31 August 2010

కోయిల పాట బాగుందా కొమ్మలసడి బాగుందా

కోయిల పాట బాగుందా కొమ్మలసడి బాగుందా
పున్నమితోట బాగుందా వెన్నెల సిరి బాగుందా
కోయిల పాట బాగుందా కొమ్మలసడి బాగుందా
పున్నమితోట బాగుందా వెన్నెల సిరి బాగుందా
అందమైన మల్లె బాల బాగుందా
అల్లి బిల్లి మేఘమాల బాగుందా
చిలకమ్మా చెప్పమ్మా చిరుగాలి చెప్పమ్మా
కోయిల పాట బాగుందా కొమ్మలసడి బాగుందా
పున్నమితోట బాగుందా వెన్నెల సిరి బాగుందా

అప్పుడిప్పుడు గున్నమామి తోటలో
అట్లతద్ది ఊయలూగినట్లుగా
ఇప్పుడెందుకో అర్థరాత్రి వేళలో
గుర్తుకొస్తోంది కొత్త కొత్తగా
నిదురించిన ఎద నదిలో
అల లెగిసిన అలజడిగా
తీపితీపి చేదు ఇదా లేతపూల ఉగాది ఇదా
చిలకమ్మా చెప్పమ్మ చిరుగాలి చెప్పమ్మా
కోయిల పాట బాగుందా కొమ్మలసడి బాగుందా
పున్నమితోట బాగుందా వెన్నెల సిరి బాగుందా

మబ్బు చాటులో ఉన్న వెన్నెలమ్మకి
బుగ్గచుక్కలాగా ఉన్న తారక
కొబ్బరాకుతో అల్లుకున్న బొమ్మకి
పెళ్లి చుక్కపెట్టినట్టు వుందిగా
కలలు కనే కన్నులలో
కునుకెరుగని కలవరమా
రేయిలోని పలవరమా హాయిలోని పరవశమా
చిలకమ్మా చెప్పమ్మా చిరుగాలి చెప్పమ్మా

కోయిల పాట బాగుంది కొమ్మల సడి బాగుంది
పున్నమితోట బాగుంది వెన్నెలసిరి బాగుంది
అందమైన మల్లె బాలబాగుంది
అల్లి బిల్లి మేఘమాల బాగుంది
చిలకమ్మా బాగుంది చిరుగాలి బాగుంది
కోయిల పాట బాగుంది కొమ్మల సడి బాగుంది
పున్నమితోట బాగుంది వెన్నెలసిరి బాగుంది

ఒక దేవత వెలసింది నా కోసమె

ఒక దేవత వెలసింది నా కోసమె
ఈ ముంగిట నిలిచింది మధుమాసమే
సంధ్యాకాంతుల్లోని శ్రావణిలా
సౌందర్యాలే చిందే యామినిలా
ఎన్నో జన్మల్లోని పున్నమిలా
శ్రీరస్తు అంటూ నాతో అంది ఇలా
నిన్నే ప్రేమిస్తానని
ఒక దేవత వెలసింది నా కోసమె
ఈ ముంగిట నిలిచింది మధుమాసమే

విరిసె వెన్నెల్లోన మెరిసె కన్నుల్లోన నీనీడే చూసానమ్మ
ఎనిమిది దిక్కుల్లోన నింగిని చుక్కల్లోన నీ జాడే వెతికానమ్మా
నీ నవ్వే నా మదిలో అమృతవర్షం
ఒదిగింది నీలోనే అందని స్వర్గం
నునుసిగ్గుల మొగ్గలతో ముగ్గులు వేసి
మునుముందుకు వచ్చేనే చెలినే చూసి
అంటుందమ్మా నా మనసే నిన్నే ప్రేమిస్తానని
ఒక దేవత వెలసింది నా కోసమె
ఈ ముంగిట నిలిచింది మధుమాసమే

రోజా మొక్కలు నాటి ప్రాణం నీరుగపోసి
పూయించా నీజడకోసం
రోజు ఉపవాసంగా హృదయం నైవేద్యంగా
భూజించా నీ జతకోసం
నీరెండకు నీవెంటే నీడై వచ్చి
మమతలతో నీ గుడిలో ప్రమిదలు చేస్తా
ఊపిరితో నీ రూపం అభిషేకించి
ఆశలతో నీ వలుపుకు హారతులిస్తా
ఇన్నాల్లు అనుకోలె నిన్నే ప్రేమిస్తానని

ఒక దేవత వెలసింది నా కోసమె
ఈ ముంగిట నిలిచింది మధుమాసమే
సంధ్యాకాంతుల్లోని శ్రావణిలా
సౌందర్యాలే చిందే యామినిలా
ఎన్నో జన్మల్లోని పున్నమిలా
శ్రీరస్తు అంటూ నాతో అంది ఇలా
నిన్నే ప్రేమిస్తానని

30 August 2010

నీ వయస్సులో ఉషస్సుకే నమస్సుమాంజలి

నీ వయస్సులో ఉషస్సుకే నమస్సుమాంజలి
నీ మనస్సులో తప్పస్సుకే శిరస్సు వంచనీ
నీ వయస్సులో ఉషస్సుకే నమస్సుమాంజలి
పా పా ప పా పా ప పదప పదప పా పా పదమాగ మగరిస గరిసస రిసనీనీ
నీ మనస్సులో తప్పస్సుకే శిరస్సు వంచనీ
పా పా ప పా పా ప పదప పదప పా పా పదమాగ మగరిస గరిసస రిసనీనీ
మా నిజ స్వరాలలో వినీల మేఘ మాల నీవయా
తాన దేనీ వీడుకోను
నీ వయస్సులో ఉషస్సుకే నమస్సుమాంజలి
నీ మనస్సులో తప్పస్సుకే శిరస్సు వంచనీ

వయసుకు చలివో ప్రియ చెలివో చెలి ఎదురానీ
చిలకల కొలికి మనసిపుడు తెలుపవే
వలపుల వలవో జత కలవో ఎరుగను గానీ
కనులను వెలిగే కదలిపుడు తెలుపనీ
నీ లయ ఎదకే లయా
నీ దయ చెలి నీదయా
కోకిలమ్మ పెళ్ళి విందు కొమ్మలన్నీ కోరుకున్న
నీ వయస్సులో ఉషస్సుకే నమస్సుమాంజలి
పా పా ప పా పా ప పదప పదప పా పా పదమాగ మగరిస గరిసస రిసనీనీ
నీ మనస్సులో తప్పస్సుకే శిరస్సు వంచనీ

ఒకరికి ఒకరై ప్రతి ఒకటై బ్రతుకొక పాటై
వయసున జతకు తొలి పలుకు వయసులే
మనసున మనసై ఒక మనిషై మరువని తోడై
గడిచిన కధలో అడుగడుగు మమతలే
మల్లెలా విరుజల్లులా వెల్లువొ హరి విల్లువో
మోజులమ్మ రోజుకొక్క నీ దివాన్ని తీర్చుకున్న
నీ వయస్సులో ఉషస్సుకే నమస్సుమాంజలి
పా పా ప పా పా ప పదప పదప పా పా పదమాగ మగరిస గరిసస రిసనీనీ
నీ మనస్సులో తప్పస్సుకే శిరస్సు వంచనీ
పా పా ప పా పా ప పదప పదప పా పా పదమాగ మగరిస గరిసస రిసనీనీ

29 August 2010

ఏమైందో ఎటు వెళ్ళిందో నిను చూసిన నా హృదయం

ఏమైందో ఎటు వెళ్ళిందో నిను చూసిన నా హృదయం
నీతోనే తను చేరిందో కావాలని నీ స్నేహం
రావా రాలేవా నే బ్రతికే ప్రతి నిముషం నీకోసం
రావా రాలేవా నే బ్రతికే ప్రతి నిముషం నీకోసం
ఏమైందో ఎటు వెళ్ళిందో నిను చూసిన నా హృదయం
నీతోనే తను చేరిందో కావాలని నీ స్నేహం

ఎందరు ఉన్నా అందరులోనూ కనిపించేదీ నీ రూపే
ఎవరేమన్నా ఏమంటున్నా వినిపించేదీ నీ మాటే
కనుపాపలలో కమ్మని కలగా కదలాడేదీ నీ తలపే
నేనేమౌతున్నా నీకోసమనే నిలుచున్నది నా శ్వాస
ఏనాడైనా నిను దరి చేరేనని బ్రతికేస్తున్నది ఆశ
రావా రా లేవా నే బ్రతికే ప్రతి నిమిషం నీ కోసం

ఏమైందో ఎటు వెళ్ళిందో నిను చూసిన నా హృదయం
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

