటు వేసినావు
పిచ్చివాడనే పేరు చాటున మాటు వేసినావు
పిల్లదాని పెదవి మీద కాటు వేసినావు

సరస౦లో పడ్డాడు ఇన్నాళ్ళకి
అబ్బో స౦గీత౦ వచ్చి౦ది బుచ్చిబాబుకీ
తెరచాటు తొలిగి౦ది పరువానికి
తెరచాటు తొలిగి౦ది పరువానికి
అది పరవళ్ళు తొక్కుతూ పాడి౦ది నేటికి

లా..లా...హె.హె..లా..

లా..లా...హె.హె..లా..


తొంగి తొంగి చూడమాకు చందమామా
నీ సంగతంతా తెలుసుమాకు చందమామా
దోరదోర వయసులో చందమామా
ఆ తారనేంచేశావు చందమామా
వావి వరస చూశావ చందమామా
నీ వయసునాపుకున్నావ చందమామా
అంత మచ్చ పెట్టుకొని చందమామా
నీకెందుకింత మశ్చరం చందమామా


వెన్నెల్లో వేడుకుంది కన్నుల్లో కోరికుంది ముద్దుగుమ్మా
ఇద్దర్లో వేగముంది వద్దన్న ఆగకుంది పైడిబొమ్మా
పూలబాణాలు వేసుకుందమా ప్రేమగాయాలు చేసుకుందమా
పూలబాణాలు వేసుకుందమా ప్రేమగాయాలు చేసుకుందమా
కలిసే ఉందామా కరిగే పోదామా
హొయ్ చుప్పనాతి చుక్కల్ని దాటుదామ
అరె చూడలేని చంద్రున్ని తరుముదామా


గుండెల్లో తాళముంది గొంతుల్లో రాగముంది కలుపుదామా
పొద్దెంతో హాయి ఉంది ఎంతెంతో పొద్దు ఉంది గడుపుదామా
ముద్దు మురిపెంలో మునిగిపోదమా తీపి తాపాలలో తేలిపోదమా
ముద్దు మురిపెంలో మునిగిపోదమా తీపి తాపాలలో తేలిపోదమా
స్వర్గం చూద్దామా సొంతం చేద్దామా
ఆ మశ్చరాలు మాననీ మచ్చమామా
దండమెట్టి ఇద్దరం కొలుచుకోమా


తొంగి తొంగి చూడమాకు చందమామా
నీ సంగతంతా తెలుసుమాకు చందమామా
దోరదోర వయసులో చందమామా
ఆ తారనేంచేశావు చందమామా
వావి వరస చూశావ చందమామా
నీ వయసునాపుకున్నావ చందమామా
అంత మచ్చ పెట్టుకొని చందమామా
నీకెందుకింత మశ్చరం చందమామా

చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా

ఆ..ఆ..ఆ..ఆ...

చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా
పగిలేది ఖాయం ఏదైనా రగిలేను నీలో వేదన
చూసుకో పదిలంగా..

వికసించే పూలు ముళ్ళూ విధిరాతకు ఆనవాళ్ళు
వికసించే పూలు ముళ్ళూ విధిరాతకు ఆనవాళ్ళు
ఒకరికంట పన్నీరైనా ఒకరికంట కన్నీళ్ళు
ఒకరికంట పన్నీరైనా ఒకరికంట కన్నీళ్ళు
ఎండమావి నీరు తాగి గుండెమంటలార్చుకోకు
ఎండమావి నీరు తాగి గుండెమంటలార్చుకోకు
ఆశ పెంచుకోకు నేస్తం అది నిరాశ స్వాగత హస్తం


కాలమనే నదిలో కదిలే ఖర్మమనే నావమీద
కాలమనే నదిలో కదిలే ఖర్మమనే నావమీద
ఎవరి తోడు ఎన్నాళ్ళున్నా చివరి తోడు నువ్వేలే
ఎవరి తోడు ఎన్నాళ్ళున్నా చివరి తోడు నువ్వేలే
సాగుతున్న బాటసారి ఆగిచూడు ఒక్కసారి
సాగుతున్న బాటసారి ఆగిచూడు ఒక్కసారి
కలుసుకోని ఇరు తీరాలు కనిపించని సుడిగుండాలు

చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా
పగిలేది ఖాయం ఏదైనా రగిలేను నీలో వేదన
చూసుకో పదిలంగా

ఏనాటికైనా ఏజన్మనైనా నీతోడు నీడగా నీచేయి వీడకా...

ఏనాటికైనా ఏజన్మనైనా నీతోడు నీడగా నీచేయి వీడకా...

నీ అడుగుజాడలే అనుసరిస్తాను

కన్నులు నీవే కావాలి కలనై నేనే రావాలి

కవితే నీవై ఉరకాలీ కావ్యం నేనై నిలవాలి

మనసు నేనై వుండాలి మమత నీవై నిండాలి

కడలి నేనై పొంగాలీ నదివి నీవై చేరాలి

తొలకరి నీవై చిలకాలి మొలకను నేనై మొలవాలి

దైవం నీవై నడపాలీ ధర్మం నేనై నడవాలి

శిల్పం నీవై కల్పన నేనై చిరకాలం జీవించాలి

చెరగని మారని శిలాక్షరాలై చిరంజీవులం కావాలి

కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి.......కలలే

కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి.......కలలే

నా కలలో నీవే కనబడితే ఆ చొరవకు బలమేమి..........మరులే

మరులు మనసులో స్ధిరపడితే ఆపై జరిగేదేమి........మనువు ఊ

మనువై ఇద్దరు ఒకటైతే ఆ మనుగడ పేరేమి........సంసారం

అల్లరి ఏదో చేసితిని చల్లగ ఎదనే దోచితివి

ఏమీ లేని పేదననీ నాపై మోపకు నేరాన్ని

లేదు ప్రేమకు పేదరికం నే కోరను నిన్నూ ఇల్లరికం

నింగీ నేలకు కడు దూరం మన ఇద్దరి కలయిక విడ్డూరం

పదహారేళ్ళకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు

పదహారేళ్ళకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు
పదహారేళ్ళకూ నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు
వెన్నెలల్లే విరియ బూసి
వెల్లువల్లే ఉరకలేసే

పరుపులు పరచిన ఇసుక తిన్నెలకు
పాటలు పాడిన చిరు గాలులకు
తెరచాటొసగిన చెలులు శిలలకు
తెరచాటొసగిన చెలులు శిలలకు
దీవెన జల్లులు చల్లిన అలలకు
కోటి దండాలు శతకోటి దండాలు

నాతో కలిసి నడచిన కాళ్ళకు
నాలో నిన్నే నింపిన కళ్ళకు
నిన్నే పిలిచే నా పెదవులకు
నీకై చిక్కిన నా నడుమునకూ
కోటి దండాలు శతకోటి దండాలు

భ్రమలో లేపిన తొలి జాములకు
సమయం కుదిరిన సందె వెళలకు
నిన్నూ నన్ను కన్న వాళ్ళకు
నిన్నూ నన్ను కన్న వాళ్ళకు
మనకై వేచే ముందు నాళ్ళకు
కోటి దండాలు శతకోటి దండాలు

భలె భలె మగాడివోయ్

భలె భలె మగాడివోయ్
బంగారు నా సామివోయ్
నీ మగసిరి గులామునోయ్
నీ ఆన నీ దాననోయ్
I don't know what you say
తెలియంది మానేసేయ్
నీకు తెలిసింది ఆడేసేయ్
తీయంది ఒక బాటే
That's love shall blush I say
I don't know what you say to me
But I have so much to say
I wanna fly with you up the sky
and dance all the night
I can't help darling falling in love
With you and only with you
Come darling let's play the game
Come darling let's sing and sway

నా గుండె లోన నీవే ఉయ్యాలలూగినావే
Let's be merry my dove
Hey Let's be merry my love
ఏ మత్తు చల్లినావో ఏ మైకమిచ్చినావో
ఏ మత్తు చల్లినావో ఏ మైకమిచ్చినావో
One fine day you will be mine
It will be full of sunshine
One fine day you will be mine
It will be full of sunshine
నాతోటి నీవుండ నాకు ఇంకేల నీరెండ
నాతోటి నీవుండ నాకు ఇంకేల నీరెండ
Come baby let's have some fun
Down here there is no one
భలె భలె మగాడివోయ్
బంగారు నా సామివోయ్
I wanna fly with you up the sky
and dance the whole night

నీ కౌగిలింతలోన నా సొగసు దాచుకోనీ
No need to feel shy my girl
No need to hold back my doll
నా వంపు వంపులోన నీ వయసు ఆపుకోనీ
Hand in hand let's say my dear
Come near don't fear dear
సాగించు పయనాన్నీ నీవే చూపించు స్వర్గాన్ని
Let's start the game of our live And you'll be my dear wife

ఎర్రగులాబీ విరిసినదీ..తొలిసారీ నను కోరీ

ఎర్రగులాబీ విరిసినదీ..తొలిసారీ నను కోరీ
ఆశే రేపింది నాలో..అందం తొణికింది నీలో.. స్వర్గం వెలిసింది భువిలో

ఈ ఎర్రగులాబీ విరిసినదీ..తొలిసారీ నిను కోరీ
ఆశే రేపింది నీలో..అందం తొణికింది నాలో.. స్వర్గం వెలిసింది భువిలో
ఈ ఎర్రగులాబీ విరిసినదీ..

లతనై..నీ జతనై..నిన్నే పెనవేయనా
కతనై..నీ కలనై..నిన్నే మురిపించనా
నేనిక నీకే సొంతమూ
న న న న నా .. నీకెందుకు ఈ అనుబంధమూ
న న న న న న న న నా..

ఈ ఎర్రగులాబీ విరిసినదీ..తొలిసారీ నను కోరీ
ఆశే రేపింది నీలో..అందం తొణికింది నాలో.. స్వర్గం వెలిసింది భువిలో
ఈ ఎర్రగులాబీ విరిసినదీ..

పెదవినీ..ఈ మధువునూ..నేడే చవిచూడనా
నవ్వనీ..ఇక లేదనీ..నీకూ అందివ్వనా
వయసుని వయసే దోచేదీ
న న న న నా .. అది మనసుని నేడే జరిగేదీ
న న న న న న న న నా..

ఈ ఎర్రగులాబీ విరిసినదీ..తొలిసారీ నిను కోరీ
ఆశే రేపింది నాలో..అందం తొణికింది నీలో.. స్వర్గం వెలిసింది భువిలో
ఈ ఎర్రగులాబీ విరిసినదీ..

కోనలో..సన్న జాజిమల్లి జాజిమల్లి

కోనలో..
సన్న జాజిమల్లి జాజిమల్లి
మేనులో..
పొన్న పూలవల్లి పాలవెల్లి
వేణిలో..
కన్నె నాగమల్లి నాగమల్లి
తీరులో..
అనురాగవల్లి రాగవల్లి

కావ్యాలకే..హో
శ్రీకారమై..హో
కస్తూరి తాంబూలమీవే !

కోరుకో..
సన్న జాజిమల్లి జాజిమల్లి
ఏలుకో..
కన్నెసోకులన్ని సోకులన్ని
పాడుకో..
ప్రేమ కైతలల్లి కైతలల్లి
వేసుకో..
పాలబుగ్గపైన రంగవల్లి

మేని సోయగాలు..ప్రేమ బంధనాలు
మౌన స్వాగతాలూ..రాగ రంజితాలు
సరసములో..సమరములూ
సరసులకూ..సహజములూ
ప్రాభవాలలోనా..నవశోభనాల జాణా
రాగదే రాగమై రాధవై

కోరుకో..
సన్న జాజిమల్లి జాజిమల్లి
ఏలుకో..
కన్నెసోకులన్ని సోకులన్ని
పాడుకో..
ప్రేమ కైతలల్లి కైతలల్లి
వేసుకో..
పాలబుగ్గపైన రంగవల్లి

రాగాలనే..హోయ్
బోయీలతో..హోయ్
మేఘాల మేనాలో రానా !

కోనలో..
సన్న జాజిమల్లి జాజిమల్లి
మేనులో..
పొన్న పూలవల్లి పాలవెల్లి
వేణిలో..
కన్నె నాగమల్లి నాగమల్లి
తీరులో..
అనురాగవల్లి రాగవల్లి

కోయిలమ్మ రాగం .. కొండవాగు వేగం
పారిజాత సారం .. ఏకమైన రూపం
అధరముపై..అరుణిమలూ
మధురిమకై..మధనములూ

నందనాలలోన..రసమందిరాలలోన
హాయిగా..సాగగా..చేరగా !

కోనలో..
సన్న జాజిమల్లి జాజిమల్లి
మేనులో..
పొన్న పూలవల్లి పాలవెల్లి
వేణిలో..
కన్నె నాగమల్లి నాగమల్లి
తీరులో..
అనురాగవల్లి రాగవల్లి

కావ్యాలకే..హో
శ్రీకారమై..హో
కస్తూరి తాంబూలమీవే

కోరుకో..
సన్న జాజిమల్లి జాజిమల్లి
ఏలుకో..
కన్నెసోకులన్ని సోకులన్ని
పాడుకో..
ప్రేమ కైతలల్లి కైతలల్లి
వేసుకో..
పాలబుగ్గపైన రంగవల్లి !

పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో

పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో
ప్రణయ సుధా రాధా.. నా బ్రతుకు నీది కాదా..

నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే
నాదన్నది ఏమున్నది నాలో
నీవేనాడు మలిచావు ఈ రాతినీ
నేనీనాడు పలకాలి నీ గీతినీ
ఇదే నాకు తపమనీ ఇదే నాకు వరమనీ
ఇదే నాకు తపమనీ ఇదే నాకు వరమనీ
చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉందీ
చెప్పాలని ఉందీ గుండె విప్పాలని ఉందీ

నీ ప్రేమకు కలశాన్ని నీ పూజకు నిలయాన్ని
నీ వీణకు నాదాన్ని కానా
నే ఇన్నాళ్ళు చేసింది ఆరాధనా
నీకు ఈనాడు తెలిపేది నా..వేదనా
ఇదే నిన్ను వినమనీ.. ఇదే నిజం అనమనీ
ఇదే నిన్ను వినమనీ.. ఇదే నిజం అనమనీ
చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉందీ
చెప్పాలని ఉందీ.. గుండె విప్పాలని ఉందీ

రాళ్ళళ్ళో ఇసకల్లో రాసాము ఇద్దరి పేర్లు

రాళ్ళళ్ళో ఇసకల్లో రాసాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి
కలలలోన తీయగా గురుతు తెచ్చుకో
రాళ్ళళ్ళో ఇసకల్లో రాసాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి
కలలలోన తీయగా గురుతు తెచ్చుకో

కలలన్ని పంటలై పండెనేమో
కలిసింది కన్నుల పండుగేమో
చిననాటి స్నేహమే అందమేమో
అది నేటి అనురాగ బంధమేమో
తొలకరి వలౌప్లలో పులకించు హౄదయాలలో
తొలకరి వలౌప్లలో పులకించు హౄదయాలలో
యెన్నాళ్ళకీనాడు విన్నాము సన్నాయి మేళాలు
ఆ మేళ తాళాలు మన పెళ్ళి మంత్రాలై వినిపించు వేళలో
యెన్నెన్ని భావాలో

చూసాను యెన్నడో పరికిణిలో
వచ్చాయి కొత్తగా సొగసులేవో
హౄదయాన దాచిన పొంగులేవో
పరువాన పూచిన వన్నెలేవో
వన్నెల వానల్లో వనరైన జలకాలలో
వన్నెల వానల్లో వనరైన జలకాలలో
మునగాలి తేలాలి తడవాలి ఆరాలి మోహం లో
ఆ మోహా దాహాలు మన కంటి పాపల్లో కనిపించు గోములో
యెన్నెన్ని కౌగిళ్ళో

పరువామా చిలిపి పరుగు తీయకు

పరువామా చిలిపి పరుగు తీయకు
పరువామా చిలిపి పరుగు తీయకు
పరుగులో పన్తాలు పొవకు
పరుగులో పన్థాలు పొవకు

1|| ఏ ప్రేమ కోసమో చూసే చూపులు
ఏ కౌగిలింతకో చాచే చేతులూ
తీగలై హో చిరు పూవులై పూయ
గాలిలో హో రాగాలుగా మ్రోగ
నీ గుండె వేదాలు తాళం వేయా

2|| ఏ గువ్వ గూటి లో స్వర్గం ఉన్నదో
ఏ చెట్టు నీడలో సౌఖ్యం ఉన్నదో
వెతికితే హో నీ మనసులో లేదా
దొరికితే హ జత కలుపు కోరాదా
అందాకా అందాన్ని ఆపే దెవరూ

మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదిగా

మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదిగా
మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదిగా
మెత్తగా అడిగితే లేదనేది లేదుగా
మెత్తగా అడిగితే లేదనేది లేదుగా
మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదిగా
నీది కానిదేది లేదు నాలో నిజానికే నెనున్నది నీలో
నీది కానిదేది లేదు నాలో నిజానికే నెనున్నది నీలో
ఒక్కటే మనసున్నది ఇద్దరిలో ఒక్కటే మనసున్నది ఇద్దరిలో ఆ ఒక్కటి చిక్కెనీ గుప్పిటిలో
హా...

మెల్ల మెల్ల||

నిన్ను చూచి నన్ను నేను మరచినాను
నన్ను దోచుకొమ్మనీ నిలిచినాను
దోచుకుందమనే నేను చూచినాను
చూచి చూచి నువ్వె నన్ను దోచినావు
మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదిగా

మెల్ల మెల్ల||

కన్నులకీ కట్టినావు ప్రేమ గంతలు
కన్నె మనసు ఆడినదీ దాగుడు మూతలు
కన్నులకీ కట్టినావు ప్రేమ గంతలు
కన్నె మనసు ఆడినదీ దాగుడు మూతలు
దొరికినాము చివరకు తోడు దొంగలం
దొరికినాము చివరకు తోడు దొంగలం
దొరలమై ఏలుదాము వలపు సీమను
హా...

మెల్ల మెల్ల||

ఈనాడే కట్టుకున్న బొమ్మరిల్లు

ఈనాడే కట్టుకున్న బొమ్మరిల్లు
కావాలి ముందు ముందు పొదరిల్లు పొదరిల్లు

ఆశలే తీగలుగ ఉసులే పువ్వులుగా
వలపులే అకులుగ అలరాలి ఆ పొదరిల్లు
పగలైన రేయైన ఏ ౠతువులైన
మురిపించు తేనజల్లు పరువాల ఆ పొదరిల్లు

కల్లలొ కల్లుంచి కాలమే కరిగించి
అనురాగం పండిచే అ బ్రతుకే హరివిల్లు
నా దేవివి నీవైతే నీ స్వామిని నేనైతే
పచ్చని మన కాపరమే పరిమలాల వెదజల్లు

సుధా.. రాగ సుధా .. అనురాగ సుధ..

సుధా.. రాగ సుధా .. అనురాగ సుధ..
నీ పేరు సుధ
నీ రూపు సుధ
నీ పెదవి సుధ
నీ పలుకు సుధ
నీ తలపు సుధ
కాస్త తెలుపు సుధ

పాల కడలిలో పుట్టిన సుధవో..నీలి నింగిలో వెలిగే సుధవో
పూల గుండెలో పొంగే సుధవో..పూర్వ జన్మ పండించిన సుధవో

కాస్త తెలుపు సుధ
సుధా.. రాగ సుధా ..

అరుణారుణ రాగం నీ వదనంలో కుంకుమ తిలకం
అరుణారుణ రాగం నీ వదనంలో కుంకుమ తిలకం
చెరిపేస్తే చెరగని ఆ సౌభాగ్యం .. చిరంజీవి కావడమే నా భాగ్యం

సుధా.. రాగ సుధా ..

కోవెలలో అగుపించిన దేవతవు ..నా దేవతవై నను కోవెల చేసావు ..
కోవెలలో అగుపించిన దేవతవు ..నా దేవతవై నను కోవెల చేసావు ..
గుడిలో మ్రోగే మంగళ వాద్యం ..నీ మెడలో కాగల మంగళ సూత్రం

సుధా.. రాగ సుధా .. అనురాగ సుధ..
నీ పేరు సుధ
నీ రూపు సుధ
నీ పెదవి సుధ
నీ పలుకు సుధ
నీ తలపు సుధ
కాస్త తెలుపు సుధ
సుధా.. రాగ సుధా ..

ఇవ్వు ఇవ్వు ఒక ముద్దు

ఇవ్వు ఇవ్వు ఒక ముద్దు
ఇవ్వలేనిది అడగవద్దు
వద్దు వద్దు అంటు పోతే చిన్న దాన ఎప్పుదంట ఇచ్చేదంట
కన్నె ముద్దు ఇచ్చుకుంటే పెళ్ళైదాక ఆగమంట
కల్లతొటి పెళ్ళైంది చాలు

ఆధ్యంతము లేని అమరానందము ప్రేమ
ఏ భంధము లేని తొలి సంభంధము ప్రేమ
ప్రేమ దివ్య భావము ప్రేమ దైవ రూపము
ప్రేమ జీవ రాగము ప్రేమ ఙ్ణన యోగము
మనస్సున పారే సలయేరు ప్రేమ
అలసట తీర్చే చిరు గాలి ప్రేమ
హద్దులేవి లెనిది అందమైన ప్రేమ

ఓ అల్లరి ప్రేమ ఇక ఆడించకు నన్ను
ఓ ఠక్కరి ప్రేమ ఇక లాలించకు నన్ను
నీకు నేను సొంతము నాకు నేను సర్వము
నీవు నాకు డెహము నీకు నేను ప్రాణము
ప్రతి రొజు నీ ఉదయాని నేను
ప్రతి రేయి నీ నెలవంక నేను
జన్మలెన్ని మారిన ప్రేమ పేరు ప్రేమ

వెన్నెల లోనీ వికాసమే వెలిగించెద నీ కనులా

వెన్నెల లోనీ వికాసమే వెలిగించెద నీ కనులా ||2||
వేదన మరచి ప్రశాంతి గా నిదురించుము ఈ రేయి..
నిదురించుము ఈ రేయి..
వెన్నెల లోనీ వికాసమే వెలిగించెద నీ కనులా

వాడని పూవుల తావితో..
కదలాడే సుందర వసంతమీ కాలము ||2||
చెలి జోలగ పాడే వినోద రాగాలలో ||2||
తేలెడి కల సుఖాల లో...
నిదురించుము ఈ రేయీ ||2||

వెన్నెల లోనీ వికాసమే వెలిగించెద నీ కనులా

భానుని వీడని చాయగా...
నీ భావము లోనే చరింతునోయీ సఖ ||2||
నీ సేవలలోనే తరింతునోయీ సదా ||2||
నీ ఎద లోనే వసింతులే...
నిదురించుము ఈ రేయీ ||2||

వెన్నెల లోనీ వికాసమే వెలిగించెద నీ కనులా
వేదన మరచి ప్రశాంతి గా నిదురించుము ఈ రేయి..
నిదురించుము ఈ రేయి ||2||

లేడి కనులు లేత మనసు కలసినప్పుడు

లేడి కనులు లేత మనసు కలసినప్పుడు పాడుకునే పాట ఒకటే ఒకటి
లేడి కనులు లేత మనసు కలసినప్పుడు పాడుకునే పాట ఒకటే ఒకటి
ఆడపిల్ల మగవాడు కలసినప్పుడు అనుకునే మాటలు రెండే రెండు

చందమామ ఆ ఆ ఆ ఆ చల్లగాలి ఈ ఈ ఈ ఈ
చందమామ చలల్గాలి నవ్వినప్పుదు
కందలించే హృదయాలు రెండూ ఒకటి
ఎర్ర పెదవి సోగ చెక్కిలి చేరినప్పుడు
ఎదలోపల ఆనందం ఒకటే ఒకటి
ఆడపిల్ల మగవాడు కలసినప్పుడు అనుకునే మాటలు రెండే రెండు

కోర వయసు వోర చూపు కులికినప్పుడు
కోర వయసు వోర చూపు కులికినప్పుడు
ఓర దగిన అనుభవము ఒకటే ఒకటి
పులకరించె ప్రేమ విరిసి పూచినపుడు
గిలిగింతలు లెక్కిస్తే అవియే కోటి
ఆడపిల్ల మగవాడు కలసినప్పుడు అనుకునే మాటలు రెండే రెండు

లే లే లే లేలేలే నారాజా లేలే నా రాజా

లే లే లే లేలేలే నారాజా లేలే నా రాజా
లేలేలే నారాజా లేలే నా రాజా
లేవనంటావా నన్ను లేపమంటావా
నిద్దుర లేవనంటావా నన్ను లేపమంటావా
లే లే లే లేలేలే నా రాజా లేలే నా రాజా

పెటపెటలాడే పచ్చివయసు పై పై కొచ్చిందీ
వచ్చి వచ్చి మెరమెరలాడే మేని నునుపు మెత్తగ తగిలిందీ
హాయ్పెటపెటలాడే పచ్చివయసు పై పై కొచ్చిందీ
మెరమెరలాడే మేని నునుపు మెత్తగ తగిలిందీ
మెత్తని మత్తూవెచ్చని ముద్దూ ఒద్దిక కుదిరిందీ
ఇద్దరు ఉంటేఒక్కరికేలా నిద్దుర వస్తుందీ

రా రా రారా ఆ నా రోజా రావేనా రోజా
రా ఆ నా రోజా రావే నా రోజా
రాతిరయ్యిందా హా నన్ను లేచిరమ్మందా ఆవ్
రాతిరయ్యిందాహా నన్ను లేచిరమ్మందా ఆవ్
లే లే లే లేలేలే నా రాజా లేలే నా రాజా

నల్లనల్లని కన్నులలోన ఎర్రని కైపుందీ
ఎర్ర ఎర్రనీ కుర్రతనములూ జుర్రుకుతాగాలీ హాహా
నల్లనల్లని కన్నులలోన ఎర్రని కైపుందీ
ఎర్ర ఎర్రనీ కుర్రతనములూ జుర్రుకుతాగాలీ
తాగిన రాత్రీ తాగని పగలూ ఒక్కటి కావాలీ
తాగిన రాత్రీ తాగని పగలూ ఒక్కటి కావాలీ
ఆఖరి చుక్కా హావ్ చక్కని చుక్కా హా అప్పుడు ఇవ్వాలీ
రా రా రారా ఆ నా రోజా లల ల్లాల్లా రావే నా రోజ
రాతిరయ్యిందాహా నన్ను లేచిరమ్మందా హావ్
రాతిరయ్యిందాహా నన్ను లేచిరమ్మందా హా
లే లే లే లేలేలే నా రాజా లేలే నా రాజా

లే లే బాబా నిదురలేవయ్యా

లే లే బాబా నిదురలేవయ్యా
ఏలే స్వామీ మేలుకోవయ్య
రవి తేజ కిరణమే నీ శరణు కోరుతూ
చరణాలను చేరగ తలుపు తీసెరా బాబా
లే లే లే లే లే లే బాబా నిదురలేవయ్యా ఏలే స్వామీ మేలుకోవయ్యా

వేగు చుక్క తిలకమెట్టి వేద మంత్ర పువ్వులు పెట్టి ఆ ఆ ఆ ఆ
వేగు చుక్క తిలకమెట్టి వేద మంత్ర పువ్వులు పెట్టి
పాద సేవ చేసుకునే వేల దాటిపోయెనని
ప్రశ్నవేయకుంటే మంచిదే ఇద్దరికీ
పెద్ద కొడుకంటే ముద్దేలే ఏ తంద్రికి
అందుకనె గుండె నీ గురు పీఠమయినది
ఆరాధ్య దైవమని కొని యాడుతున్నది
అంతకుమించిన భాగ్యమేదిరా బబ
లే లే బాబా నిదురలేవయ్యా ఏలే స్వామీ మేలుకోవయ్యా
రవి తేజ కిరణమే నీ శరణు కోరుతూ
చరణాలను చేరగ తలుపు తీసెరా బాబా
లే లే బాబా నిదురలేవయ్యా ఏలే స్వామీ మేలుకోవయ్యా

నీలకంఠ స్వామిలొ నిండుకున్న జ్యోతివై
సత్యమైన వెలుగులో దత్తాత్రేయ రూపమై
లోకములు కాచే తండ్రివి నీవేనని
రూపముల నేకములయిన శ్రీ సాయి ని
నమ్ముకున్న వారికెల్ల నారాయణాత్మవై
కుమ్మరించు వరములే సుఖ సాంతి నెలవులయి
వెన్నంటి నువ్వుంటే లోటె లేదురా బబా
లే లే బాబా నిదురలేవయ్యా ఏలే స్వామీ మేలుకోవయ్యా
రవి తేజ కిరణమే నీ శరణు కోరుతూ
చరణాలను చేరగ తలుపు తీసెరా బాబా
లే లే బాబా నిదురలేవయ్యా ఏలే స్వామీ మేలుకోవయ్యా

లాలిలో లాలిలో మా కంటి పాప నీవే మా కాంతిరేఖ నీవే

లాలిలో లాలిలో మా కంటి పాప నీవే మా కాంతిరేఖ నీవే
నా కన్నతల్లి నీవే లాలి లాలిజో
మా కంటి పాప నీవే మా కాంతిరేఖ నీవే
నా కన్నతల్లి నీవే లాలి లాలిజో
ఈ జన్మలో మీ అమ్మనై నీ ఆటలో నే బొమ్మనై పాడేను ప్రేమజోల
మా కంటి పాప నీవే మా కాంతిరేఖ నీవే
నా కన్నతల్లి నీవే లాలి లాలిజో