నవ్వే ఎరుగని పెదవులపైనా
చిరునగవై నీ వొచ్చావే
ప్రేమే తెలియని నా మనసునకు
ప్రేమను ప్రేమగా పంచావే
నీ పరిచయమే జరగకపోతే
జీవితమంతా వృదయేగా
నిను చూసిన క్షణమే నీలో సగమై
నా నీడను నే మరిచా
నీ ఊహలతో నా మనసును నింపి
నీకోసమే నే వేచా రావా రా లేవా
నే బ్రతికే ప్రతి నిమిషం నీ కోసం

ఏమైందో ఎటు వెళ్ళిందో నిను చూసిన నా హృదయం
నీతోనే తను చేరిందో కావాలని నీ స్నేహం
రావా రాలేవా నే బ్రతికే ప్రతి నిముషం నీకోసం

అమ్మ బ్రహ్మ దేవుడో కొంప ముంచినావురో

||సాకీ||
హుయ్ డుం కెయ్ డుం డుం డిగా డిగా సందడి సెయ్ తమాషగా
అంగ రంగ వైభవంగా సమరం వీధుల్లో సేరి సివమెత్తంగా
హుయ్.. దరువేయ్ తధినకా అడుగేయరా అదిలెక్కా
సామిరంగా సిందాడంగా సీనయ్య యేడుకొండలు దిగికిందికిరాగా
.
||ప||
అమ్మ బ్రహ్మ దేవుడో కొంప ముంచినావురో
ఎంత గొప్ప సొగసురో ఏడ దాచినావురో
పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు
రంగరిస్తివో ఇలా బొమ్మ చేస్తివో
అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా
కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా
.
||చ||
కనురెప్పలు పడనప్పుడు కల కళ్లపడదుగా
కనుకిప్పుడు ఎదరున్నది కలై పోదుగా
ఓహోహో..ఓహొహో.. || 2 ||
కనురెప్పలు పడనప్పుడు కల కళ్లపడదుగా
కనుకిప్పుడు ఎదరున్నది కలై పోదుగా

ఒకటై చిన్నా పెద్దా అంతా చుట్టూ చేరండి…
కథకై ఆటాడించే చోద్యం చూడండి

చంద్రుళ్లో కుందేలు సందెల్లో అందాలు
మన ముంగిట్లో కథాకళి ఆడేనా

అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా
కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా
||అమ్మ బ్రహ్మ దేవుడో||
.
||చ||
మహ గొప్పగ మురిపించగ సరికొత్త సంగతి
తల తిప్పగ మనసొప్పక నిలిచే జాబిలి
ఒహొహొ..ఒహొహొ.. || 2 ||

మహ గొప్పగ మురిపించగ సరికొత్త సంగతి
తల తిప్పగ మనసొప్పక నిలిచే జాబిలి

అప్నా తనామనా కదం తొక్కే పదానా
కప్నా తనా మనా తేడా లేదోయ్ నా

తందానా తాళానా కిందైనా మీదైనా
తలవంచేనా తెల్లారులూ తిల్లానా

అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా
కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా
||అమ్మ బ్రహ్మ దేవుడో||

28 August 2010

మధురానుభవమా ప్రేమా

మధురానుభవమా ప్రేమా - మతిలేని తనమా ప్రేమా
నువ్వు తేల్చగలవా కాలమా
మృదువైన స్వరమా ప్రేమా - పదునైన శరమా ప్రేమా
బదులీయగలవా దైవమా

కోనేటి కలువా ప్రేమా - కన్నీటి కొలువా ప్రేమా
బతికించు చలువా ప్రేమా - చితి పేర్చు శిలువా ప్రేమా
ఎడబాటు పేరే ప్రేమా - పొరబాటు దారే ప్రేమా
బదులీయమంటే మౌనమా ||మధురానుభవమా||

అరణ్యాల మార్గం నువ్వు - అసత్యాల గమ్యం నువ్వు
పడదోసి మురిసే ప్రణయమా
విషాదాలా రాగం నువ్వు - వివాదాల వేదిక నువ్వు
కన్నీరు కురిసే మేఘమా
ఎదురీత కోరే ప్రేమా - ఎదకోత లే నీ సీమా
నిను చేరు కుంటే నేరమా ||మధురానుభవమా||

నడియేట నావై నీవు - సుడి లోన పడదోస్తావు
కడదాకా తోడై ఉండవు
విడదీయు బలి నే నీవు - విజయాలు అనుకుంటావు
ముడి వేయు మంత్రం ఎరగవు
ఎదురీత కోరే ప్రేమా - ఎదకోత లే నీ సీమా
నిను చేరు కుంటే నేరమా

లక్కుతో శివ సినిమా దీసి షోలేని చెడగొట్టి

లక్కుతో శివ సినిమా దీసి షోలేని చెడగొట్టి
పిచ్చవాగుడు వాగే వాడు డైరెక్టరా వర్మా
హిచ్ కాక్ సినిమాలు జూసి దెయ్యాల సినిమాలు దీసే
రాంగోపాల్ వర్మా.. డైరెక్టరా ఖర్మా...

అబ్బ సొత్తు కాదురా టాలెంటూ..
ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంటూ.. ||2||
మణిరత్నం శంకర్ లు ఏమన్నా పుడింగులా
వినాయకులు వంశీలు పైనుంచే ఊడారా..
రాఘవేంద్రరావేమన్నా పాలూ పళ్ళూ బొడ్డూ తప్పా గొప్ప సినిమా తీశాడా...

||అబ్బ సొత్తు||

సమాజాన్ని ఉద్దరిస్త నేననీ.. సమూలంగ మార్చివేస్తాననీ..
కృష్ణవంశి దీతాడూ సినిమాలు అర్దం అసలుగాక చత్తారు ప్రేక్షకులు
లాటరీలొ పోకిరీ హిట్టనీ తెలియక పూరీ జగనూ...
దేశముదురునంటాడూ ఏం చెయ్యను మరిచాడా తను తీసిన ఆంధ్రావాలాను
చూశాంలే రాజమౌళి మగధీరానూ తీస్తాన్లే తలదన్నే సినిమానూ..
చూశాంలే రాజమౌళి మగధీరానూ తీస్తాన్లే తలదన్నే సినిమానూ..
ఏం పాపాల్జేశామనీ అయ్యో ఏం పాపాల్జేశామనీ...
ఏం పాపాల్జేశామని బిగోపాలు అదే పనిగ పేలుస్తాడు టాటాసుమోలు...
అందుకనే వస్తుండీ అప్పల్రాజూ డైరెక్టర్లకి చేస్తాడూ ఫుల్ మసాజు...
అందుకనే వస్తుండీ అప్పల్రాజూ డైరెక్టర్లకి చేస్తాడూ ఫుల్ మసాజు...

||అబ్బ సొత్తు||

పిల్లి లాంటి బోయపాటి శీనుకీ సింహ ఘర్జనవసరమా ట్రాజెడీ..
నమో వెంకటేశ అన్న శీను వైట్లకీ పంగనామమే మిగిలే చివరికీ..
బొమ్మాలీ నిన్నొదల అని కోడీ అనుష్కతో తీసిండూ అరుంధతీ..
పాత సినిమ స్టోరీలను కాపీ కొట్టీ పెద్ద టోపీ పెట్టాడూ తలకి కట్టెట్టీ..
ఈవివి యస్వీల సెంటిమెంట్లూ తలనొప్పికి కనిపెట్టని ఆయింట్మెంట్లూ...
ఈవివి యస్వీల సెంటిమెంట్లూ తలనొప్పికి కనిపెట్టని ఆయింట్మెంట్లూ...
గుణశేఖరు వేయించే.....గుణశేఖరు వేయించే....
గుణశేఖరు వేయించె లక్షల సెట్లు ప్రొడ్యూసర్ పాలిటవి సర్పపు కాట్లూ..
అందుకనే వస్తుండీ అప్పల్రాజూ డైరెక్టర్లకి చేస్తాడూ ఫుల్ మసాజు...
అందుకనే వస్తుండీ అప్పల్రాజూ డైరెక్టర్లకి చేస్తాడూ ఫుల్ మసాజు...

||అబ్బ సొత్తు||

20 August 2010

నీ ఇంట్లో అమ్మా నాన్న పక్కింట్లోకెళ్ళాకా

నీ ఇంట్లో అమ్మా నాన్న పక్కింట్లోకెళ్ళాకా
వెళ్ళాకా వెళ్ళాకా పక్కింట్లోకే వెళ్ళాకా
మా ఇంట్లో అమ్మా నాన్న పొరుగింట్లోకెళ్ళాకా
వెళ్ళాకా వెళ్ళాకా పొరుగింట్లోకే వెళ్ళాకా

నేనేమో ఈలేసి నీకేమో జాలేసి నాదారి కొచ్చేసాక
దూరాన్నే గెంటేసి నువు నేను జంటేసి ఓ దారి పట్టేసాక
ఏమిటవుతుంది అదంతా ఎంతో సస్పెన్సూ
ఏమిటవుతుంది కధంతా ఎంతో సస్పెన్సూ