ఆశలన్ని ధారపోసి పెంచుకున్న ప్రేమలో పంచుకున్న పాశమే తెంచుకున్న బంధమై
కన్నపేగు ముళ్ళు వేసి కానరాని గాధలో నోచుకున్న నోముకే నీకు నేను తల్లినై
కలలెన్నో కన్నా నీకోసం కంట చూసుకున్నా నీరూపం
వర్ధిల్లాలి చల్లగా మా జాబిల్లిగా
వయ్యరాల వల్లిగా నవ్వే మల్లిగా
నీ సంతొషం,సౌభాగ్యం నీ తల్లిదే

మా కంటి పాప నీవే మా కాంతిరేఖ నీవే

తీరమెంత దూరమైనా తీరిపోని రాగమే గొంతు దాటలేనిదై మూగరాసి గీతమై
రక్తపాశమన్నదే రంగుమార్చలేనిదై కల్లలోని కుంకుమై వెల్లువైన వర్ణమై
గాలిగోపురాన జేగంట విన్న దేవతైనా రాదంట
పొంగే ఎండమావులా సాగే నావనై
కృంగే గుండె లోయలో రాలే తారనై
నిను దీవిస్తూ జీవిస్తా నీ నీడనై

మా కంటి పాప నీవే మా కాంతిరేఖ నీవే
నా కన్నతల్లి నీవే లాలి లాలిజో
ఈ జన్మలో మీ అమ్మనై నీ ఆటలో నే బొమ్మనై పాడేను ప్రేమజోల
మా కంటి పాప నీవే మా కాంతిరేఖ నీవే
నా కన్నతల్లి నీవే లాలి లాలిజో లాలి లాలిజో లాలి లాలిజో

లా లా లా ల లకోటా స ని స ప సపోటా

లా లా లా ల లకోటా స ని స ప సపోటా
లాలా లా ల లకోటా స ని స ప సపోటా
లవ్వడే నా ప్రేమల కోట సయ్యటాడే పాల సపోటా
లా లా లా ల లకోటా స గ మ ప సపోటా
లా లా లా ల లకోటా స గ మ ప సపోటా
మురిపించే నా ముద్దు గలాటా
ఆటాడించే అగ్గి పరాటా

వంటినిండా తూకానికి
వంటినిండా అందానికి
చాటు మాటు లోటు లేని
చక్కదనాల సపోటా
రెక్కలు చాపి చుక్కలు దాటి ఎగిరిపోకే డకోటా
పదహారేళ్ళ వయసుతో శృంగారాలే చేసుకో
పదారు వన్నెల సొగసులో వుంగరాలే తీసుకో
మాపటాలే బాటా పగటి పూట టాటా టా టా
లా లా లా ల లకోటా స గ మ ప సపోటా

కఔగలింతలో తాగడానికి
రేయి హాయిలో రేగడానికి
కాచి పోచి లేనే లేని చక్కని చిక్కని గలాటా
టక్కులు మాని పక్కకి వస్తే దక్కకి పోదు పరోటా
పరువు బజారున పెట్టకే పరువాలన్నీ పంచుకో
పనిలో వుంటే తిట్టకే పనివాడినని గుర్తుంచుకో
మాట అంటే మాట నీ ఆట వూరి బయట హ హా
లా లా లా ల లకోటా స గ మ ప సపోటా

లక్డీకాపూలట లజ్జనకో

లక్డీకాపూలట లజ్జనకో
లడ్కీ మామూలట love కొడకో
లక్డీకాపూలట లజ్జనకో
లడ్కీ మామూలట love కొడకో
చక్కనీ చుక్కట జంబలో జక్కట
ఆ పిమ్మట దుప్పట్లో తప్పెట
ఎన్నెల్లో ఏడూల్ల తిప్పట

గోల్కొండ దిబ్బట ఇంటెనకో
మాల్గాడి బొబ్బట కొక్కొరకో
గోల్కొండ దిబ్బట ఇంటెనకో
మాల్గాడి బొబ్బట కొక్కొరకో
ఆకులో వక్కట పరువాల పక్కట
మస్తాన మరుమల్లె పూవట
నన్ను చూస్తేనే మీ బాబా ప్రూవ్వట

లక్డీకాపూలట లజ్జనకో
లడ్కీ మామూలట love కొడకో
గోల్కొండ దిబ్బట ఇంటెనకో
మాల్గాడి బొబ్బట కొక్కొరకో

కోఠీ లో bus ఎక్కి మండిలో దిగితుంటే
మార్కెట్లో కోడి కూసే కోడె మనసంతా వేడె చేసే
జగదాంబా centerలో జడదెబ్బ కొడుతుంటే
మల్లెల్లో ప్రొద్దుగూకే పైట ముల్లల్లో మువ్వ మోగే
రా రా రాపాడు కుంటుంటే షేప్ షేప్ షేపు మారిందమ్మో మాపటికే
వయసుల యాంగిరి వలపుల డింగరి
చలి చలి హంగ్రీ చెలిముక జాంగిరి
లగాఇంచేయనా ఈ రాతిరి అయో తెల్లార్లు నవరాత్రి నౌకరి


లక్డీకాపూలట లజ్జనకో
లడ్కీ మామూలట love కొడకో
గోల్కొండ దిబ్బట ఇంటెనకో
మాల్గాడి బొబ్బట కొక్కొరకో

బెజవాడ సీజన్లో బండెక్కబొతుంటే రద్దీ లో రంగు మారే
రాత కొద్దీ నా రైలు మారే
హనుమాను జంక్షన్ లో హనీమూను కెల్తుంటే బజనేదో సాగిపోయే
ఉన్న బయమేదో తీరిపోయే
జోర్ జోర్ లగ్గాఇంచేస్తుంటే టియం టియం వింజాబాద్ అంటున్నది నావయసే
రగిలిన రాపిడి రాత్రికి తాకిడి
విరహపు వీరుడి పిలుపికు నేరెడీ
సరే సాగించు నీ దోపిడి
అందాల డేరాలో అలికిడి

లక్డీకాపూలట లజ్జనకో
లడ్కీ మామూలట love కొడకో
గోల్కొండ దిబ్బట ఇంటెనకో
మాల్గాడి బొబ్బట కొక్కొరకో
చక్కనీ చుక్కట జంబలో జక్కట
ఆ పిమ్మట దుప్పట్లో తప్పెట
ఎన్నెల్లో ఏడూల్ల తిప్పట
గోల్కొండ దిబ్బట ఇంటెనకో
లక్డీకాపూలట లజ్జనకో
మాల్గాడి బొబ్బట కొక్కొరకో
లడ్కీ మామూలట love కొడకో

లైలా ఆ ఆ ఆ లైలా లైలా ఆ ఆ

లైలా ఆ ఆ ఆ లైలా లైలా ఆ ఆ
నిరుపేద మనసునే మురిపించి నీవు
రతనాల మహలులో నిదురించినావా
లైలా ఆ ఆ ఆ లైలా ఆ ఆ ఆ
బంగారు గూటిలో పడివున్న చిలుకను
పెదవి దాటగలేని ఒక మూగ పిలుపును

ఇకనైన నను చేర రావా
ఇకనైన నను చేర రావా
ఒకసారి నీ మోము తిలకింప నీవా
ఇకనైన నను చేర రావా ఆ ఆ ఆ
నీతోడు నడయాడ లేను
నీ ప్రేమ ఏనాడు విడనాడ లేను నే విడనాడ లేను

లైలా ఆ ఆ ఆ లైలా ఖైస్‌. లైలా లైలా ఖైస్‌
అందని పండును కోరీ అర్రు సాచే వెర్రివాడా
అంతటి లైలాను వలచే అర్హత నీ కెక్కడిదిరా
బ్రతుకుమీద ఆశవుంటే
పారిపోరా యిప్పుడే. యిప్పుడే
ప్రేమించిన వాడెవ్వడు పిరికివాడు కాడు అనురాగ ప్రవాహాన్ని
అడ్డగించ లేడెవ్వడూ ఎవ్వరెంత కాదన్నా
మా అనుబంధం శాశ్వతం
లైలాకే నా జీవితం అలనాడే అంకితం
ఏయ్‌ నోర్ముయ్‌ వదరుబోతా
పట్టండి పట్టండి కత్తుల బోనులో నిలబెట్టండి
నిలువెత్తు గోతిలో పాతిపెట్టండి

కత్తులు ఛేదింపలేవు నిప్పులు దహియింపలేవు
స్వచ్ఛమైన ప్రేమను ఏ శక్తులూ బంధింపలేవు

అనురాగమన్నది విడదీయలేనిది
అది వున్న మదిలోనే ఆ దైవమున్నది ఆ దైవమున్నది

కులముతో పనిలేనిది ధనముతో కొనలేనిది
కులముతో పనిలేనిది ధనముతో కొనలేనిది
దేవుడిచ్చిన వరమది మనిషి ఎన్నడు మాపలేనిది
అనురాగమన్నది విడదీయలేనిది
అది వున్న మదిలోనే ఆ దైవమున్నది ఆ దైవమున్నది

విరబూసే పూలలో మా చిరునవ్వులే ఉంటాయి
కదిలే చిరుగాలిలో మా కనుల బాసలుంటాయి
పొంగే కెరటాలలో మా వలపు పొంగులుంటాయి
కలిసే మేఘాలలో మా కన్నీటి ధారలే వుంటాయి
ఐనా నేల ఉన్నంతకాలం గాలి ఉన్నంతకాలం
నింగి ఉన్నంతకాలం నీరు ఉన్నంతకాలం
వెలుతురున్నంతకాలం కాలమున్నంతకాలం
ధర్మమున్నంతకాలం దైవమున్నంతకాలం
ఇలలోన మిగిలేను ఈ విషాద గాధా

ఓహో ప్రియతమా ప్రియతమా ఆ ఆ
నా పిలుపే వినలేవా నీ చెలినే కనరావా
ఎందున్నావో ఏమైనావో
ఎందున్నావో ఏమైనావో
ప్రహరీలు దాటి పహరాలు దాటి పయనించి నే వచ్చినాను
ప్రళయమ్ముగాని మరణమ్ముగాని
నిను వీడి నే నిలువలేను ఎందున్నావో ఏమైనావో

ఇక్కడే వున్నాను ఎక్కడికీ పోలేను
కడ వూపిరితో నీకై కలవరించినాను
కన్నుమూసినా నీకై వేచి వేచి వుంటాను
వేచివేచి వుంటాను వేచివేచి వుంటాను

నీవు లేని ఈ లోకం నరకం
నీవున్న చోటే నా స్వర్గం నిన్నే కలుసుకోనీ
నీలో కలిసిపోనీ కలిసిపోనీ

కాలమున్నంతకాలం ధర్మమున్నంతకాలం
దైవమున్నంతకాలం ఇలలోన మిగిలేను
మా ప్రేమగాధ ఈ అమరగాధ

లడ్డు లడ్డు లడ్డు బందరు మిఠాయి లడ్డు

లడ్డు లడ్డు లడ్డు బందరు మిఠాయి లడ్డు
బూంది లడ్డు కోవా లడ్డు రవ్వా లడ్డు
ఉసిరి బాదం పిస్తా కిచుమిచు కలిపిన లడ్డూ నేతి మిఠాయి లడ్డూ
ఊ ఊ ఊ ఆ ఆ ఆ
లడ్డు లడ్డు లడ్డు బందరు మిఠాయి లడ్డు
బూంది లడ్డు కోవా లడ్డు రవ్వా లడ్డు
ఉసిరి బాదం పిస్తా కిచుమిచు కలిపిన లడ్డూ నేతి మిఠాయి లడ్డూ
లడ్డు లడ్డు లడ్డు

కావాలంటే రాదు బజారులోనే లేదు
ఔను యోగం మీకే వుంది మీచేతికి వచ్చింది
హో హో హో హో హో ఆ ఆ ఆ
బక్క నక్క తిన్నడే పిక్క బలం వచ్చు
ముసలి తాత తినండా పడుచు తనం వచ్చు
వస్తాదై పోవలంతే కుస్తీలో నెగ్గాలంటే
వస్తాదై పోవలంతే కుస్తీలో నెగ్గాలంటే
దండా దండా ధైర్యం దాటి ధీమా గీమా అందిస్తుంది లడ్డూ

లడ్డు లడ్డు లడ్డు బందరు మిఠాయి లడ్డు
బూంది లడ్డు కోవా లడ్డు రవ్వా లడ్డు
ఉసిరి బాదం పిస్తా కిచుమిచు కలిపిన లడ్డూ నేతి మిఠాయి లడ్డూ
ఊ ఊ ఊ హా హా హా లడ్డూ లడ్డూ లడ్డూ

హనుమంతుడు తిన్నాడు లంకకు లంగించాడు
రావణుడు తిన్నాడు కైలాసమే కదిలించాడు
వుండను తింటే భూమే గుండ్రంగా ఉందంటారు
ముక్క కొరికితే చాలు స్వర్గాన్నే చూస్తారు
రమ్మంటే రంభొస్తుంది మిమ్మల్నే ప్రేమిస్తుంది
రమ్మంటే రంభొస్తుంది మిమ్మల్నే ప్రేమిస్తుంది
లోకం సోకం బాదా బంది తీరా సాగరమనిపిస్తుంది లడ్డూ

లడ్డు లడ్డు లడ్డు బందరు మిఠాయి లడ్డు
బూంది లడ్డు కోవా లడ్డు రవ్వా లడ్డు
ఉసిరి బాదం పిస్తా కిచుమిచు కలిపిన లడ్డూ నేతి మిఠాయి లడ్డూ
హో హో హో నేతి మిఠాయి లడ్డూ
హా హా హా నేతి మిఠాయి లడ్డూ

లాలేలో లిల్లేలేలో రామ రామ ఉయ్యాల అమ్మలాలో

లాలేలో లిల్లేలేలో రామ రామ ఉయ్యాల అమ్మలాలో
లాలేలో లిల్లేలేలో రామ రామ ఉయ్యాల అమ్మలాలో
మూడు బురుజుల కోట ముత్యాల తోట
ముంగిట్లో చిన్నారి బావకు మురిపాల తీట
మూడు బురుజుల కోట ముత్యాల తోట
సందిట్లో వయ్యారి మరదలికి సరసాల మూట
లాలేలో లిల్లేలేలో రామ రామ ఉయ్యాల అమ్మలాలో
లాలేలో లిల్లేలేలో రామ రామ ఉయ్యాల అమ్మలాలో

ఓ ఓ ఓ ఇంతలేసి కళ్ళున్న
ఇంతి మనసు చేమంతా ముద్దబంతా చెప్పరాదా చిగురంత
ఇంతలోనె చెప్పుకుంటె కొంటె వయసు
అన్నన్నా వదిలేనా నన్నైనా నిన్నైనా
ఇంతలేసి కళ్ళున్న
ఇంతి మనసు చేమంతా ముద్దబంతా చెప్పరాదా చిగురంత
ఇంతలోనె చెప్పుకుంటె కొంటె వయసు
అన్నన్నా వదిలేనా నన్నైనా నిన్నైనా
కిన్నెడల్లె కన్నె పరువం ఉం ఉం కన్ను గీటి కవ్విస్తే
ఉన్న వేడి ఉప్పెనల్లే ఏ ఏ ఉరకలేసి ఊరిస్తే

లాలేలో లిల్లేలేలో రామ రామ ఉయ్యాల అమ్మలాలో
లాలేలో లిల్లేలేలో రామ రామ ఉయ్యాల అమ్మలాలో

ఓ ఓ ఓ గడుసు గాలి పడుచు మొగ్గ
తడిమిపోతే కాయౌనా పండౌనా కామదేవుని పండగౌనా
కాముడై లగ్గమెట్టి కబురుపెడితె
వారమేల వర్జమేల వల్లమాలిన వంకలేల
గడుసు గాలి పడుచు మొగ్గ
తడిమిపోతే కాయౌనా పండౌనా కామదేవుని పండగౌనా
కాముడై లగ్గమెట్టి కబురుపెడితె
వారమేల వర్జమేల వల్లమాలిన వంకలేల
ముసురుకున్న ముద్దులన్నీ ఈ ఈ మూడుముళ్ళ గుత్తులైతే
కలవరించు పొద్దులన్ని ఈ ఈ కాగిపోయి కౌగిలైతే

మూడు బురుజుల కోట ముత్యాల తోట
సందిట్లో వయ్యారి మరదలికి సరసాల మూట
లాలేలో లిల్లేలేలో రామ రామ ఉయ్యాల అమ్మలాలో
లాలేలో లిల్లేలేలో రామ రామ ఉయ్యాల అమ్మలాలో

లాలి లాలి గోపాలబాల లాలి

లాలి లాలి గోపాలబాల లాలి
పొద్దుపోయే నిదురించవయ్య ముద్దులయ్య
లాలి లాలి గోపాలబాల లాలి లాలి
మేడ మీద బూచివాడు జాగుచేస్తే వచ్చేస్తాడు
జాలి తలచి పవళించవయ్య చల్లనయ్య
లాలి లాలి గోపాలబాల లాలి లాలి

బొజ్జనిండ పాలారగించి సెజ్జమీద బజ్జోవయ్య
బొజ్జనిండ పాలారగించి సెజ్జమీద బజ్జోవయ్య
వింతకధనే చెపుతా నీకు నీవు వింటే అంతే చాలు
కధకు మూలం నీవే కదయ్య చక్కనయ్య
లాలి లాలి గోపాలబాల లాలి లాలి

నిండుజాబిలి తారాడసాగే నీటకలువ నింగి చూసే
నిండుజాబిలి తారాడసాగే నీటకలువ నింగి చూసే
నీలమేఘం నడుమ నిలిచే నీకు నిదుర రానేరాదా
తెల్లవారే వేళాయెనయ్య నల్లనయ్య
లాలి లాలి గోపాలబాల లాలి లాలి
పొద్దుపోయే నిదురించవయ్య ముద్దులయ్య
లాలి లాలి గోపాలబాల లాలి లాలి

L అంటే O అంటే V అంటే E అంటే

L అంటే O అంటే V అంటే E అంటే లవ్వు లవ్వు LOVE లే
K అంటే I అంటే S అంటే S అంటే కిస్సు కిస్సు KISS లే
L అంటే O అంటే V అంటే E అంటే లవ్వు లవ్వు LOVE లే
K అంటే I అంటే S అంటే S అంటే కిస్సు కిస్సు KISS లే
నువ్వంటే నేనంటే ఓ జంటే
నీవెంటే నేనుంటా మోజుంటే
వద్దన్నా ముద్దంటా వలపుంటే
సై అంటే సై అంటే సయ్యాటే

L అంటే O అంటే V అంటే E అంటే లవ్వు లవ్వు LOVE లే
K అంటే I అంటే S అంటే S అంటే కిస్సు కిస్సు KISS లే

వస్తే రమ్మంటా వయసే తెమ్మంటా వాలు పొద్దుల పూట
నేనే కన్నంటా నువ్వే చూపంటా పేలనీ తొలి తూటా
అరె గుట్టే నాదంటా గురిలో వుందటా ఆడనా చెలి వేట
గువ్వే నేనంట గుబులే నాదంటా గూటికే రమ్మంటా
ఈజోరులో ఓ ఈజోరులో చలాకి అందాలు ముద్దడితే ముచ్చట
జోహారని పెదాల ఎంగిల్లు అందించనా ఇచ్చట
ఆ కౌగలింతకే కన్నె తాపాలూ చెల్లంటా
గట్టి తాకిడి ఏదో సాగింది లెమ్మంటా
ఆమాటే నువ్వంటె నేనింటే కొట్టిందిలే గంట

L అంటే O అంటే V అంటే E అంటే లవ్వు లవ్వు LOVE లే
K అంటే I అంటే S అంటే S అంటే కిస్సు కిస్సు KISS లే

సోకే నాదంటా సొత్తే నీదంట దోచుకో మరి వాటా
పువ్వే నువ్వంటా తొడిమే నేనంటా తూచనా చెలి కాటా
ఏరే నేనంటా నీరే నీవ్వంటా ఏకమై పదమంటా
నీతో నేనుంటే మోతే మోతంటా చేరుకో పొదరింట అ
ఈ ఊపులో ఓ ఈ ఊపులో గులాబి గుప్పెళ్ళు విప్పెయ్యనా ఇచ్చటా
అరే ఈ కైపులో వరించి వత్తిళ్ళు పెంచెయ్యనా అచ్చటా
చుక్కలాడితే ఉక్క పోసేదే ప్రేమంటా
గుట్టు చప్పుడై గుండె లాగింది రమ్మంటా
ఆమాటే నువ్వంటే నేనింటే కొట్టిందిలే గంట

L అంటే O అంటే V అంటే E అంటే లవ్వు లవ్వు LOVE లే
K అంటే I అంటే S అంటే S అంటే కిస్సు కిస్సు KISS లే
నువ్వంటే నేనంటే ఓ జంటే
నీవెంటే నేనుంటా మోజుంటే
L అంటే O అంటే V అంటే E అంటే లవ్వు లవ్వు LOVE లే
K అంటే I అంటే S అంటే S అంటే కిస్సు కిస్సు KISS లే
S S S లే

12 February 2010

లవ్వు లవ్వు లవ్వు లవ్వు

లవ్వు లవ్వు లవ్వు లవ్వు
love అంటే లవ్వే లవ్వు
step అంటే స్టెప్పే step
love అంటే లవ్వు లవ్వు
step అంటే స్టెప్పే step
urgent నాకు lover
lip అంటే తప్పు తప్పు
bed అంటే రేపు మాపు
అందాక ఆగు misteru ఊ ఊ
అందాక ఆగు misteru

love అంటే లవ్వే లవ్వు
step అంటే స్టెప్పే step
love అంటే లవ్వు లవ్వు
step అంటే స్టెప్పే step
urgent నాకు lover
lip అంటే తప్పు తప్పు
bed అంటే రేపు మాపు
అందాక ఆగు misteru ఊ ఊ
అందాక ఆగు misteru

మన పడుచు కేసుకి
తొలి వలపు డోసుకి
అరె జగము తకిట తదిమి అన్నది హోయ్
మన నడక దాటికి
జత నడుము వూపుకి
అబ్బ కన్నెతనము కరుగు తున్నది
ఈ దెబ్బలాట తప్పు కాదు అమ్మాయి
తబ్బిబ్బులైతే తట్టుకొరా అబ్బాయి
ఈ దెబ్బలాట తప్పు కాదు అమ్మాయి
తబ్బిబ్బులైతే తట్టుకొరా అబ్బాయి
తరులు గిరులు విరులు మరులు
కూహు దక్కని వుయ్యాల నాట్యాల నా వొల్లు నీ వొల్లు పుల్టేసుకొవాల

love అంటే లవ్వే లవ్వు
step అంటే స్టెప్పే step
love అంటే లవ్వు లవ్వు
step అంటే స్టెప్పే step
urgent నాకు lover
lip అంటే తప్పు తప్పు
bed అంటే రేపు మాపు
అందాక ఆగు misteru ఊ ఊ
అందాక ఆగు misteru

తొలి తనువు దాటినా తొలి గడప దాటకు
అరె చెప్పినట్టు వినవు వయసులు
అటు మతులు చెప్పిన మన లయలు ఆగునా
అరె కప్పి పోవె కన్నె సొగసులు హోయ్
ఆ కంచె దాటి వెల్ల నీకు నీ రంజు
ఇది century కి చాలినంత romance
ఆ కంచె దాటి వెల్ల నీకు నీ రంజు
ఇది century కి చాలినంత romance
కదలే ముదిరి జతలే కుదురి
అబ్బాయి వాటేసి గు గుచ్చికుంటుంటే
నా ఏటికే కొత్త నీరెక్కిపోతుంటుంటే

love అంటే లవ్వే లవ్వు
step అంటే స్టెప్పే step
love అంటే లవ్వు లవ్వు
step అంటే స్టెప్పే step
urgent నాకు lover
lip అంటే తప్పు తప్పు
bed అంటే రేపు మాపు
అందాక ఆగు misteru ఊ ఊ
అందాక ఆగు misteru

లేవోయి చిన్నవాడ లేలేవోయి చిన్నవాడ

లేవోయి చిన్నవాడ లేలేవోయి చిన్నవాడ
నిదుర లేవోయి వన్నెకాడ
నిదుర లేవోయి వన్నెకాడ
లేవోయి చిన్నవాడ లేలేవోయి చిన్నవాడ
నిదుర లేవోయి వన్నెకాడ
నిదుర లేవోయి వన్నెకాడ

పొడిచింది చందమామ చేరి పిలిచింది వయ్యారి భామ ఆ ఆ ఆ
పొడిచింది చందమామ చేరి పిలిచింది వయ్యారి భామ
కురిసింది వెన్నెల వాన అహ విరిసింది పన్నీటి వాసన
లేవోయి చిన్నవాడ లేలేవోయి చిన్నవాడ
నిదుర లేవోయి వన్నెకాడ
నిదుర లేవోయి వన్నెకాడ

కన్నుల్లో కళ మాసెనేల
నీ మదినోల మసున్నుసెనేల
కన్నుల్లో కళ మాసెనేల
నీ మదినోల మసున్నుసెనేల
జత జంది సుఖ పడలేవురా
నీ బ్రతుకెల్ల కలయై పోవురా
లేవోయి చిన్నవాడ లేలేవోయి చిన్నవాడ
నిదుర లేవోయి వన్నెకాడ
నిదుర లేవోయి వన్నెకాడ

నిన్న కలిసే మొన్నలోన ఉన్న నేడు రేపుకున్న
నిన్న కలిసే మొన్నలోన ఉన్న నేడు రేపుకున్న
ఉన్న నేడు రేపుకున్న
ఉన్న నాడే మేలుకో నీ తనివి తీర ఏలుకో
లేవోయి చిన్నవాడ లేలేవోయి చిన్నవాడ
నిదుర లేవోయి వన్నెకాడ
నిదుర లేవోయి వన్నెకాడ

నా మనసె గోదారి

నా మనసె గోదారి
నీ వయసె కావేరి
భోల్ రాధా భోల్ రెండు కలిసెనా లెదా
అరె భోల్ రాధా భోల్ జోడి కుదిరెనా లెదా

నెనెం చెసెదయ్యొ
దద్దమ్మవు దొరికావు
అరె ఎం చెప్పెదయ్యొ
సుద్ధ మొద్దువి దొరికావు
నెనెం చెసెదయ్యొ
దద్దమ్మవు దొరికావు
అరె ఎం చెప్పెదయ్యొ
సుద్ధ మొద్దువి దొరికావు
సుద్ధ మొద్దువి దొరికావు
సుద్ధ మొద్దువి దొరికావు

కృఇష్ణుడు నేనే
రుక్మిని నీవే
రాతిరి ఎత్తుకు పోతానె
లారీ మెల్లగా తొలుకువస్తా చల్లగ లేచిపోదాము
మీ అమ్మె యమగండం మా తల్లె సుడిగుండం
మీ అమ్మె యమగండం మా తల్లె సుడిగుండం
భోల్ రాధా భోల్ గండం తప్పెనా లేదా
అరె భోల్ రాధా భోల్ జోడి కుదిరెనా లెదా
లావొక్కింతయు లేదు దైర్యం విలోలంబయ్యే
ప్రాణంబులా తావుల్ దప్పెను మూర్చ వచ్చె
మనసె తారెత్తె మా ప్రేమయే జావై పోయెను
గుండేలే పగిలి చద్దామింక దిక్కెవ్వరో
పోవే సాకినీ ధాకినీ కదులు పో పో వెల్లిపో లంకినీ
భోల్ అమ్మా భోల్ జోడి కలిసిందా లేదా
భోల్ అత్తా భోల్ రోగం కుదిరిందా లేదా

కోడి కూసే జాము దాకా తోడురారా చందురూడా

కోడి కూసే జాము దాకా తోడురారా చందురూడా
కోడె కారు కొత్త కోర్కెలు తరుముతున్నవి అందగాడా
కోడి కూసే జాము దాకా తోడురారా చందురూడా
కోడె కారు కొత్త కోర్కెలు తరుముతున్నవి అందగాడా

కన్నె బుగ్గకు సిగ్గు కమ్మెను కళ్ళు చూస్తె కైపులెక్కెను
కన్నె బుగ్గకు సిగ్గు కమ్మెను కళ్ళు చూస్తె కైపులెక్కెను
కాపురానికి కొత్తవాళ్ళం కాడిమొయని కుర్రవాల్లం
కలలు తెలిసిన చిలిపివాడా కలుపరా మము కలువరేదా

కంటికింపౌ జంటలంతె వెంట పడతావంట నువ్వు
కంటికింపౌ జంటలంతె వెంట పడతావంట నువ్వు
తెల్లవార్లూ చల్ల చల్లని వెన్నెలలతొ వెపుతావట
తెల్లవార్లూ చల్ల చల్లని వెన్నెలలతొ వెపుతావట
మత్తు తెలిసిన చందురూడా మసక వెలుగే చాలులేరా