నీ ఇంట్లో అమ్మా నాన్న పక్కింట్లోకెళ్ళాకా
వెళ్ళాకా వెళ్ళాకా పక్కింట్లోకే వెళ్ళాకా
మా ఇంట్లో అమ్మా నాన్న పొరుగింట్లోకెళ్ళాకా
వెళ్ళాకా వెళ్ళాకా పొరిగింట్లోకే వెళ్ళాకా

ఏదో ఓ సినిమాకి ఆపైన గినిమాకి
సాంగో ఓ గీంగో సింగించేసాక
తాపీగా కాఫీకి తరువాత గీఫీకి
కప్పో ఓ గిప్పో సిప్పించేసాకా
అటు నించి డిస్చోకి ఆ ఆ ఆ ఆ
ఆడాకా గిస్కోకి సమ గప గప మనిదని గమ పని సా

సినిమాకి కాఫీకి డిస్కోకి వెళ్ళాకా ఆ మూడు అయిపోయాకా
మూడంటే గుర్తొచ్చి మూడేదో వచ్చేసి నీ మూడు పెంచేసాకా

అదంతా ఎంతో సస్పెన్సూ కధంతా ఎంతో సస్పెన్సూ

రామ రామ రామ రామ సీత హరె రామ
జై బోలో హరి కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ We love it

నిన్నే నే ప్రేమించి ఇంకొంచెం గీమించి
వయసో అది గియసో తెగ వేధించాకా
నిన్నే నే మురిపించి మరికొంచెం గిరిపించి
మనసో అది గినసో నీకందించాకా
మాటల్తో మెప్పించీ హ్మ్ హ్మ్ హ్మ్
ముద్దుల్తో గిప్పించీ సమ గప గప మనిదని గమ పని సా

ప్రేమించీ మురిపించీ ఇంచించు మెప్పించీ ఆ మూడు జరిపించాకా
ఓ మూడు ముళ్ళేసి ఆ మూడు రాత్రుల్లో నీ మూడు తెప్పించాకా
అదంతా ఎంతో సస్పెన్సూ కధంతా ఎంతో సస్పెన్సూ

మావా ఆ ఓ మావా ఆ జాజిరి జాజిరి జాజిరి జాజిరి

మావా ఆ ఓ మావా ఆ
జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి
జాజిరి జాజిరి జాజిరి జాజిరి మావా
ఎన్ని జనమలకైనా నువ్వే నా జత మావా
ఎన్ని జనమలకైనా నువ్వే నా జత మావా

జాజిరి జాజిరి జాజిరి జాజిరి మావా
ఎనకటి జనమలో ఎంకిని నేనే నాయుడు మావా

పచ్చనాకు మీద ఆన
పసుపు కొమ్ము మీద ఆన
పరమాత్ముని మీద ఆన
పరువాల మీద ఆన
ప్రేమవు నువ్వే పెనిమిటి నువ్వే మావా

జాజిరి జాజిరి జాజిరి జాజిరి భామా
ఎన్ని జనమలకైనా నువ్వే నా జత భామా

సుక్కా పొద్దు ఆరతిలో సిరుముద్దు పూజలలో
నా సామివి నువ్వే వడి గుడిలో
సల్లాగాలి మేళం లో సరసాల తాళం లో
నాదానివి నువ్వే గుండెలలో

హా ఉన్న సొగసు మీద ఆన
లేని నడుము మీద ఆన
నువు లేక ఉండలేని ప్రాణాల మీద ఆన
నేను నువ్వే నావీ నీవే మావా

ఓ భామా ఆ ఓ భామా ఆ
జాజిరి జాజిరి జాజిరి జాజిరి భామా
ఎన్ని జనమలకైనా నువ్వే నా జత భామా

కుంకుమబొట్టే నలుపాయే నా కాటుక ఎరుపాయే
కరగాలని నీ బిగి కౌగిలిలో
సీకటి సెట్టే సిగురైతే సిగురంతా ఎలుగైతే
నిలవాలిక ఎలుగుల సీమలలో

హా బ్రహ్మరాత మీద ఆన
భరతమాత మీద ఆన
మువ్వన్నెల మీద ఆన
మన బంధం మీద ఆన
నలుపులు మనవే గెలుపులు మనవే మావా

ఓ భామా ఆ ఓ భామా ఆ
జాజిరి జాజిరి జాజిరి జాజిరి భామా
ఎన్ని జనమలకైనా నువ్వే నా జత భామా

జాజిరి జాజిరి జాజిరి జాజిరి మావా
ఎన్ని జనమలకైనా నువ్వే నా జత మావా

జాజిరి జాజిరి జాజిరి జాజిరి మావా
ఎనకటి జనమలో ఎంకిని నేనే నాయుడు మావా

తీ తీ తీయని సెగలు నాకు అందం

తీ తీ తీయని సెగలు నాకు అందం
నా నా నవ్వులా ఈల వేసె పరువం
తోడుగా చేరవా ఎందుకింక మౌనం
సొగసులు చిందులాడని వయసులు పొంగి రేగని
సొగసులు చిందులాడని వయసులు పొంగి రేగని

ఉరికే నా కులుకే కొంటె తలపులు పలికెనులే
నా పాల వన్నెలే కన్నె వలపులు చిలికెనులే
సందేళ అందాల వంపులలో పరువము పంచేనా
నాజూకు నా చూపు చురకలలో చుక్కలను చూపేనా
సొగసులు చిందులాడని వయసులు పొంగి రేగని
సొగసులు చిందులాడని వయసులు పొంగి రేగని

తీ తీ తీయని సెగలు నాకు అందం
నా నా నవ్వులా ఈల వేసె పరువం
తోడుగా చేరవా ఎందుకింక మౌనం

జతగా కలిసి జంట గువ్వలల్లె ఎగిరిపోదాం
గాలిలో తేలి నీలి గగనము ఏలుకుందాం
విను వీధి జాబిలితొ ఆడుకుందాం వెన్నెలను పంచుకుందాం
స్వర్గాల తీరాలు చేరుకుందాం తనువులు మరిచిపోదాం
సొగసులు చిందులాడని వయసులు పొంగి రేగని
సొగసులు చిందులాడని వయసులు పొంగి రేగని

తీ తీ తీయని సెగలు నాకు అందం
నా నా నవ్వులా ఈల వేసె పరువం
తోడుగా చేరవా ఎందుకింక మౌనం

18 August 2010

రారయ్యా పోయినవాళ్ళు ఎవరయ్యా ఉండే వాళ్ళు

రారయ్యా పోయినవాళ్ళు ఎవరయ్యా ఉండే వాళ్ళు
నవ్వు మరచి నన్ను మరచి ఎందుకు కన్నీళ్ళు
ఇలా ఎన్నాళ్ళూ
రారయ్యా పోయినవాళ్ళు ఎవరయ్యా ఉండే వాళ్ళు
నవ్వు మరచి నన్ను మరచి ఎందుకు కన్నీళ్ళు
ఇలా ఎన్నాళ్ళూ రారయ్యా పోయినవాళ్ళు

తొలిసారి చూశాను నీ కళ్లను అవి చిలికాయి నవ్వుల వెన్నెలను
తొలిసారి చూశాను నీ కళ్లను అవి చిలికాయి నవ్వుల వెన్నెలను
నిలువునా పులకించాను కలువనై విరబూచాను
మసకేసిన చందమామను ఏమని చూస్తాను నేనేమైపోతాను
రారయ్యా పోయినవాళ్ళు

నీ కళ్లకే కాదు కన్నీళ్లకూ నే తోడు ఉంటాను ఏ వేళకూ
నీ మమతలే కాదు నీ కలతనూ నే పంచుకుంటాను ప్రతి జన్మకూ
నీ మమతలే కాదు నీ కలతనూ నే పంచుకుంటాను ప్రతి జన్మకూ
రారయ్యా పోయినవాళ్ళు

నిదురల్లె వస్తాను నీ కంటికి చిరునవ్వు తెస్తాను నీ పెదవికి
నిదురల్లె వస్తాను నీ కంటికి చిరునవ్వు తెస్తాను నీ పెదవికి
అమ్మల్లె లాలించి అనురాగం పలికించి
మళ్ళీ నిను మనిషిని చేస్తా అన్నీ మరపించి
నిన్నే నవ్వించి రారయ్యా పోయినవాళ్ళు

ఓ మరమనిషి మాలోకి రా

ఓ మరమనిషి మాలోకి రా
ఓ మరమనిషి మాలోకి రా

ఇనుముతో సిలికాన్ చేర్చి
తీగలతో తెరిపించి
హార్డ్డిస్క్ తో మెమరీ కుర్చీ
చనిపోని దేహంతో
చెడిపోని ప్రాణంతో
ఆరోజ్ఞానం నీకై నేర్పితే విజ్ఞానం
నిలిపే ప్రయత్నం
ఓ మరమనిషి మాలోకి రా

ఓ మరమనిషి మాలోకి రా
ఓ మరమనిషి మాలోకి రా

మార్గం చూపుము
మనిషిని బాగుచేయి
మమతే నేర్పుతూ
జగమే మార్చు
ప్రాణి కోటికి
మంచి కోరుకో
నిజాయితిని యెన్నడూ వీడకు

యంత్రుడా యంత్రుడా యంత్రుడా నా యంత్రుడా
యంత్రుడా యంత్రుడా యంత్రుడా నా యంత్రుడా

నా తెలివి ఇంతే కదా
నీ జ్ఞానము ఎంతో కదా
నా భాషలు ఆరు సరి
సృష్టించావ్ నూరు మరి
ఊపిరి తిత్తులు వుండవులే
గుండె బాధ లేదసలే
జిత్తుల మనిషి అల్పుడులే
యంత్రము ఓడదులే

గర్భంలో జనించేవి అన్నీ గతించు
మేధలో పుట్టినచో మృత్యువే లేదు
ఇదిగో నా యంత్రుడు మృత్యుంజయుడు
ఇదిగో నా యంత్రుడు మృత్యుంజయుడు

నేను మరో బ్రహ్మనులె
నీవే నా పుత్రుడివే
మగాడు కన్న మగవాడ
నీ పేరిక యంత్రుడులే

ఓ మరమనిషి మాలోకి రా
ఓ మరమనిషి మాలోకి రా
ఓ మరమనిషి మాలోకి రా
ఓ మరమనిషి మాలోకి రా

నేనొక మేధో భాష
ఎందుకు అనటం నా శ్వాస
రోదసి వల్లె నా నయనం
నే రేపటి విజ్ఞానం
నీ కండలు రక్తగతం
నా గుండెలు వస్తుశతం
నీ జన్మం ఒకటే కదా
నా జన్మలు వేరు కదా

రోబో రోబో పలు బాషలు వస్తే యే
నా పిత్రుభాష తెలుగు కదా
రోబో రోబో లోకం గెలిచోస్తే యే
సృష్టికర్తకు ఎప్పుడూ దాసుడే

ఓ మరమనిషి మాలోకి రా
ఓ మరమనిషి మాలోకి రా
ఓ మరమనిషి మాలోకి రా
ఓ మరమనిషి మాలోకి రా

14 August 2010

ఆకాశవాని ఖమ్మం తీరం మనోరంజని

ఆకాశవాని ఖమ్మం తీరం మనోరంజని కార్యక్రమంలో...
తరవాత పాట చెంచులక్ష్మి సినిమా నుంచి..
పాడిన వారు ఘంటశాల,జిక్కి..

చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా ----2
చెట్టులెక్కి ఆ చిటారుకొమ్మన చిగురు కోయగలవా


లెక్క జెప్పగలవా నీ ఆయువు లెక్కజెప్పగలవా
బిక్కు బిక్కు మని తెల్లవారి పని చక్కబెట్టగలవా.. అందాకా ఉగ్గబట్టగలవా..
లెక్కబెట్టగలవా ఆ చుక్కలు లెక్కబెట్టగలవా..
చావుదప్పి నువు బతికి బైటపడి బట్టగట్ట గలవా.. అందాకా ఉగ్గబట్టగలవా

అరెరెరె అరెరెరె ఎంతటి ఘనమయ్యా..

అరెరెరె అరెరెరె ఎంతటి ఘనమయ్యా..
ప్రాణాలిచ్చే మమతల్లో.. ప్రాణం తీసే పంతాల్లో..
నేలను చిందిన నెత్తురు చుక్కల లెక్కలు తేలని ఇతిహాసాలు...
అరెరెరె అరెరెరె అరెరెరె అరెరెరె ఎంతటి ఘనమయ్యా..

ఎన్నేండ్లకు పెదపండగ వచ్చే

ఎన్నేండ్లకు పెదపండగ వచ్చే వాకిట్లకు మావాకులు గుచ్చే
అమ్మోరికి ఆకలి గురుతొచ్చే ఓయ...
అమ్మోరికి ఆకలి గురుతొచ్చే ఓయ...
ఆఆఆఆ ఆ ఆ ఆఅ...

కోట్లిస్తది కోడిని కోసిస్తే మేళ్ళిస్తది మేకను బలి ఇస్తే
పోలమ్మకు పొట్టేలును ఏస్తే హోయ...

అమ్మోరికి అవ్వాలని మేత ఏనాడో రాసేసిన రాత
ఎలుగుందా రేతిరి గడిసాక హోయ...

చుట్టూతా కసి కత్తుల కోటా ఏదారి కనిపించని చోటా
కునుకుండదు కంటికి ఏపూటా హోయ...

దేశం మనదే తేజం మనదే

నాననినాన నాననినాన
నాన నాన నననా నానా
దేశం మనదే తేజం మనదే ||2||
ఎగురుతున్న జెండా మనదే
నీతి మనదే జాతి మనదే
ప్రజల అండదండా మనదే
అందాల బంధం ఉంది ఈ నేలలో
ఆత్మీయరాగం ఉంది ఈ గాలిలో
ఏ కులమైనా ఏ మతమైనా ||2||
భరతమాతకొకటేలేరా
ఎన్ని బేధాలున్నా మాకెన్ని తేడాలున్నా
దేశమంటే ఏకమవుతాం అంతా ఈవేళా...
వందేమాతరం అందామందరం
వందేమాతరం ఓ... అందామందరం ||దేశం మనదే||
అందాల బంధం ఉంది ఈ నేలలో
ఆత్మీయరాగం ఉంది ఈ గాలిలో
ఏ కులమైన ఏ మతమైన
భరతమాతకొకటేలేరా
రాజులు అయినా పేదలు అయినా
భరతమాత సుతులేలేరా
ఎన్ని దేశాలున్నా మాకెన్ని దోషాలున్నా
దేశమంటే ప్రాణమిస్తాం
అంతా ఈవేళా...
వందేమాతరం అందామందరం
వందేమాతరం ఓ... అందామందరం
వందేమాతరం... వందేమాతరం...
వందేమాతరం... వందేమాతరం...
వందేమాతరం... వందేమాతరం...

శ్రీలు పొంగిన జీవ గడ్డై

శ్రీలు పొంగిన జీవ గడ్డై..
పాలు పారిన భాగ్య సీమై.. ||శ్రీలు||
రాలినది ఈ భరత ఖండము..
భక్తి పాడర తమ్ముడా.. ||రాలినది|| ||శ్రీలు||

చరణం

దేశగర్వము కీర్తి చెందగ..
దేశచరితము తేజరిల్లగ....
దేశం మరచిన ధీర పురుషుల..
తెలిసి పాడర తమ్ముడా.. ||దేశం|| ||శ్రీలు|| ||2||

ఓ ఓ ఓ వెండి వెన్నెల

ఓ ఓ ఓ వెండి వెన్నెల
ఓ ఓ ఓ దిగి రా ఇలా
అమ్మ కొంగులో చంటి పాపల
మబ్బు చాటునే ఉంటే ఎలా
పడిపోతానని పసి పాదాలకి పరుగే నేర్పవా
మదిలో దాగిన మధుభావాలకి వెలుగే చూపవా
మనసుంటే మార్గముంది తెంచుకోవె సంకెళ

ఓ ఓ ఓ సుప్రభాతమా
ఓ ఓ ఓ శుభమంత్రమా
మేలుకొమ్మనే ప్రేమగీతమా
చేరుకున్న నా తొలిచైత్రమా
నీ స్వరాలతో నా నరాలలో ఒక గంగానది
ఈ క్షణాన నీ జత చేరాలని అలలౌతున్నది
వెల్లువలా చేరుకోగ వేచియున్న సంద్రమా

అంత దూరమా స్వర్గమన్నది
చిటెకలో ఇలా వరమైనది
అందరాని నా స్వప్నమన్నది
అందమైన ఈ నిజమైనది
చిరుహాసానికి మా సంసారమే చిరునామా అని
ఈ సంతోషమే మా సంతానమై చిగురించాలని
ప్రతిరోజు పండుగల్లే సాగుతోంది జీవితం

ఓ సోనా ఓ సోనా ఓ సోనా

ఓ సోనా ఓ సోనా ఓ సోనా I love u love u రా
ఓ సోనా ఓ సోనా ఓ సోనా I love u love u రా
వెన్నెలె వళ్ళో విచ్చుకున్న మల్లెమ్మా
ఆమె వయసుని కొల్ల గొట్టే దొంగమ్మ
ఆకాశంలో తేలే రాజహంసమ్మ
తనతో స్నేహం చేసిన కధ చెప్తాను వినవమ్మ
ఓ సోనా ఓ సోనా ఓ సోనా ఈ లొవె ఉ లొవె ఉ రా