అల్లుకున్న మనసులున్నవి అలసిపోని బంధమున్నది
అల్లుకున్న మనసులున్నవి అలసిపోని బంధమున్నది
చెలిమి నాటిన చిన్న ఇంట ఎదగనీ మా వలపు పంట
చెలిమి నాటిన చిన్న ఇంట ఎదగనీ మా వలపు పంట
తీపిమబ్బుల చందురూడా కాపువై నువ్వుండిపోరా

గుస్సా రంగయ్య కొంచం తగ్గయ్య

గుస్సా రంగయ్య కొంచం తగ్గయ్య
కోపం మనిషికి ఎగ్గయ్యా
గుస్సా రంగయ్య కొంచం తగ్గయ్య
కోపం మనిషికి ఎగ్గయ్యా
ఈ లోకం మారేది కాదు
ఈ శోకాలు తీరేవి కావు
ఈ లోకం మారేది కాదు
ఈ శోకాలు తీరేవి కావు
దోర పాపాన్న వున్నాను నేను
కొత్త లోకాన్ని నాలోన చూడు

దేశాన్ని దోచేటి ఆసాములున్నారు
దేవుణ్ణి దిగమింగు పూజారులున్నారు
ప్రాణాలతో ఆడు వ్యాపారులున్నారు
మనిషికీ మంచికీ సమాధి కట్టారు
మహాత్ములెందరు సహాయ పడిన మంచి జరగ లేదు
మహాత్ములెందరు సహాయ పడిన మంచి జరగ లేదు
జాతి వైద్యులే కోత కోసినా నీతి బ్రతకలేదు
భోగాలు వెతుకాడు వయసు
అనురాగాల జతి పాడు మనసు
నీ దాహాని కనువైన సొగసు
నీ సొంతాన్ని చేస్తుంది పడుచు

కాటుకెట్టిన కళ్ళలో కైపులున్నవి
మల్లెలెట్టిన కురులలో మాపులున్నవి
వన్నె తేరిన కన్నెలో చిన్నెలున్నవి
అన్ని నీవే అనుటకు రుజువులున్నవి
చక్కని చుక్కా సరసనుండగ పక్క చూపు లేల
చక్కని చుక్కా సరసనుండగ పక్క చూపు లేల
బాగుపడని ఈ లోకం కోసం బాధ పడేదేల
మోహాన్ని రేపింది రేయి
మన పేగుల్లో వుందోయి హాయి
ఈ అందానికందివ్వు చేయి
ఆనందాల బంధాలు వేయి

తుహై రాజా మై హు రాణి

తుహై రాజా మై హు రాణి
ఫిర్ భి నహి హై బాత్ పురాని
తుహై రాజా మై హు రాణి
ఫిర్ భి నహి హై బాత్ పురాని
దోనోంకీ ఇక్ దిల్ కి జబానీ
షురు హుఇ హై నయి కహానీ
దోనోంకీ ఇక్ దిల్ కి జబానీ
షురు హుఇ హై నయి కహానీ

ప్యార్ మే మగన్ ఝీల్ హై గగన్
నాం హై లగన్ సాత్ హై పవన్
హం సె దూర్ హై జిందగీ కి ఘం
క్యూ కహి రుకే ప్యార్ కే కదం
తారోన్సె ములఖాత్ కరే
ఉజియారో కి బాత్ కరే
చాంద్ సె జాకర్ సైర్ కరే
దునియా వాలోన్ సే న డరే
దునియా వాలోన్ సే న డరే

దడ్కనోన్ కి ధున్
సున్ మెరే సనం
జాన్ హై తెరీ జాన్ కీ కసం
మై తెరీ జుబాన్
తూ జవాన్ కలం
షాయరీ కొ దీ హం నయా జనం
హం సె నయే గుల్ కయీ ఖిలే
దర్పన్ అప్ని జమీన్ పె ఖులే
జనం జనం మే సాత్ చలే
జల్నే వాలే ఔర్ జలే
జల్నే వాలే ఔర్ జలే

పేరు చెప్పనా నీ రూపు చెప్పనా

పేరు చెప్పనా నీ రూపు చెప్పనా
నీ పేరే అనురాగం
నీ రూపము శృంగారము
నీ చిత్తమూ నా భాగ్యము

పేరు తెలుసునూ నీ రూపు తెలుసును
నీ పేరే ఆనందం
నీ రూపము అపురూపము నీ నేస్తాము నా స్వర్గము


1||పువ్వుల చెలి నవ్వొక సిరి
దివ్వెలెలనె నీ నవ్వు లుండగా
మమతల గని మరునికి సరి
మల్లె లేలారా నీ మమతలుండగా
నీ కళ్ళలో నా కలలనె పండనీ
నీ కలలలో నన్నే నిండనీ
మనసై భువి పై దివి నే దిగనీ

2|| నీవొక చలం నేనొక అలా
నన్ను వూగనీ నీ గుండె లోపల
విరి సగముల కురులొక వల నన్ను చిక్కనీ ఆ చిక్కు లోపలా
నీ మెప్పులు నా సొగసులు
ఆ మెరుగులూ వెలగనీ వెలుగులా
మనమే వెలుగు చీకటి జథలూ

3|| పెదవికి సుధ ప్రేమకు వ్యధా
అసలు అందమూ అవి కోసారు కుందామూ
చెదరని జత చెరగని కథ
రాసుకుందాము పెన వేసుకుందాము
నీ హృదయమూ నా వెచ్చనీ ఉదయము
నీ ఉదయమూ దిన దినం మాధురమూ
ఎన్నో యుగముల యోగము మనమూ

ఈ పగలు రేయిగా పండు వెన్నెలగ మారినదేమి చెలీ ఆ కారణమేమి చెలీ

పల్లవి :
ఈ పగలు రేయిగా పండు వెన్నెలగ మారినదేమి చెలీ ఆ కారణమేమి చెలీ
వింతకాదు నా చెంతనున్నదీ
వెండి వెన్నెల జాబిలి నిండు పున్నమి జాబిలి

చరణం:
మనసున తొణికే చిరునవ్వెందుకు పెదవులమీదికి రానీవు (2)
పెదవికదిపితే మదిలో మెదిలే మాట తెలియునని మానేవు
!! వెండి వెన్నెల !!

చరణం: కన్నులు తెలిపే కథలనెందుకు రెప్పలార్చి ఏమార్చేవు (2)
చెంపలు పూచే కెంపులు నాతో నిజముతెలుపునని జడిసేవు
!! వెండి వెన్నెల !!

చరణం: అలుకచూపి అటువైపుతిరిగితే అగుపడదనుకొని నవ్వేవు (2)
నల్లనిజడలో మల్లెపూలు నీ నవ్వునకద్దము చూపేను
!! వెండి వెన్నెల !!

ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది ..

పల్లవి:

ఆకాశం ఏనాటిదో
అనురాగం ఆనాటిది |2|
ఆవేశం ఏనాడు కలిగెనొ
ఆనాడే తెలిసిందది |2|
ఆకాశం.. |2|
చరణం 1
ఏ పువ్వు ఏ మోవిదన్నది
ఏ నాడో రాసున్నది
ఏ ముద్దు ఏ మోవిదన్నది
ఏ పొద్దో రాసున్నది
బంధాలై పెన వేయు వయసుకు
ఆందాలే దాసోహమనగ
మందారం విరబూయు పెదవులు
మధువులనే చవి చుడమనగ
పరువాలే ప్రణయాలై
స్వప్నాలే స్వర్గాలై
ఎన్నేన్నో శృంగార లీలలు
కన్నుల్లో రంగేళి అలరెను

చరణం 2
ఏ మేఘం ఏ వాన చినుకై
చిగురాకై మొలకెత్తునో
ఏ రాగం ఏ గుండె లోతున
ఏ గీతం పలికించునో
హృదయాలే తెర తీసి తనువుల
కలబోసి మరపించమనగ
కౌగిలిలో చెర వేసి మదనుని
కరిగించి గెలిపించ మనగ
మోహాలే దాహాలై
సరసాలే సరదాలై
కాలాన్నే నిలవేసి కలలకు
ఇవ్వాలి వెలలేని విలువలు

చెలిమిలో వలపు రాగం

చెలిమిలో వలపు రాగం
వలుపులో మధుర భావం
రాగం భావం కలిసే ప్రణయ గీతం

పాడుకో ర ప ప పా పాడుకో ర ప ప పా
పాడుకో

1|| ఉయ్యాలలూగినాను నీ ఊహలో
నెయ్యాలు నేర్చినాను నీ చూపులో
ఆరాధనై గుండెలో
ఆలాపనై గొంతులో
అలల లాగా కలల లాగా
అలల లాగా కలల లాగా కదలీ రాదా

2|| నులి వెచ్చనైనా తాపం నీ స్నేహమూ
ఎద గుచ్చుతున్న భావం నీ రూపమూ
తుది లేని ఆనందము తొణుకాదు సౌందర్యము
శృతిని చేర్చి స్వరము కూర్చి
శృతిని చేర్చి స్వరము కూర్చి పదము కాగా

అన్నది నీవెనా నా నా నా నా స్వామి....

అన్నది నీవెనా నా నా నా నా స్వామి....
అన్నది నీవెనా నా నా నా నా స్వామి....
ఉన్నది నీవె...
ఉన్నది నీవె...నా లొన నా స్వామి...
నా లొన నా స్వామి...
అన్నది నీవెనా నా నా నా నా స్వామి....
చెదరిన జీవితమా నా కా నాకా...
ఏమి పరీక్ష ఎలా నా నా స్వమి...
అన్నది నీవెన నా నా నా నా స్వామి....

అగ్ని సాక్షిగా ఆలుమగలై అలరితిమింతటి దాక
పసుపు కుంకుమల పరిమలమంత పతి రూపమ్మె కాగా ||2 TIMES||
వినలెను విడలెను వేరై మనలెను
శొధనలొ వెదనలొ బాధను కాలెను
ఇటులన్నది నీవెన నా నా నా నా స్వామి....

దైవదత్తమౌ ప్రెమ కుసుమమె వీధిని విసురుట తగునా
పరులు తాకినా విరి గుండెలలొ మలి ఆమని వెలిసెనా ||2 TIMES||
నీ కరమె నా వరము నీవె నా జగము
మరణమ్మె సరణమ్ము మారదు నా మనము
అన్నది నీవెన....

బండి కాదు మొండి ఇదీ సాయం పట్టండీ

బండి కాదు మొండి ఇదీ సాయం పట్టండీ...
పెట్రోల్ ధర మండుతోంది ఎడ్లు కట్టండి...
గోపాలా.. గోవిందా.. రావయ్యా.. లాగయ్యా..

||బండి కాదు||

ఎక్కడికి వెళ్ళాలయ్యా...వెళ్ళినాక చెప్తానయ్యా..
చెప్పకుంటె ఎట్టాగయ్యా... చెప్పుకుంటె తంటాలయ్యా...

||ఎక్కడికి||
||బండి కాదు||

అరె ఇంగ్లాండు మహరాణి ఈ డొక్కు కార్లోనె ఊరేగి వెళ్ళిందటా...హా..
అది చూశాకా మోజెక్కీ మైసూరూ మహరాజ దర్జాగ కొన్నాడటా..
అది ఏలమేసారు నాన్న పాట పాడారు...ఏ గాణి ఇచ్చారు ఏగించుకొచ్చారు
ఇది పుట్టాక ఇట్టాగే నెట్టించు కుంటూంది నెట్టింది ఇన్నేళ్ళటా...||2||
అదే అలవాటు అయ్యిందటా...
అరె ఊగిపోతుందీ...అసలు ఊడిపోతుందీ...
ఒట్టి బొమికెలేనండి...దీన్ని మోసుకెళ్ళండీ...
మీ పెళ్ళిళ్ళు జరగాలి రా... నాయనా...
మీరు ఊరేగి వెళ్ళాలి రా..ఇది జగన్నాధ రధమేను రా...

||ఎక్కడికి||
||బండి కాదు||
గోపాలా.. గోవిందా..రేయ్ నాయ్‌నా గోపాలా..
రా రా సాయం పట్రా..నెట్టు నెట్టు నెట్టు నెట్టు..

అరె కన్నాను పిల్లల్ని అరడజను కోతుల్ని
చిన్నారి సైన్యాన్నీ..పేరెట్టాను రామదండనీ...
అరె లంక కెళ్ళింది... రాణి తోటి వచ్చిందీ...
అరె బ్రిడ్జి కట్టిందీ... ఇంత ఎవరు చేసిందీ..
మా రామదండు నెదిరించి ఏసైన్యం ఏనాడు గెలిచింది బతికిందీ...
హ హా...ఇది ఊరంతా తెలిసిందీ...
ఈ కారు చూడండీ... నకరాలు చేస్తోందీ...
దీనంతు చూడండీ... ఒక్క తోపు తోయ్యండీ...
అరె ఈ కారు కొన్నందుకూ... నేనిందర్ని కన్నందుకూ...
సరిపోయారు తోసేందుకూ....

||ఎక్కడికి||2||

||బండి కాదు||

గు గు గు గు గుడెసుంది

గు గు గు గు గుడెసుంది
మ మ మ మ మంచముంది
హాయ్ గు గు గు గు గుడెసుంది
మ మ మ మ మంచముంది
గుడిసె మంచం మడిసే లేక అమ్మో అంటున్నవి అమ్మో అంటున్నవి
హ గు గు గు గు గుడెసుంది
మ మ మ మ మంచముంది
రెంటికి రాత్రికి రేటొచ్చి రైటో రటన్నవి రైటో రైటన్నవి

న్య్లొను సీర కడితి నిచేయిన పౌదెరు యేస్తి
న్య్లొను సీర కడితి నిచేయిన పౌదెరు యేస్తి
సీర మోజు తీరాలోయి హా పౌదెరు పొగరు అణగాలోయి హా హా
లోదేసుకు వచ్చాడు మోజు తీర్చే మొగవాడు
దొరికింది వదలడు వీడు పొగరణిచే మొనగాడు
నీలాంటి డైవరోడే నాకెంతో నచ్చినోడు
అహ హా అహ అహ హా అహ
అహ హా అహ అహ హా అహ అహా..అయ్యా

చేతినిండా సొమ్ముంది ఆ వంటినిండా చావుంది అబ్బో
చేతినిండా సొమ్ముంది వంటినిండా చావుంది
రెండు ఉన్నా గండడితోటి హా రేతిరంతా జాతర ఉంది హా
రేతిరేమి సాలన్నానా రేపు మాత్రం వద్దన్నానా
జాతరయ్యే మూణ్ణాళ్ళు జరిపించు తిరణాళ్ళు
నీలాంటి కేసు కోసం చూస్తున్నా ఇన్నాళ్ళు
అహ హా అహ అహ హా అహ
అహ హా అహ అహ హా అహ అహా..అయ్యా