ఒక రోజు తను mouth organ play చేస్తుంది
నేను కూర్చుని వింటున్నాను
నీకు play చెయ్యటం తెలుసా అని అడిగింది
నేను తెలుసు అన్నాను
ఎందుకు చెప్పారు ఎందుకు తెలుసని చెప్పరు
తెలియదని చెప్పొచ్చుగా
యే తెలుసుందానికి నిజం యేమంటారేంటి
నాకు అబద్దాలాడటం నచ్చదు
చాల్లె ఊరుకోండి ఇలాంటి విషయాల్లో అబద్దం చెప్పాలి

ఆడవాళ్ళకి తెలుసని చెప్పే మగాళ్ళకన్న
తెలియదని చెప్పే మగళ్ళే ఇష్టం
మీరు తెలియదని చెప్పుంటే తనే మీకు చెప్పేది
మనసు మనసు కలిసేది romance జరిగేది miss చేసారు
no no ఆ రోజు romance జరిగింది
తెలుసని చెప్పినా romance జరిగిందా యెలా
తను mouth organ ఇచ్చింది నేను తీసుకున్నాను
వెంటనే mouth organ ని చూసాను తనని చూసాను
mouth organ కింద పెట్టి
నీ mouthఏ organ లా ఉంది
మరో mouth organ ఎందుకని kiss చేసాను

సాయంకాలాన వర్షించే సమయాన
తను తడుస్తుంటే నా ప్రాణాలు జివ్వు మన్నాయే
తన వయసే ఉరకంగా నా మనసే ఉప్పొంగా
తన వళ్ళో చేరి వెచ్చంగా చలి కాచుకున్నాలే
చినుకాగే చెలి లేవలేదే
ఏమి చేసామో గురుతే లేదే
ప్రేమావేశమో గుండెల్లో గుప్పుమన్న ప్రణయావెశమో
మౌనంగా కాలం వళ్ళో కరిగేనమ్మా

నీలో వలపు అణువులే ఎన్నని

నీలో వలపు అణువులే ఎన్నని
neutron electron నీ కన్నులోన మొత్తం ఎన్నని
నిన్నే తలిస్తే నరాల్లో తీపి ఆశే రేగేనే
అయ్యో...సన సన ప్రశ్నించన
అందం మొత్తం నువ్వా
ఆ newton సూత్రమే నువ్వా
స్నేహం దాని ఫలితమంటావా
నువ్వు లక్షల తారలు కలిసిన చిరునవ్వా
అందం మొత్తం నువ్వా

నువ్వు బుద్దులున్న తింగరివి
కానీ ముద్దులడుగు మాయావి
మోఘే ధీం తోం తోం ధీం తోం తోం
ధీం తోం తోం మదిలో నిత్యం
తేనె పెదవుల యుద్ధం
రోజా పువ్వే రక్తం
ధీం తోం తోం మదిలో నిత్యం

ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే
ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ
ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే
ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ

సీతాకోక చిలకమేమో
కాళ్ళను తాకించి రుచి నెరుగు
ప్రేమించేటి ఈ మనిషేమో
కన్నుల సాయంతో రుచి నెరుగు

పరిగెత్తు వాగుల నీటిలో oxygen మరి అధికం
పాడుతున్న పరువపు మనసున ఆశలు మరి అధికం

ఆశవై రావ! ఆయువే నింపిన ప్రేమే చిటికెలో చేద్దాం పిల్లా నువ్వురావ

వలచే వాడా స్నేహం ఎదకు చేరు కాలం చిలికి ఇవ్వు
గుండె వాడుతున్నది
వలచే దాన నీలోన నడుము చిక్కి నట్టే బతుకులోన
ప్రేమల కాలం వాడుతున్నదే

ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే
ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ
ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే
ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ

నీలో వలపు అణువులే ఎన్నని
neutron electron నీ కన్నులోన మొత్తం ఎన్నని
నిన్నే తలిస్తే నరాల్లో తీపి ఆశ రేగేనే ..అయ్యో

సన సన ప్రశ్నించన
అందం మొత్తం నువ్వా
ఆ newton సూత్రమే నువ్వా
స్నేహం దాని ఫలితమంటావా
నువ్వు లక్షల తారలు కలిసిన చిరునవ్వా
అందం మొత్తం నువ్వా

ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే
ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ
ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే
ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ
ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే
ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ
ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే
ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ

13 August 2010

నీ ఎదలో నాకు చోటే వద్దు నా ఎదలో చోటే కోరవద్దు

నీ ఎదలో నాకు చోటే వద్దు నా ఎదలో చోటే కోరవద్దు
మన ఎదలో ప్రేమను మాటే వద్దు ఇవి పైపైన మాటలులే ఏ ఏ
నీ నీడై నడిచే ఆశ లేదే నీ తోడై వచ్చే ధ్యాస లేదే
నీ తోటే ప్రేమ పోతేపోనీ అని అబద్ధాలు చెప్పలేనులే
నీ జతలోన నీ జతలోన ఈ ఎండాకాలం నాకు వానాకాలం
నీ కలలోన నీ కలలోన మది అలలాగ చేరు ప్రేమ తీరం

నీ ఎదలో నాకు చోటే వద్దునా ఎదలో చోటే కోరవద్దు
మన ఎదలో ప్రేమను మాటే వద్దు ఇవి పైపైన మాటలులే ఏ ఏ

చిరుగాలి తరగంటి నీ మాటకే ఎద పొంగేను ఒక వెల్లువై
చిగురాకు రాగాల నీ పాటకే తనువూగేను తొలి పల్లవై
ప్రేమ పుట్టాక నా కళ్లలో దొంగచూపేదో పురివిప్పెనే
కొంచెం నటనున్నది కొంచెం నిజమున్నది ఈ సయ్యాట బాగున్నది
నువు వల వేస్తే నువు వల వేస్తే నా ఎద మారే నా కథ మారే
అరె ఇది ఏదో ఒక కొత్త దాహం అది పెరుగుతుంటే వీచే చెలి స్నేహం

ఒకసారి మౌనంగా నను చూడవే ఈ నిమిషమే యుగమౌనులే
నీ కళ్లలో నన్ను బంధించవే ఆ చెర నాకు సుఖమౌనులే
నిన్ను చూసేటి నా చూపులో కరిగే ఎన్నెన్ని మునిమాపులో
పసిపాపై ఇలా నా కనుపాపలే నీ జాడల్లో దోగాడెనే
తొలి సందెలలో తొలి సందెలలో ఎరుపే కాదా నీకు సిందూరం
మలి సందెలలో మలి సందెలలో నీ పాపిటిలో ఎర్రమందారం

నీ ఎదలో నాకు చోటే వద్దు నా ఎదలో చోటే కోరవద్దు
మన ఎదలో ప్రేమను మాటే వద్దు ఇవి పైపైన మాటలులే ఏ ఏ
నీ నీడై నడిచే ఆశ లేదే నీ తోడై వచ్చే ధ్యాస లేదే
నీ తోటే ప్రేమ పోతేపోనీ అని అబద్ధాలు చెప్పలేనులే

అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు
అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు
అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు అమ్మానాన్నలు మా అమ్మా నాన్నలు
అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు
అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు అమ్మానాన్నలు మా అమ్మా నాన్నలు

మర్యాదల గిరి దాటని నాన్నే మా నడతగా
గిరి గీయని మనసున్న అమ్మే మా మమతగా
తరువే సంపదగా పగలే వెన్నెలగా
ప్రేమతో కట్టుకున్న కోవెలే ఈ ఇల్లుగా
ప్రేమతో కట్టుకున్న కోవెలే ఈ ఇల్లుగా
పెరిగినాము నీ నీడనా ముద్దు ముద్దుగా ఆ ఆ
అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు
అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు అమ్మానాన్నలు మా అమ్మా నాన్నలు

అన్నదమ్ముల అనుబంధం మాకే చెల్లుగా ఆ
కన్నతల్లి ప్రతిరూపం చిట్టి చెల్లిగా
ఒకటే తనువుగా ఒకటే మనసుగా
చెలిమనేది ఎన్నడు తరగని మా కలిమిగ
చెలిమనేది ఎన్నడు తరగని మా కలిమిగ
కలిసివున్నాము కన్నవారి కనుపాపలుగా
అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు
అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు అమ్మానాన్నలు
మా అమ్మా నాన్నలు మా అమ్మా నాన్నలు

08 August 2010

నా మనసు నీ మనసు ఒకటై మనమొకటిగా

నా మనసు నీ మనసు ఒకటై మనమొకటిగా
ఎలా ఏకమౌదుమో ఎలా కలిసిపోదుమో
ఎలా ఏకమౌదుమో ఎలా కలిసిపోదుమో
నా తనువు నీతనువు వేరు వేరు వేరైనా
పాలు నీరు కలియునటులె కలసి మెలసి పోదము
పాలు నీరు కలియునటులె కలసి మెలసి పోదము