జూనియర్ జూనియర్ జూనియర్

జూనియర్ జూనియర్ జూనియర్
Yes Boss
ఇటు అటు కాని హౄదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు
ఇటు అటు కాని హౄదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు
అటు ఇటు తానొక ఆటబొమ్మని తెలిసే ఎందుకు వలచేవు
అటు ఇటు తానొక ఆటబొమ్మని తెలిసే ఎందుకు వలచేవు
ఒడ్డున పెరిగే గడ్డిపోచవూ
గడ్డిపోచా? నేనా? హె హె హె హె
ఒడ్డున పెరిగే గడ్డిపోచవూ ఒద్దిక నదితో కోరేవు
ఒడ్డున పెరిగే గడ్డిపోచకు హౄదయం ఎందుకు వుండకూడదు
వుందని ఎందుకు ఒప్పుకోరాదు
రబ్బరు బొమ్మకు రాగం తెలుసు ఆటబొమ్మకు ఆశలు తెలుసు
ఇద్దరు ఒక్కటె ఎందుకు కారదు
జూనియర్ జూనియర్ జూనియర్
ఇటు అటు కాని హౄదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు

సాగరమున్నా తీరనిది నీ దాహమురా
కోకిలగానం కాకి పాడితే ద్రోహమురా
నీ మొహమురా హి హి హి హి హి
సాగరమున్నా తీరనిది నీ దాహమురా
కోకిలగానం కాకి పాడితే ద్రోహమురా
తీగకు పందిరి కావలెగానీ తెలుసా నువ్వే పందిరని
తీగకు పందిరి కావలెగానీ తెలుసా నువ్వే పందిరని
నీటిని చూసి దాహమువేస్తే తేనెకోసం తేటి వస్తే
పాపం గీపం అనడం ఛాదస్తం
No it's bad
But I am mad
మోడుకూడ చిగురించాలలి మూగమనసు కోరే కోర్కెను
మోసం ద్రోహం అనడం అన్యాయం
హ హ హ హ
what పక పక పిక పిక

చైత్రము లోన చినుకు పడాలని కోరేవు
మార్గసిరాన మండుటెండకై చూసేవు
Boss, Love has no season, not even reason
Shut up
చైత్రము లోన చినుకు పడాలని కోరేవు
మార్గసిరాన మండుటెండకై చూసేవు
ఉదయంకోసం పడమర తిరిగి ఎదురుతెన్నులు కాచేవు
ఉదయంకోసం పడమర తిరిగి ఎదురుతెన్నులు కాచేవు
ఎండా వాన కలిసొస్తాయి
వెలుగు చీకటి కలిసుంటాయి
జరగని వింతలు ఎన్నో జరిగాయి
It is highly idiotic
No boss, it is fully romantic
పాట పాడెను ముద్దుల బొమ్మ
పక పక నవ్వేవెందులకమ్మా
మనసున వున్నది చెప్పీ నవమ్మా
మనసున వున్నది చెప్పీ నవమ్మా

తాళి కట్టు శుభవేల మెడలో కల్యణమాల

తాళి కట్టు శుభవేళ మెడలో కల్యాణమాల ఒహొహూ అహహా ఊహూహు.. యే హే హే...
తాళి కట్టు శుభవేళ మెడలో కల్యాణమాల
ఎనాడు ఎ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో
ఎనాడు ఎ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో

తాళి కట్టు శుభవేళ మెడలో కల్యణమాలా....

వికటకవి ని నేను వినండీ ఒక కధ చెపుతాను...
కాకులు దూరని కారడవి...
అందులో.. కాలం యెరుగని మానోకటి..
ఆ అందాల మానులో!! ఆ అద్బుత వనంలో!!..
చక్కని చిలకలు అక్కా చెల్లెలు పక్కన గోరింకలు..
ఒక గోరింకకు ఓ చిలకమ్మకు ఒద్దిక కుదిరెనమ్మ
బావ రావా నన్నేలుకోవా....

తాళి కట్టు శుభవేళ మెడలో కల్యణమాలా....
ఎనాడు ఎ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో..
ఎనాడు ఎ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో..

మేళాలు తాళాలు మంగళ వాద్యాలు.. మిన్నంటి మోగెనమ్మా...
థుంథుంథుంథుం..థుథుంథుథుం..థుంథుంథుంథుం..థుథుంథుథుం
మేళాలు తాళాలు మంగళ వాద్యాలు.. మిన్నంటి మోగెనమ్మా...
వలపు విమానాన తలపుల వేగాన వచ్చాయి కాన్కలమ్మా..
Singapore airlines announces the arrival of flight S2583
ఊరేగు దారుల వయ్యారి భామలు వీణలు మీటిరమ్మా...
శింగారి జాణల ముంగాలి మువ్వలు ఘల్లున మోగెనమ్మా..

||తాళి కట్టు ||

గోమాత లేగతొ కొండంత ప్రేమతొ దీవించ వచ్చెనమ్మా...
కాన్వెంటు పిల్లల పోలిన నెమళులు గ్రీటింగ్సు చెప్పిరమ్మా...
Wish you both a happy life... happy happy married life
హి హహ హీ హ హ...హి హి హ హ...
నాలుగు వేదాలు వల్లించు హరిణాలు మంత్రాలు చదివెనమ్మా
మాంగల్యం తంతునానేనా మమ జీవన హేతునా..
కంఠే బద్నామి శుభగే త్వంజీవ శరదాంశతం...
మాంగల్యం తంతునానేనా మమ జీవన హేతునా..
పట్టపుటేనుగు పచ్చగ నూరేళ్ళు వర్దిల్ల మనెనమ్మా....

||తాళి కట్టు ||

చేయి చేయిగ చిలుకా గోరింక శయ్యకు తరలిరమ్మా..
చెల్లెలి కోసం త్యాగము చేసిన చిలుకమ్మ తొలగెనమ్మా..
తప్పుగ తలచిన అప్పటి గోరింకకిప్పుడు తెలిసెనమ్మా..
అది చిలుకే కాదని బావిలొ కప్పని జాలిగ తలచెనమ్మా...

||తాళి కట్టు ||

దెవుడె ఇచ్చాడు వీధి ఒక్కటి

మ్మ్ మ్మ్
దెవుడె ఇచ్చాడు వీధి ఒక్కటి
దెవుడె ఇచ్చాడు వీధి ఒక్కటి
ఇక వూరేల సోంత ఇల్లేలా
ఇక వూరేల సోంత ఇల్లేలా ఓ చెల్లేలా
ఏల ఈ స్వార్ధం ఎది పరమార్ధం

దెవుడె

నన్నడ్డిగి తల్లి తండ్రి కన్నారా ఆ ఆ ఆ
నన్నడ్డిగి తల్లి తండ్రి కన్నారా
నా పిల్లే నన్నడ్డిగి పుట్టారా
పాదం పున్యం నాది కాదే పోవె పిచ్చమ్మ
నారు పోసి నీరు పోసె నధుడు వాడమ్మ
ఎది నీది ఎది నాది ఈ వేదాలు పుట్ట వాదాలే ఓ చెల్లేలా
ఏల ఈ స్వార్ధం ఎది పరమార్ధం

దెవుడె

సిలలెని గుడికేల నైవెద్యం
ఈ కలలోని సిరికేల నీ సంభరం
ముళ్ళ చెట్టుగ చుట్టు కంచె ఎందుకే పిచ్చమ్మ
కళ్ళులెని కబొది చెసి దీపం నీవమ్మ
తోలుత ఇల్లు తుదకు మన్ను
ఈ బ్రతుకేంత దాని విలువెంత ఓ చెల్లేలా
ఏల ఈ స్వార్ధం ఎది పరమార్ధం

దెవుడె

తెలుసెట్లు చెప్పేది సిద్దాంతం
అది తెలియక పోతేనె వెదాంతం
మన్నలోన మనిక్యాని వేతికే వేర్రమ్మ
నిన్న నువ్వే తెలుసుకుంటె చాలును పోవమ్మ
ఎది సత్యం ఎది నిత్యం ఈ మమకారం వొట్టి అహంకారం ఓ చెల్లేలా
ఏల ఈ స్వార్ధం ఎది పరమార్ధం

దెవుడె

ప్రియతమా ... నా హృదయమా

ప్రియతమా ... నా హృదయమా
ప్రియతమా ... నా హృదయమా
ప్రేమకే ప్రతిరూపమా
ప్రేమకే ప్రతిరూపమా
నా గుండెలో నిండిన గానమా
నను మనిషిగా చేసిన త్యగామా

ప్రియతమా ... నా హృదయమా .. ప్రేమకే ప్రతిరూపమా

శిలలాంటి నాకు జీవాన్ని పోసి..
కలలాంటి బ్రతుకు కలతోటి నింపి..
వలపన్న తీపి తొలిసారి చూపి
ఎదలోని సెగలు అడుగంట మాపి
నులివెచ్చనైన ఓదార్పు నీవై
శ్రుతి లయ లాగా జత చేరినావు
నువులేని నన్ను ఊహించలేను..నా వేదనంతా నివేదించలేను
అమరం.. అఖిలం.. మన ప్రేమా..ఆఆ..అ..అ

ప్రియతమా ... నా హృదయమా

లా .. ల ల ల ల లా లా .. లా లా
ల ల ల ల లా లా ల .. లా లా
లా ల లా లా ల .. లా ల లా ల లా లా

నీ పెదవిపైన వేలుగారనీకు
నీ కనులలోన తడి చేరనీకు..
నీ కన్నీటి చుక్కే మున్నీరు నాకు
అది వేల్లువల్లే నను ముంచనీకు
ఏ కారుమబ్బు ఎటు కమ్ముకున్నా..
మహా సాగారాలే నిను మింగుతున్నా..
ఈ జన్మలోన ఎడబాటు లేదు
పది జన్మలైనా మూడే వీడిపోదు
అమరం.. అఖిలం.. మన ప్రేమా..ఆఆ..అ..అ

ప్రియతమా ... నా హృదయమా
ప్రియతమా ... నా హృదయమా
ప్రేమకే ప్రతిరూపమా
ప్రేమకే ప్రతిరూపమా
నా గుండెలో నిండిన గానమా
నను మనిషిగా చేసిన త్యగామా

ప్రియతమా ... నా హృదయమా ..ప్రేమకే ప్రతిరూపమా
ప్రియతమా ... నా హృదయమా ..ప్రేమకే ప్రతిరూపమా

నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి

నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి
నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి
ఉన్న మనసు నీకర్పణ చేసి లేని దాన నైనాను యేమి లేని దాననైనాను

కనులకు కలలే బరువైనాయి కన్నీళ్ళయినా కరువైనాయి
కనులకు కలలే బరువైనాయి కన్నీళ్ళయినా కరువైనాయి
రెండు లేకా పండు రేకులై ఎందుకు నాకీ కనుదోయి
ఇంకెందుకు నాకీ కనుదోయి

కదిలే శిలలా మారిపోతిని కధగానైనా మిగలనైతిని
కదిలే శిలలా మారిపోతిని కధగానైనా మిగలనైతిని
నిలువున నన్ను దోచుకుంటివి నిరుపేదగా నే నిలిచిపోతిని
నిరుపేదగ నే నిలిచిపోతిని

నేను పుట్టాను లొకం మెచ్చింది

నేను పుట్టాను లొకం మెచ్చింది
నేను యేడ్చాను లోకం నవ్వింది
నేను నవ్వాను ఈ లోకం యేడ్చింది
నాకింక లోకంతొ పని యేముంది డొంట్ కేర్

నేను తాగితే కొందరి కళ్ళు గిర గిర తిరిగాయి
నేను పాడితే అందరి నోళ్ళు వంతలు పాడాయి
నేను ఆడితే అందరి కాళ్ళు నాతొ కలిసాయి
తెల్లవారితే వెనకన చేరి నవ్వుకుంటాయి డొంట్ కేర్

మనసును దాచెటందుకే పై పై నవ్వులు వున్నాయి
మనిషి కి లేని అందం కోసమే రంగులు వున్నాయి
యెరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి
యెదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు వున్నాయి డొంట్ కేర్

మనిషిని మనిషి కలిపేటందుకే పెదవులు వున్నాయి
పెదవులు మధురం చేసేటందుకే మధువులు వున్నాయి
బాధలన్ని బొత్త్లె లొ నేడే దింపేసెయ్
అగ్గి పుల్ల గీసేసేయ్ నీలో సైతన్ తరిమేసేయ్

తాగితే మరిచి పొగలను తాగనివ్వరు

తాగితే మరిచి పొగలను తాగనివ్వరు
మరిచిపోతె తాగగలను మరువనివ్వరు
మనసుగతి ఇంతే మనిషి బ్రతుకింతే
మనసున్న మనిషికీ సుఖము లేదంతే

ఒకరికిస్తే మరలి రాదు వోడి పోతే మరిచి పోదు
గాయమైతే మాసిపోదు పగిలిపోతె అతుకు పడదు

అంతా మట్టే నని తెలుసు అదీ ఒక మాయెనని తెలుసు
తెలిసి వలచి విఉలపించుటలో తీయదనం ఎవరికి తెలుసు

మరు జన్మ వున్నదో లేదొ ఈ మమతలప్పుడేమౌతాయొ
మనిషికి మనసే తీరని శిక్షా దేవుడిలా తీర్చుకున్నడు కక్షా

ఎవరో రావాలి .. నీ హౄదయం కదిలించాలి

ఎవరో రావాలి .. నీ హౄదయం కదిలించాలి
నీ తీగలు సవరించాలి
నీలో రాగం పలికించాలి ఎవరో రావాలి ..

మూల దాగి ధూళి మూగి మూగవోయిన మధురవీణ
మరిచి పోయిన మమతలాగా మమతలుడికిన మనసు లాగా
మాసిపోతగునా ! ఎవరో రావాలి

ఎన్ని పదములు నేర్చినావో ఎన్ని కళలను దాచినావో
కొనగోట మీటిన చాలు నీలో కోటిస్వరములు పలుకును ఏవరో రావాలి

రాచనగరున వెలసినావు రస పిపాసకు నోచినావు
శక్తి మరచి రక్తి విడచి మత్తు ఎదో మరగినావు మరచిపోతగునా!
ఏవరో రావాలి .... నీ హౄదయం కదిలించాలి
నీ తీగలు సవరించాలి
నీలో రాగం పలికించాలి ఎవరో రావాలి ..