నీహక్కులు నాహక్కులు వేరు వేరు వేరైనా ఆ ఆ
నీహక్కులు నాహక్కులు వేరు వేరు వేరైనా
కీచులాట లేకుండా మచ్చికతో ఉందమా
కీచులాట లేకుండా మచ్చికతో ఉందమా
నా మనసు నీ మనసు ఒకటై మనమొకటిగా
ఎలా ఏకమౌదుమో ఎలా కలిసిపోదుమో

నీప్రాణము నాప్రాణము ఒకటి ఒకటి ఒకటైనా ఆ ఆ ఆ
నీప్రాణము నాప్రాణము ఒకటి ఒకటి ఒకటైనా
నీవంటే నీవనుచు ఉ ఆపావే
నీవంటే నీవనుచు కీచులాడుకుందమా
నా తనువు నీతనువు వేరు వేరు వేరైనా
పాలు నీరు కలియునటులె కలసి మెలసి పోదము
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

నిను కలిసిన నిముషమున నిను తెలిసిన క్షణమున

నిను కలిసిన నిముషమున నిను తెలిసిన క్షణమున
కనుల పండువాయెనే మనసు నిండిపోయెనే
నిను కలిసిన నిముషమున నిను తెలిసిన క్షణమున
కనుల పండువాయెనే మనసు నిండిపోయెనే

ఆశాలత మొగ్గలేసి పూలు విరగబూసెనే
ఆశాలత మొగ్గలేసి పూలు విరగబూసెనే
తలపులెల్ల వలపులై పులకరింపజేసెనే
తలపులెల్ల వలపులై పులకరింపజేసెనే
పరవశించి పోతినే
నిను కలిసిన నిముషమున నిను తెలిసిన క్షణమున
కనుల పండువాయెనే మనసు నిండిపోయెనే

చందమామ నేడేలనే చలినివెన్నేల కాయడే
చందమామ నేడేలనే చలినివెన్నేల కాయడే
గాలికూడా ఎందుకనో నులివెచ్చగా వీచెనే
గాలికూడా ఎందుకనో నులివెచ్చగా వీచెనే
మేను కందిపోయెనే
నిను కలిసిన నిముషమున నిను తెలిసిన క్షణమున
కనుల పండువాయెనే మనసు నిండిపోయెనే
నిను కలిసిన నిముషమున నిను తెలిసిన క్షణమున
ఆ ఆ ఆ ఆ ఒ ఒ ఓ ఓ

నాసరి నీవని నీగురి నేనని ఇపుడే తెలిసెనులే

నాసరి నీవని నీగురి నేనని ఇపుడే తెలిసెనులే
తెలిసినదేమో తలచిన కొలదీ పులకలు కలిగెనులే
నీకు నాకు వ్రాసి ఉన్నదని ఎప్పుడో తెలిసెనులే
తెలిసినదేమో తలచిన కొలదీ కలవరమాయెనులే
నాసరి నీవని నీగురి నేనని ఇపుడే తెలిసెనులే

నా హృదయమునే వీణ జేసుకొని ప్రేమను గానము చేతువని ఆ ఆ ఆ
నా హృదయమునే వీణ జేసుకొని ప్రేమను గానము చేతువని
నీ గానము నా చెవి సోకగనే నా మది నీదై పోవునని
నీ గానము నా చెవి సోకగనే నా మది నీదై పోవునని
నీకు నాకు వ్రాసి ఉన్నదని ఎప్పుడో తెలిసెనులే

నను నీ చెంతకు ఆకర్షించే గుణమే నీలో ఉన్నదని ఆ ఆ ఆ ఆ ఆ
నను నీ చెంతకు ఆకర్షించే గుణమే నీలో ఉన్నదని
ఏమాత్రము నీ అలికిడి అయినా నా ఎద దడదడలాడునని
ఏమాత్రము నీ అలికిడి అయినా నా ఎద దడదడలాడునని
నాసరి నీవని నీగురి నేనని ఇపుడే తెలిసెనులే
తెలిసినదేమో తలచిన కొలదీ కలవరమాయెనులే
నాసరి నీవని నీగురి నేనని ఇపుడే తెలిసెనులే

ఎందుకయ్యా ఉంచినావు బందిఖానలో

ఎందుకయ్యా ఉంచినావు బందిఖానలో
అయ్యా అయ్యా ఓ రామయ్యా
ఎందుకయ్యా ఉంచినావు బందిఖానలో

రామదాసు కట్టించిన గుడిలో అంత మరమ్మతు జరుగుచుండగా
మా రామదాసు కట్టించిన గుడిలో అంత మరమ్మతు జరుగుచుండగా
నీ పదకమలము నిరతము గొలుచుచు
నీ భక్తుడనై ఉండికూడా నే ఉలకక పలకక ఉండిననా
గుడ్లప్పగించి చూచుచుంటిననా

ఎందుకయ్యా ఉంచినావు బందిఖానలో
అయ్యా అయ్యా ఓ రామయ్యా
ఎందుకయ్యా ఉంచినావు బందిఖానలో

రామయ్యా లావొకింతయు తగ్గలేదు
కడు స్వల్పంబయ్యె నా ఆహరమున్
చావుల్ తప్పిన ప్రాణవాయువుల
పట్టన్ కట్టగన్ తాల్లిటన్ లేవయ్యల్ కటా ఆ ఆ
ఇంత క్రూరముగ నను వేధింపగా పాడియాగ
రావా చిన్మయా రావా చిన్మయా కావవాదటయా
సంరంక్షింపవా రామయా రామయా ఆ ఆ

రామయ్యా ఎందుకయ్యా ఉంచినావు బందిఖానలో
అయ్యా అయ్యా ఓ రామయ్యా
ఎందుకయ్యా ఉంచినావు బందిఖానలో

హా ఇంత అరచినా పలుకవా సాక్షాత్కరింపవా
ఇక ఆ రామదాస భజనే నాకు గతా
రామయ్యా నిందిస్తున్నానని కుంగకే

నన్ను చెరలో వుంచి మేపుటకు ఎన్నో లక్షలు ఖర్చు కదా రామా
నన్ను చెరలో వుంచి మేపుటకు ఎన్నో లక్షలు ఖర్చు కదా
గుళ్ళో దక్షిణ నాకయె ఖర్చా ప్రజలిచ్చు దక్షిణ అంతా ఖర్చా
ఎవడబ్బసొమ్ముది నీ తాత సొమ్మా
ఎవడబ్బసొమ్ముది నీ తాత సొమ్మా
తిట్టకురా తిట్టకురా భక్తా సాక్షాత్కరించితినిరా చూడరా

ధన్యుడనైతినయా రామయ్యా ధన్యుడనైతినయా
రామయ్యా ధన్యుడనైతినయా రామయ్యా ధన్యుడనైతినయా
కన్నుల ఎదుటనే కనిపించితివా ఆ హా
నన్ను చేతితో తాక నిచ్చితివా రామా రామా
ఆహా ఆహా ఈ రూపం లో సాక్షాత్కరించావా తండ్రీ
నీ చరణాలను ముట్టనిచ్చితివా
నీ చరణాలను లాగనిచ్చితివా
నాకు విముక్తి నొసంగ వచ్చితివా
ధన్యుడనైతినయా రామయ్యా ధన్యుడనైతినయా

03 August 2010

ఉద్యోగం ఊడిపోయింది

ఉద్యోగం ఊడిపోయింది..
పొయిందా పొ పొ పొ పొయిందా..
నద్యోగం సంత కెళ్ళింది
గొవిందా గొ గొ గొ గొవిందా..
గోదారి ఈదాలంటే కుక్కతోకైన లేందండి
ఏ దేవిడి నడగాలన్నా..హుండికి చిల్లర లేదు..
పెదవి ఎండిపోతుంది..కడుపు మండిపోతుంది..
పులుసు కారిపోతుంది
ఎందుకిలా నా కర్మ కాలిపోతుంది ...


ఎవరండీ బాబూ కౄషితో నాస్తి దుర్బిక్షం అన్నాడు??
కౄషి వుంది దుర్బిక్షం కుడా ఉంది!!
చెమటోడ్చే మనుషులకి ఏలోటు రానే రాదంటారు??
ఏమైంది ఆ చమటేగా మిగిలింది...!
ఛీ అంది చేతిలో గిత
నలిగింది నుదిటి పై రాత
టొటల్గా చీకటయ్యిందీ లైఫంతా
పెదవి ఎండిపోతుంది..కడుపు మండిపోతుంది..
పులుసు కారిపోతుంది
ఎందుకిలా నా కర్మ కాలిపోతుంది ...