వాడుక మరచెదవేల నను వేడుక చేసెదవేల

వాడుక మరచెదవేల నను వేడుక చేసెదవేల
నిను చూడాని దినము నాకోక యుగము
నీకు తెలుసును నిజము నీకు తెలుసును నిజము
వాడుక మరువను నేను నిను వేడుక చెయగ లేను
నిను చూడని క్షణము నాకొక దినము
నీకు తెలుసును నిజము నీకు తెలుసును నిజము

సంధ్య రంగుల చల్లని గాలుల మధుర రాగము మంజుల గానము
తేనె విందుల తీయని కలలు మరచి పోయిన వేళ ఇక మనకీ మనుగడ యేల
ఈ అందము చూపి డెందము వూపి ఆశ రేపెద వేల ఆశ రేపెదవేల
సంధ్య రంగులు సాగినా చల్ల గాలులు ఆగినా
కలసి మెలసిన కన్నులలోన మనసు చూడగ లేవా మరులు తోడగ లేవా

కన్నుల ఇవి కలల వెన్నెల చిన్నె వన్నెల చిలిపి తెన్నుల
మనసు తెలిసి మర్మమేల ఇంత తొందర యేలా ఇటు పంతాలాడుట మేలా
నాకందరి కన్నా ఆశలు వున్నా హద్దు కాదనగలనా హద్దు కాదనగలనా
వాడని నవ్వుల తోడ నడయాడెడు పువ్వుల జాడ
అనురాగము విరిసి లొకము మరచి ఎకమౌదము కలసీ ఎకమౌదము కలసి

తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా

తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా
తేరులా సెలయేరులా కలకలా గలగలా
కదలి వచ్చింది కన్నె అప్సరా వచ్చి నిలిచింది కనుల ముందరా

తెలుగు వారి ఆడపడుచు ఎంకి లా ఎంకి కొప్పు లోని ముద్దబంతి పూవ్వులా
గోదారి కెరటాల గీతాల వలె నాలో పలికినదీ.. పలికినదీ... పలికినదీ...
చల్లగా చిరు జల్లుగా జలజలా గలగలా .......
కదలి వచ్చింది కన్నె అప్సరా వచ్చి నిలిచింది కనుల ముందరా

రెక్కలొచ్చి ఊహలన్ని ఎగురుతున్నవి ప్రేమ మందిరాన్ని చుక్కలతో చెక్కుతున్నవీ
లోలోన నాలోన ఎన్నెన్నొ రూపాలు వెలిసినవీ.. వెలిసినవీ… వెలిసినవీ…
వీణలా నెరజాన లా కలకలా గలగలా
కదలి వచ్చింది కన్నె అప్సరా వచ్చి నిలిచింది కనుల ముందరా

మాను మాకును కాను రాయి రప్పను కానే కాను

మాను మాకును కాను రాయి రప్పను కానే కాను
మామూలు మనిసి ని నేను నీ మనిసిని నేను

నాకు ఒక మనసున్నాది నలుగురిలా ఆశున్నాది
కలలు కనే కళ్ళున్నాయి అవి కలత పడితే నీళ్ళునాయి

సమిధను తెచ్చి వొత్తిని వేసి
చమురును పోసి భ్రమ చూపేవా
ఇంత చేసి యెలిగించేందుకు యెనక ముందులాడేవా

మనిసి తోటి యేలాకోలం ఆడుకుంటె బాగుంటాది
మనసు తోటి ఆడకు మామ విర్గిపోతే అతకదు మల్లా

నువ్వేన సంపంగి పువ్వుల నువ్వేనా

ఊ... ఆ...
నువ్వేన సంపంగి పువ్వుల నువ్వేనా
నువ్వేన సంపంగి పువ్వుల నువ్వేనా
జాబిల్లి నవ్వుల నువ్వేన
గోదారి పొంగుల నువ్వేన నువ్వేన

నువ్వేన

ఆ నిన్నేన అది నేనేన కలగన్నానా కనుగొన్నానా
నిన్నేన అది నేనేన కలగన్నానా కనుగొన్నానా
అల్లి బిల్లి పదమల్లేన అది అందాల పందిరి వేసేన
అల్లి బిల్లి పదమల్లేన అది అందాల పందిరి వేసేన

నువ్వేన

ఆ కళ్ళేనా హరివిల్లేన అది చూపేనా విరి తూపేనా
కళ్ళేనా హరివిల్లేన అది చూపేనా విరి తూపేనా
తుళ్ళి తుళ్ళిపడు వయసేనా నను తొందర వందర చేసేనా
తుళ్ళి తుళ్ళిపడు వయసేనా నను తొందర వందర చేసేనా

నువ్వేన

ఆ నువ్వైనా నీ నీడైన ఏనాడైనా నా తోడౌనా
నువ్వైనా నీ నీడైన ఏనాడైనా నా తోడౌనా
మళ్ళి మళ్ళి కలవచ్చేన యిలా మల్లెల మాపై విచ్చేనా
మళ్ళి మళ్ళి కలవచ్చేన యిలా మల్లెల మాపై విచ్చేనా

నువ్వేన

ఓ హౄదయం లేని ప్రియురాలా

ఓ హౄదయం లేని ప్రియురాలా
ఓ హౄదయం లేని ప్రియురాలా
వలపును రగిలించావు
పలుకక ఊర్కున్నావు
ఎంకావాలనుకున్నావు
వీడేం కావలనుకున్నవు

చిరుజల్లు వలె చిలికావు పెను వెల్లువగా ఉరికావు
చిరుజల్లు వలె చిలికావు పెను వెల్లువగా ఉరికావు
సుడిగుండముగా వెలిశావు
అసలెందుకు కలిసావు
నన్నెందుకు కలిసావు...ఓ..

అగ్గి వంటి వలపంటించి హాయిగ వుందామనుకోకు
అగ్గి వంటి వలపంటించి హాయిగ వుందామనుకోకు
మనసు నుంచి మనసుకు పాకి
ఆరని గాయం చేస్తుంది
అది తీరని తాపం ఔతుంది

నీ మనసుకు తెలుసు నా మనసు నీ వయసుకు తెలియదు నీ మనసు
నీ మనసుకు తెలుసు నా మనసు నీ వయసుకు తెలియదు నీ మనసు
రాయి మీటితే రాగం పలుకును
రాయి కన్న రాయివి నీవు
కసాయివి నీవు

ద్వాపరమంతా సవతుల సంత జ్ణ్యాపకముందా గోపాల

ద్వాపరమంతా సవతుల సంత జ్ణ్యాపకముందా గోపాల
కలియుగమందు ఇద్దరిముందు శిలవయ్యావే శృఇలోలా
కాపురాన ఆ పదలను ఈడిన శౌడి ఏది నాకు చూపవా ఒకదారి
నారీ నారీ నడుమ మురారి
నారీ నారీ నడుమ మురారి

ఇరువురు భామల కౌగిలిలిలో స్వామి ఇరుకునపడి నీవు నలిగితివా
ఇరువురు భామల కౌగిలిలిలో స్వామి ఇరుకునపడి నీవు నలిగితివా
వలపునవానల జల్లులలో స్వామి తలమునకలుగా తడిసితివా
చిరుబురులాడేటి శృఇదేవి నీ శిరసును వంచిన కథకన్న
రుసరుసలాడేటి భూదేవి నీ పరువును తీసిన కథవిన్నా
గోవిందా గోవిందా గోవిందా
సాగిందా జొడుమద్దెల సంగీతం బాగుందా భామలిద్దరి భాగోతం

ఇంటిలోన పోరంటే ఇంటింట కాదయ్య అన్నాడు ఆ యొగి వేమనా
నాతరమా భవసాగరమీదను అన్నాడు కంచర్ల గోపన్న
పరమేశా గంగనిడుము పార్వతి చాలును
ఆ మాటలు విని ముంచకు స్వామి గంగను
ఇంతులిద్దరైనప్పుడు ఇంతేగతిలే
సవతుల సంగ్రామంలో పతులది వెనకడుగే
ఇంతులిద్దరైనప్పుడు ఇంతేగతిలే
సవతుల సంగ్రామంలో పతులది వెనకడుగే
ఇరువురు భామల కౌగిలిలిలో స్వామి ఇరుకునపడి నీవు నలిగితివా

భామ కాలు తాకిందా కృఇష్ణుడే గోవిందా అన్నాడు ఆ నంది తిమ్మన్నా
ఒక మాట ఒక బాణం ఒక సీత నాదని అన్నడు సాకేతరామన్నా
యెదునాధా భామనిడుము రుక్మిణి చాలున్
రఘునాధ సీతను గొనివిడు సూర్ఫణఖను
రాసలీల లాడాలని నాకు లేదులే
భయభక్తులున్న భామ ఒకటే చాలులే
రాసలీల లాడాలని నాకు లేదులే
భయభక్తులున్న భామ ఒకటే చాలులే

తాం తద్దిత్తై.. తత్తహ తత్తై.. తాం తద్దిత్తై తత్తహ తత్తై

తాం తద్దిత్తై.. తత్తహ తత్తై.. తాం తద్దిత్తై తత్తహ తత్తై
కిటతక తాం తద్దితై తత్తహ తత్తై ||2||
తకఝణు తాం తద్దితై తత్తహ తత్తై ||2||

విధిచేయు వింతలన్నీ మతిలేని చేతలేనని
విరహాన వేగిపోయి విలపించే కధలు ఎన్నో
విధిచేయు వింతలన్నీ మతిలేని చేతలేనని
విరహాన వేగిపోయి విలపించే కధలు ఎన్నో
విలపించే కధలు ఎన్నో

తాం.. దిటదిగి తాం దిగిదిగితాం.. దిగిదిగితాం..
తత్త దిగి దిగి తత్త దిగి దిగి తత్త దిగి దిగి తై
జైకిట కిటతక కిట కిట తక జైకిట కిటతక కిట కిట తక
జైకిటకిట త త జైకిటకిట త త

ఎదురు చూపులు ఎదను పిండగా యేళ్ళు గడిపెను శకుంతల
విరహ బాధను మరచి పోవగా నిదుర పోయెను ఉర్మిళా
ఎదురు చూపులు ఎదను పిండగా యేళ్ళు గడిపెను శకుంతల
విరహ బాధను మరచి పోవగా నిదుర పోయెను ఉర్మిళా
అనురాగమే నిజమని మనసొకటి దాని ఋజువనీ
తుది జయము ప్రేమదేనని బలి అయినవి బ్రతుకులెన్నో

||విధిచేయు||

వలచి గెలిచి కలలు పండిన జంట లేదీ ఇలలో
కులము మతమో ధనము బలమో గొంతు కోసెను తుదిలో
అది నేడు జరుగ రాదని యెడబాసి వే చి నామూ
మన గాధె యువతరాలకు కావాలి మరో చరిత్ర
కావాలి మరో చరిత్ర...

విధిచేయు వింతలన్నీ మతిలేని చేతలేనని
విరహాన వేగిపోయి విలపించే కధలు ఎన్నో
విలపించే కధలు ఎన్నో

కలిసి వుంటే కలదు సుఖము.. కలసి వచ్చిన అదృష్టము

కలిసి వుంటే కలదు సుఖము.. కలసి వచ్చిన అదృష్టము
శభాష్ ... అహా.. హ... హ...
కలిసి వుంటే...కలిసి వుంటే కలదు సుఖమూ
కలిసి వుంటే కలదు సుఖమూ
కలిసి వచ్చిన అదృష్టము ఇది కలిసి వచ్చిన అదృష్టము
కన్నె మనసులూ.. మూగ మనసులూ ఆ..
అ..కన్నె మనసులూ.. మూగ మనసులూ
తేనె మనసులూ.. మంచి మనసులూ

||కలసి||

మొనగాళ్ళకు మొనగాడూ దసరా బుల్లోడు
ప్రేమనగర్ సోగ్గాడూ పూల రంగడు
మొనగాళ్ళకు మొనగాడూ దసరా బుల్లోడు
ప్రేమనగర్ సోగ్గాడూ పూల రంగడు
పక్కింటి అమ్మాయీ గడుసమ్మాయి... ఆ ఛీ! ఏం కాదు
పక్కింటి అమ్మాయీ గడుసమ్మాయి
అమెరిక అమ్మాయీ రోజులు మారాయి
ఆఆ డాండ..డాడ్డా..డడ..డాండ..డాడ్డా..డడ..

||కలసి||

మంచి వాడు మామకు తగ్గ అల్లుడు.. ఓ అలాగా..
చిక్కడు దొరకడు కదలడు వదలడు వాడే వీడు...హ హ అయ్యొ పిచ్చి వాడు
ఏయ్.. మంచి వాడు మామకు తగ్గ అల్లుడూ..
చిక్కడు దొరకడు కదలడు వదలడు వాడే వీడు...
ఈడు జోడు తోడూ నీడా నాడు నేడూ ||2||
ప్రేమించి చూడు పెళ్ళి చేసి చూడు... హమ్మ బాబొయ్
డాండ..డాడ్డా..డడ..డాండ..డాడ్డా..డడ..

||కలసి||

తన తనననతన తననన

తన తనననతన తననన
తననననన తాన తన్న తననా
'ఒహో కన్నే పిల్లవని కన్నులున్నవని

యేన్నేన్ని వగలు పోతున్నవే చినారి

లల లల లల లలలలల
లలలల లలలల లాలల
చిన్న నవ్వు నవ్వి వన్నేలన్ని రువ్వి

యేన్నేన్ని కలలు రపించావే పొన్నారీ

!! కన్నె పిల్లవని కన్నులున్నవని !!

యేవంటౌ..మ్మ్
సంగీతం
న న నా'మ్మ్' నువ్వైతే

రి స రి సాహిత్యం

మ్మ్ హ్మ్ హ్మ్మ్ నేనౌతా

సంగీతం నువ్వైతే
సాహిత్యం నేనౌతా

!!కన్నె పిల్లవని కన్నులున్నవని !!

న న న న న
say it once again
న న న న న
'మ్మ్మ్' స్వరము నీవై
తరనన తరరనన
స్వరమున పదము నేనై 'ఒకే'

తానే తానే తాన
'ఒహొ అలగా గానం గీతం కాగ
తరన తాన
కవిని నేనై

తాన ననన తాన
నాలో కవిత నీవై

నాననాననా లలలా నననా తరనా
'beautiful' కవ్య మైనదీ

తలపు పలుకు మనసు...

!!కన్నె పిల్లవని కన్నులున్నవని

యేన్నేన్ని వగలు పోతున్నవే చినారి

చిన్న నవ్వు నవ్వి వన్నేలన్ని రువ్వి

యేన్నేన్ని కలలు రపించావే పొన్నారీ

సంగీతం...." ఆ..హా..హా..
నువ్వైతే...ఆ..హా..హా..

సాహిత్యం...ఆ..హా..హా...
నేనౌతా..ఆహహా....!!

ఇప్పుడు చూద్దం
తనన తనన తన్నా
'మ్మ్హ్మ్' తనన తనన అన్న

తాన తన్న తానం తరనాతన్నా

తాన అన్న తాళం ఓకటే కాదా
తననతాన తాననన తాన
'అహ అయ్యబాబోయ్'తననతాన తాననన తాన
'మ్మ్' పదము చేర్చి పాట కూర్చ లేదా

షభాష్!

దనిని దసస అన్నా
నీద అన్న స్వరమే రాగం కాదా

నీవు నేనన్నీ అన్నా మనమే కాదా

నీవు నేనన్నీ అన్నా మనమే కాదా

కన్నే పిల్లవని కన్నులున్నవని

కవిత చేప్పి మెపించావే గడసరీ

చిన్న నవ్వు నవ్వి నిన్ను దువ్వి దువ్వి

కలిసి నేను మెపించేది యెప్పుడనీ

మ్మ్ అహ హా ల ల లా మ్మ్హ్మ్మ్మ్ అహహా
ల ల లా ల ల లా ల ల లా ల ల లా

రాయిని ఆడది చెసిన రాముడివా..

రాయిని ఆడది చెసిన రాముడివా..
గంగను తలపై మోసె శివుడివా..
రాయిని ఆడది చెసిన రాముడివా
గంగను తలపై మోసె శివుడివా
ఎమనుకోను నిన్నేమనుకోను ఎమనుకోను నిన్నేమనుకోను

నువ్వు రాయివి కావు గంగవు కావు
నే రాముడు శివుడు కానె కాను
నువ్వు రాయివి కావు గంగవు కావు
నే రాముడు శివుడు కానె కాను
తోడనుకో నీ వాడనుకో
తోడనుకో నీ వాడనుకో


నేనేంటి నా కింతటి విలువేంటి నీ అంతటి మనిషి తోటి పెళ్ళేంటి
నీకేంటి నువ్వు చెసిన తప్పేంటి ముల్లు నొదిలి అరితాకుకు శిక్షేంటి
తప్పు నాది కాదంటె లొకమొప్పుతుందా
నిప్పులాంటి సితనైన తప్పు చెప్ప కుందా
తప్పు నాది కాదంటె లొకమొప్పుతుందా
నిప్పులాంటి సితనైన తప్పు చెప్ప కుందా
అది కధే కదా
మన కధ నిజం కాదా
అది కధే కదా
మన కధ నిజం కాదా

||రాయిని||

ఈ ఇల్లూ తోడొచ్చిన నీ కాళ్ళు.. నా కెన్నెన్నో జన్మలకు కోవెల్లు
కోవెల్లు కోవెలలో దివ్వెల్లు కన్నీళ్ళతొ వెలిగించే హృదయాలు
హృదయాలను వెలిగించే మనిషి కదా దేవుడు
ఆ దేవుడికి వారసుడు మామూలు మానవుడు
హృదయాలను వెలిగించే మనిషి కదా దేవుడు
ఆ దేవుడికి వారసుడు మామూలు మానవుడు
అది నువ్వే కదా నేను నువ్వే కాదా
అది నువ్వే కదా నేను నువ్వే కాదా
నువ్వు రాయివి కావు గంగవు కావు
నే రాముడు శివుడు కానె కాను
ఎమనుకోను నిన్నేమనుకోను
తోడనుకో నీ వాడనుకో

||రాయిని||

మనసొక మధుకలశం..

మనసొక మధుకలశం..
పగిలే వరకే అది నిత్య సుందరం..
మనసొక మధుకలశం..
పగిలే వరకే అది నిత్య సుందరం..
మనసొక మధుకలశం..

ఓహోహో...ఆహాహా...
ఆహాహా...ఓహోహో...
మరిచిన మమతొకటి
మరి మరి పిలిచినదీ
మరిచిన మమతొకటి
మరి మరి పిలిచినదీ
ఒక తీయని పరి తాపమై
ఒక తీయని పరి తాపమై

మనసొక మధుకలశం..
పగిలే వరకే అది నిత్య సుందరం..

ఓహోహో...ఆహాహా...
ఆహాహా...ఓహోహో...
తొలకరి వలపొకటి
తలపుల తొలిచినదీ
తొలకరి వలపొకటి
తలపుల తొలిచినదీ
గత జన్మలా అనుబంధమై
గత జన్మలా అనుబంధమై

మనసొక మధుకలశం..
పగిలే వరకే అది నిత్య సుందరం..

నా గొంతు శౄతిలోనా నా గుండె లయలోనా

నా గొంతు శౄతిలోనా నా గుండె లయలోనా
ఆడవె పాడవె కోయిలా పాడుతు పరవశించు జన్మ జన్మలా
నా గొంతు శౄతిలోనా నా గుండె లయలోనా
ఆడవె పాడవె కోయిలా పాడుతు పరవశించు జన్మ జన్మలా

నా గొంతు

ఒక మాట పది మాటలై అది పాట కావాలని
ఒక జన్మ పది జన్మలై అనుబంధమవ్వలని
అన్నిటా ఒక మమతె పండాలని అది దండలో దారమై ఉండాలని
అన్నిటా ఒక మమతె పండాలని అది దండలో దారమై ఉండాలని
కడలిలో అలలుగా కడలేని కలలుగా నిలిచి పోవాలని
పాడవే పాడవే కోయిలా పాడుతు పరవశించు జన్మ జన్మలా

నా గొంతు

ప్రతి రోజు నువు సూర్యుడై నిన్ను నిదుర లేపాలని
ప్రతి రేయి పసి పాపనై నీ వొడిని చేరాలని
కోరికే ఒక జన్మ కావాలని అది తీరకే మరు జన్మ రావాలని
కోరికే ఒక జన్మ కావాలని అది తీరకే మరు జన్మ రావాలని
తలపులే రెక్కలుగా వెలుగులే దిక్కులుగా ఎగిరి పోవాలని
పాడవే పాడవే కోయిలా పాడుతు పరవశించు జన్మ జన్మలా

నా గొంతు

నీలాల కన్నుల్లో మెల మెల్లగ..

నీలాల కన్నుల్లో మెల మెల్లగ..
నిదురా రవమ్మ రావె...నిండర రావె...
నెలవంక చలువల్లు వెదజల్లగా..
నిదుర రావమ్మా రావె... నెమ్మదిగా రావె...

ఓ.. ఒ.. ఒ..
చిరు గాలి బాల పాడింది జోల.. పాడింది జోల..
ఎద దోచెనమ్మా... ఏవేవో కలలు...
కలలన్ని కలలెన్నొ విరబూయగ...
నిదుర రావమ్మ రావె.. నిండార రావె...

||నీలాల||

ఓ..ఒ..ఒ..
నిదురమ్మ ఒడిలొ ఒరిగింది రేయి.. వూగింది.. లాలి...
గగనాన్ని చూసి.. ఒక కన్నుదోయి..
వినిపించమంది.. ఎన్నెన్నొ కధలు..
కధ చెప్పి మురిపించీ మరిపించగ...
నిదుర రావమ్మా రావె.. నెమ్మదిగా రావె...

||నీలాల||

నీవు లేక వీణ పలుక లే నన్నది..

నీవు లేక వీణ పలుక లే నన్నది..
నీవు రాక రాధ నిలువ లే నన్నది..ఆ..

||నీవులేక||

జాజి పూలు నీకై రోజు రోజు పూచె..
చూచి చూచి పాపం సొమ్మ సిల్లి పోయె...
చందమామ నీకై తొంగి తొంగి చూచీ..
చందమామ నీకై తొంగి తొంగి చూచి..
సరసను లేవని అలుకలు బోయే....

||నీవులేక||

కలలనైన నిన్ను కనుల చూతమన్న..
నిదుర రాని నాకు కలలు కూడ రావె..
కదల లేని కాలం.. విరహ గీతి రీతీ..
కదల లేని కాలం.. విరహ గీతి రీతి..
పరువము వృధగ బరువుగ సాగె..

||నీవులేక||

తలుపులన్ని నీకై తెరచి వుంచినాను..
తలపులెన్నొ మదిలో దాచి వేచినాను..
తాపమింక నేను ఓపలేను స్వామీ..
తాపమింక నేను ఓపలేను స్వామి..
తరుణిని.. కరుణను.. ఏలగ రావా....

||నీవులేక||

మనసే అందాల బృందావనం....

మనసే అందాల బృందావనం....
వేణు మాధవుని పేరె మధురామృతం.. ||2||
కమ్మని నగుమోము.. కాంచుటె తొలినోము..
కడకంటి చూపైన కడు పావనం...

||మనసే||

రాధను ఒక వంక లాలించునె..
సత్య భామను మురిపాల తేలించునే.. ||2||
మనసార నెరనమ్ము తన వారిని... ఆ.. ఆ..
మనసార నెరనమ్ము తన వారిని..
కోటి మరు లందు సుధలందు తరియింతునే...

||మనసే||

మనసే అందాల బృందావనం....
దనిస సని నిదద మదని నిని దద మమగమ దదమమ..
గగ సగమమ గగ సస నిసగస గగ మదమని గమదనిసగ
...బృందావనం....

మ గమగస దామ దమగ నిదానిదమ గమమద దని నిస..
నిసమ దమగమగస గమదనిసగ.......బృందావనం.......

సమగస గమదని సగమగ మదనిస
మని దమ మనిసగ ఆ ఆ....

మనసే అందాల బృందావనం....
వేణు మాధవుని పేరే మధురామృతం....

చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ

చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ
నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ

మొన్న పున్నమి రాతిరి నీవొడిని నిద్దురపోతిమి
తెల్లవారి లేచి చూచి తెల్లబోయ్యామూ.. గొల్లుమన్నాము //చక్క//

మబ్బు మబ్బు మాటున ఈ మసక చీకటి చాటున
బిక్కు బిక్కున దిక్కులన్నీ తిరుగుతున్నామూ..
వెతుకుతున్నామూ //చక్క//

దారి తప్పి పోతివో నీ వారి సంగతి మరచినావో
ఏ రాణి వాసములోన చేరి రాజువై నావో..
రాలేకవున్నావో... //చక్క//

పులకించని మది పులకించు

పులకించని మది పులకించు
వినిపించని కథ వినిపించు
అనిపించని ఆశల వించు
మనసునే మరపించు గానం
మనసునే మరపించు..

రాగమందనురాగ మొలికి
రక్తి నొసగును గానం
రేపు రేపను తీపి కలలకు
రూపమిచ్చును గానం

చెదిరిపోయే భావములకు చేర్చి కూర్చును గానం
జీవ మొసగును గానం ..
మది చింత బాపును గానం ..
వాడిపోయిన పైరులైనా నీరు
గని నర్తించును కూలిపోయిన తీగయైనా

కొమ్మ నలిమి ప్రాకును కన్నె మనసు
ఎన్నుకొన్న తోడు దొరికిన మరియు
దోర వలపే కురియు...
మది దోచుకొమ్మనీ తెలుపు //పులకించని//

బూచాడమ్మా...బూచాడు...బుల్లి పెట్టె లొ వున్నాడు

బూచాడమ్మా...బూచాడు...బుల్లి పెట్టె లొ వున్నాడు... ||2||
కళ్ళకెపుడు కనపడడు కబురులెన్నో చెపుతాడు

||బూచాడమ్మ||

కుర్ కుర్ మంటూ గోలెడతాడు..హెల్లో అని మొదలెడతాడూ...||2||
ఎక్కడ వున్న ఎవ్వరినైనా..ఎక్కడ వున్న ఎవ్వరినైనా..
పలుకరించి కలుపుతాడు

||బూచాడమ్మ||

తెలుగు తమిళ హిందీ కన్నడ భాషా బేధాలెరుగని వాడూ ||2||
కులము మతము జాతేదైనా...కులము మతము జాతేదైనా
గుండెలు గొంతులు ఒకటంటాడు

||బూచాడమ్మ||

డిల్లీ మద్రాస్ హైద్రాబాద్ రష్యా అమెరికా లండన్ జపాన్
ఎక్కడికైనా వెళుతుంటాడు ఎల్లలు మనసుకు లేవంటాడు..||2||
ఒకే తీగ పై నడిపిస్తాడు... ఒకే ప్రపంచం అనిపిస్తాడు

||బూచాడమ్మ||

సూర్యుడు చూస్తున్నాడు..చంద్రుడు వింటున్నాడు...

||పల్లవి||
సూర్యుడు చూస్తున్నాడు..చంద్రుడు వింటున్నాడు...
నీవు నమ్మని వాడు నిజము చెబుతున్నాడు..
వాడు నీ వాడూ...నేడు రేపు ఏనాడూ... || సూర్యుడు ||

||చరణం||
నిన్ను ఎలా నమ్మను? ఎలా నమ్మించను..?
ఆ ఆ..ప్రేమకు పునాది నమ్మకము..
అది నదీ ..సాగర సంగమము...
ఆ ఆ.. కడలికి ఎన్నో నదుల బంధము
మనిషికి ఒకటే హృదయము...
అది వెలిగించని ప్రమిదలాంటిది ...
వలచినప్పుడే వెలిగేది ...
వెలిగిందా మరి? వలచావా మరి..?
యెదలో ఏదో మెదిలింది..అది ప్రేమని నేడే తెలిసింది... || సూర్యుడు ||
||చరణం||
యేః వింటున్నావా? ఏమి వినమంటావ్..?
ఆ..ఆ.. మనసుకు భాషే లేదన్నావు..మరి ఎవరి మాటలని వినమంటావు?
ఆ..ఆ..మనసు మూగదా వినపడుతోంది..?
అది విన్నవాల్లకే బాషవుతుంది ...
అది పలికించని వీణ వంటిది...మీటి నప్పుడే పాటవుతుంది...
మిటేదెవరని...పాడేదేమని...
మాటా..మనసు ఒక్కటని..
అది మాయని చెరగని సత్యమని... || సూర్యుడు||

ఈ నాడే యేదో అయ్యింది ఏనాడు నాలో జరగనిది

ఈ నాడే యేదో అయ్యింది ఏనాడు నాలో జరగనిది
ఈ అనుభవం మరలా రానిదీ
ఆనంద రాగం మ్రోగింది అందాల లోకం రమ్మంది

||ఈ నాడే||

నింగీ నేల ఏకం కాగ ఈక్షణమిలాగే ఆగింది
నింగీ నేల ఏకం కాగ ఈక్షణమిలాగే ఆగింది
ఓకటే మాటన్నదీ ఒకటై పొమ్మన్నదీ
మనసే ఇమ్మన్నదీ అది నా సొమ్మన్నదీ
పరువాలు మీటి న న న న న
సెలయేటి తోటి న న న న న
పాడాలి నేడు న న న న న
కావాలి తోడు న న న న న న న న న న

||ఈ నాడే||

సూర్యుని మాపి చంద్రుని ఆపి వెన్నెల రోజంత కాచింది
సూర్యుని మాపి చంద్రుని ఆపి వెన్నెల రోజంత కాచింది
పగలు రేయన్నదీ అసలే లేదన్నదీ
కలలే వద్దన్నదీ నిజమే కమ్మన్నదీ
ఎదలోని ఆశ న న న న న
ఎదగాలి బాస న న న న న
కలవాలి నీవు న న న న న
కరగాలి నేను న న న న న న న న న న

||ఈ నాడే||