శని బాబాయ్ షాడోలా వెంటాడుతున్నడేమొ నన్ను
పనిలేదు.. పాకెట్లో పైసా లేదు
దురదృష్టం అయస్కాంతంలా లాగుతున్నాదనుకుంటాను ...
ఏం చెయను నే ఐరన్ లెగ్గయ్యాను
బిచ్చమెత్తరా..! సిగ్గుపడతాను
జేబు కత్తెర ..?? వెయ్యనే లేను
చచ్చిపోమరి..అంతపని చచ్చినా బాబోయ్ నే చెయ్ లేను
లక్కు లాగి తన్నింది.. తుక్కు లేచిపోయింది
తిక్క తీరిపొయింది..
ఎందుకిలా నా కర్మ కాలిపోతుంది ...

వెలుగురేఖలవారు తెలవారి తామొచ్చి

పల్లవి:

వెలుగురేఖలవారు తెలవారి తామొచ్చి ఎండాముగ్గులు పెట్టంగ
చిలకాముక్కులవారు చీకటితోనేవచ్చి చిగురుతోరణ కట్టంగా
మనవలనెత్తే తాత మనువడ వచ్చాడు
మందారపువ్వంటి మా బామ్మని అమ్మమ్మని

నోమీనమ్మల్లలాలో నోమన్నలాలో సందామామ సందామామ
నోచేవారింటిలోన పూచే పున్నాలబంతి సందామామ సందామామ
పండంటి ముత్తైదు సందామామ ఆ ఆ ఆ
పసుపుబొట్టంత మాతాత సందామామ ఆ ఆ ఆ ఆ
నోమీనమ్మల్లలాలో నోమన్నలాలో సందామామ సందామామ
నోచేవారింటిలోన పూచే పున్నాలబంతి సందామామ సందామామ

చరణం1:

కూర్చుని చెరిగే చేతికురులపై తుమ్మెదలాడే ఓ లాల
తుమ్మెదలాడే ఓ లాల
కుందిని దంచే నాతి దరువుకే గాజులు పాడే ఓ లాల
గాజులు పాడే ఓ లాల
గంధం పూసే మెడలో తాళిని కట్టేదెవరే ఇల్లాలా
కట్టేదెవరే ఇల్లాలా
మెట్టినింటిలో మట్టెలపాదం తొక్కిన ఘనుడే ఏలాల
ఏలాలో ఏలాల ఏలాలో ఏలాల

దివిటీల చుక్కల్లో దివినేలు మామ సందామామ సందామామ
గగనాల రధమెక్కి దిగివచ్చి దీవించు సందామామ సందామామ
నోమీనమ్మల్లలాలో నోమన్నలాలో సందామామ సందామామ
నోచేవారింటిలోన పూచే పున్నాలబంతి సందామామ సందామామ

చరణం2:

ఆపైన ఏముంది ఆ మూల గదిలోన
ఆరు తరములనాటి ఓ పట్టెమంచం
తొలిరాత్రి మలిరాత్రి పొంగల్లరాత్రి
ఆ మంచమే పెంచె మీ తాత వంశం
అరవయ్యేళ్ళ పెళ్ళి అరుదైన పెళ్ళి
మరలిరాని పెళ్ళి మరుడింటి పెళ్ళి
ఇరవైయ్యేళ్ళవాడు నీ రాముడైతే
పదహారేళ్ళ పడుచు మా జానకమ్మ
నిండా నూరేళ్ళంట ముత్తైదు జన్మ
పసుపుకుంకుమ కలిపి చేసాడు బ్రహ్మ

ఆనందమానందమాయెనే మా తాతయ్య పెళ్ళికొడుకాయెనే
ఆనందమానందమాయెనే మా నానమ్మ పెళ్ళికూతురాయెనే

పూసింది పూసింది పున్నాగ

పల్లవి:

పూసింది పూసింది పున్నాగ
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగ
దాని సన్నాయి జళ్ళోన సంపెంగ
ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై
ఆడ జతులాడ
పూసింది పూసింది పున్నాగ
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగ
దాని సన్నాయి జళ్ళోన సంపెంగ

చరణం1:

ఇష్టసఖి నా చిలుక నీ పలుకే బంగారంగా
అష్టపదులే పలికె నీ నడకే వయ్యారంగ
కలిసొచ్చేటి కాలాల కౌగిళ్ళలో కలలొచ్చాయిలే
కలలొచ్చేటి నీ కంటి పాపాయిలే కధ చెప్పాయిలే
అనుకోని రాగమే అనురాగ దీపమై
వలపన్న గానమే ఒక వాయు లీనమై
పాడె మది పాడె

పూసింది పూసింది పున్నాగ
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగ
దాని సన్నాయి జళ్ళోన సంపెంగ

చరణం2:

పట్టుకుంది నా పదమే నీ పదమే పారాణిగా
కట్టుకుంది నా కవితే నీ కళలే కళ్యాణిగా
అరవిచ్చేటి ఆ భేరి రాగాలకే స్వరమిచ్చావులే
ఇరుతీరాల గోదారి గంగమ్మకే అలలిచ్చావులే
అల ఎంకి పాటలే ఇల పూల తోటలై
పసి మొగ్గరేకులే పరువాల చూపులై
పూసె విరబూసె

పూసింది పూసింది పున్నాగ
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగ
దాని సన్నాయి జళ్ళోన సంపెంగ
ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై
ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై
ఆడ జతులాడ
పూసింది పూసింది పున్నాగ
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగ
దాని సన్నాయి జళ్ళోన సంపెంగ

బద్దరగిరి రామయ్య పాదాలు కడగంగ

బద్దరగిరి రామయ్య పాదాలు కడగంగ పరవల్లు తొక్కింది గోదారి గంగ
పాపికొండలకున్న పాపాలు కరగంగ పరుగుళ్ళు తీసింది గోదారి గంగ

సమయానికి తగు పాటపాడెనే
సమయానికి తగు పాటపాడెనే
త్యాగరాజుని లీలగా స్మరించునటు
సమయానికి తగు పాటపాడెనే
ప ప మగరి రి మగరి రిస స స ద స స రిరి సరిమ
సమయానికి తగు పాటపాడెనే
ధీమంతుడు ఈ సీతారాముడు సంగీత సంప్రదాయకుడు
సమయానికి తగు పాటపాడెనే
ద ద పదప దపమ మ పమగరి రిపమ ప ప సారిమ
సమయానికి తగు పాటపాడెనే
రారా పలుకరాయని కుమారులే ఇలా పిలువగ నోచని వాడు
సమయానికి తగు పాటపాడెనే
దపమపదస దదప పమగిరి స స సా దదప మగరి రి స స దదాప మపదస దదరిరి సని దస పదమప మగరిరి
సమయానికి తగు పాటపాడెనే
చిలిపిగ సదా కన్నబిడ్డవలె ముద్దు తీర్చుచిలకంటి మనవరాలు
సదాగ లయలతేల్చి సుతుండు కనుదెంచు నంచు ఆడి పాడు
శుభ సమయానికి తగు పాటపాడెనే
సదాభక్తుల నడతులే కనెనే అమరికగా నా పూజకు నేనే అలుక వద్దనెనే
విముఖులతో చేరబోకుమని ఎదగరిగిన చాలుబొమ్మననే
తమషమాది సుఖదాయకుడగు శ్రీత్యాగరాజనుతుడు చెంతరాకనే స

బద్దరగిరి రామయ్య పాదాలు కడగంగ పరవల్లు తొక్కింది గోదారి గంగ
చూపుల్లో స్నానాల సివమైన గంగ కల్లలో పొంగింది గోదారి గంగ

గోరంక గూటికే చేరావు చిలకా

పల్లవి:

గోరంక గూటికే చేరావు చిలకా
గోరంక గూటికే చేరావు చిలకా
భయమెందుకే నీకు బంగారు మొలకా
గోరంక గూటికే చేరావు చిలకా

చరణం1:

ఏ సీమదానివో ఎగిరెగిరి వచ్చావు
అలసి ఉంటావు మనసు చెదరి ఉంటావు
ఏ సీమదానివో ఎగిరెగిరి వచ్చావు
అలసి ఉంటావు మనసు చెదరి ఉంటావు
మా మల్లె పూలు నీకు మంచి కధలు చెప్పునే
మా మల్లె పూలు నీకు మంచి కధలు చెప్పునే
ఆదమరచి ఈ రేయి హాయిగా నిదురపో

గోరంక గూటికే చేరావు చిలకా
భయమెందుకే నీకు బంగారు మొలకా
గోరంక గూటికే చేరావు చిలకా

చరణం2:

నిలవలేని కళ్ళు నిదర పొమ్మన్నాయి
దాగని చిరునవ్వులు వద్దన్నాయి అబ్బ ఉండన్నాయి
నిలవలేని కళ్ళు నిదర పొమ్మన్నాయి
దాగని చిరునవ్వులు వద్దన్నాయి అబ్బ ఉండన్నాయి
పైట చెంగు రెపరెపలు పదపద లెమ్మన్నాయి
పైట చెంగు రెపరెపలు పదపద లెమ్మన్నాయి
పలుకైనా పలుకవా బంగారు చిలకా

గోరంక గూటికే చేరావు చిలకా
భయమెందుకే నీకు బంగారు మొలకా
గోరంక గూటికే చేరావు చిలకా

మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా

పల్లవి:

మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా
మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా
మెత్తగా అడిగితే లేదనేది లేదుగా
మెత్తగా అడిగితే లేదనేది లేదుగా
మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా

చరణం1:

నీది కానిదేది లేదు నాలో నిజానికే నేనున్నది నీలో
నీది కానిదేది లేదు నాలో నిజానికే నేనున్నది నీలో
ఒక్కటే మనసున్నది ఇద్దరిలో
ఒక్కటే మనసున్నది ఇద్దరిలో ఆ ఒక్కటి చిక్కెనీ గుప్పిటిలో
హా

మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా
మెత్తగా అడిగితే లేదనేది లేదుగా
మెత్తగా అడిగితే లేదనేది లేదుగా
మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా

చరణం2:

నిన్ను చూచి నన్ను నేను మరచినాను
నన్ను దోచుకొమ్మనీ నిలిచినాను
నిన్ను చూచి నన్ను నేను మరచినాను
నన్ను దోచుకొమ్మనీ నిలిచినాను
దోచుకుందమనే నేను చూచినాను
దోచుకుందమనే నేను చూచినాను
చూచి చూచి నువ్వె నన్ను దోచినావు

మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా
మెత్తగా అడిగితే లేదనేది లేదుగా
మెత్తగా అడిగితే లేదనేది లేదుగా
మెల్ల మెల్ల మెల్లగా

చరణం3:

కన్నులకీ కట్టినావు ప్రేమ గంతలు
కన్నె మనసు ఆడినదీ దాగుడు మూతలు
కన్నులకీ కట్టినావు ప్రేమ గంతలు
కన్నె మనసు ఆడినదీ దాగుడు మూతలు
దొరికినాము చివరకు తోడు దొంగలం
దొరికినాము చివరకు తోడు దొంగలం
దొరలమై ఏలుదాము వలపు సీమను
హా

మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా
మెత్తగా అడిగితే లేదనేది లేదుగా
మెత్తగా అడిగితే లేదనేది లేదుగా
మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా
మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా

అడగక ఇచ్చిన మనసే ముద్దు

పల్లవి:

అడగక ఇచ్చిన మనసే ముద్దు
అందీ అందని అందమె ముద్దు
విరిసి విరియని పువ్వే ముద్దు
తెలిసి తెలియని మమతే ముద్దు

అడగక ఇచ్చిన మనసే ముద్దు
అందీ అందని అందమె ముద్దు
విరిసి విరియని పువ్వే ముద్దు
తెలిసి తెలియని మమతే ముద్దు
అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు

చరణం1:

నడకలలో నాట్యం చేసే
నడుము చూస్తే పిడికెడు ముద్దు
నడకలలో నాట్యం చేసే
నడుము చూస్తే పిడికెడు ముద్దు
పొగడి పొగడి బులిపించే
నీ చిలిపి పలుకులు చిటికెడు ముద్దు
పొగడి పొగడి బులిపించే
నీ చిలిపి పలుకులు చిటికెడు ముద్దు
అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు

చరణం2:

చకచకలాడే పిరుదులు దాటే
జడను చూస్తే చలాకి ముద్దు
చకచకలాడే పిరుదులు దాటే
జడను చూస్తే చలాకి ముద్దు
కలకాలం తల దాచొకొమ్మనే
ఎడదను చూస్తే ఎంతో ముద్దు
కలకాలం తల దాచొకొమ్మనే
ఎడదను చూస్తే ఎంతో ముద్దు
అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు

చరణం3:

పచ్చని చేలే కంటికి ముద్దు
నెచ్చెలి నవ్వు జంటకి ముద్దు
చెట్టు చేమా జగతికి ముద్దు
నువ్వు నేను ఉహుహుహు
చెట్టు చేమా జగతికి ముద్దు
నువ్వు నేను

అడగక ఇచ్చిన మనసే ముద్దు
అందీ అందని అందమె ముద్దు
విరిసి విరియని పువ్వే ముద్దు
తెలిసి తెలియని మమతే ముద్దు
అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు

02 August 2010

చిన్నరి నా రాణి చిరునవ్వులే నవ్వితే

చిన్నరి నా రాణి చిరునవ్వులే నవ్వితే
గాలి ఈల వేసింది పూల వాన కురిసింది
గాలి ఈల వేసింది పూల వాన కురిసింది
లోకమే పులకించి మైకంలో ఉయ్యాలలే ఊగిలే
అందాల నా రాజు అనురాగమె చిందితే
గాలి ఈల వేసింది పూల వాన కురిసింది
లోకమే పులకించి మైకంలో ఉయ్యాలలే ఊగిలే

నా నోము పండింది నేడు నాకు ఈనాడు దొరికింది తోడు
నా రాణి అధరాల పిలుపు నాకు తెలిపేను తనలోన వలపు నిండు వలపు
అందాల నా రాజు అనురాగమె చిందితే
గాలి ఈల వేసింది పూల వాన కురిసింది
లోకమే పులకించి మైకంలో ఉయ్యాలలే ఊగిలే

ఎన్నెన్ని జన్మాల వరము నేడు నా వాడవైనావు నీవు
నా వెంట నీవున్న వేళ కోటి స్వర్గాల వైభోగ మేల భోగ మేల
చిన్నరి నా రాణి చిరునవ్వులే నవ్వితే
గాలి ఈల వేసింది పూల వాన కురిసింది
లోకమే పులికించి మైకంలో ఊయలలే ఊగిలే

ఈతోట మన పెళ్ళి పీట
పలికే మంత్రాల గోరింక నోట
నెమలి పురి విప్పి ఆడింది ఆట
వినగ విందాయే చిలకమ్మ పాట పెళ్ళి పాట

అందాల నా రాజు అనురాగమె చిందితే
గాలి ఈల వేసింది పూల వాన కురిసింది
లోకమే పులకించి మైకంలో ఉయ్యాలలే ఊగిలే

పాడనా తెలుగుపాట పాడనా తెలుగు పాట

పాడనా తెలుగుపాట పాడనా తెలుగు పాట
పరవశనై మీ ఎదుట మీ పాట
పాడనా తెలుగు పాట

కోవెల గంటల ఘణఘణలో గోదావరి తరగల గలగలలో
కోవెల గంటల ఘణఘణలో గోదావరి తరగల గలగలలో
మావులతోపుల మోపులపైనా మసలే గాలుల గుసగుసలో
మంచి ముత్యాల పేట మధురామృతాల తేట ఒక పాట

పాడనా తెలుగుపాట పాడనా తెలుగు పాట
పరవశనై నే పరవశనై మీ ఎదుట మీ పాట
పాడనా తెలుగు పాట

త్యాగయ క్షేత్రయ రామదాసులు
త్యాగయ క్షేత్రయ రామదాసులు
తనివితీర వినిపించినది నాడు నాడులా కదిలించేది
వాడ వాడలా కనిపించెది
చక్కెర మాటల మూట చిక్కని తేనెల ఊట ఒక పాట
పాడనా తెలుగు పాట

ఒళ్ళంత వయ్యారి కోక కళ్ళకు కాటుక రేఖ
ఒళ్ళంత వయ్యారి కోక కళ్ళకు కాటుక రేఖ
మెళ్ళో తాళి కాళ్ళకు పారాణి మెరిసే కుంకుమ బొట్టు
ఘల్లు ఘల్లున కడియాలందెలు అల్లనల్లన నడయాడె
తెలుగుతల్లి పెట్టని కోట తెనుగునాట ప్రతిచోట ఒక పాట
పాడనా తెలుగు పాట

01 August 2010

స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా

స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా
స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా
కడదాక నీడలాగ నిను వీడిపోదురా
నీ గుండెలో పూచేటిది
నీ శ్వాసగ నిలిచేటిది
ఈ స్నేహమొకటేనురా
స్నేహానికన్న మిన్న లోకాన లేదురా

తులతూగే సంపదలున్నా
స్నేహానికి సరిరావన్న
పలుకాడే బంధువులున్నా
నేస్తానికి సరికారన్న
మాయ మర్మం తెలియని
చెలిమే ఎన్నడు తరగని పెన్నిధిరా
ఆ స్నేహమే నీ ఆస్తిరా
నీ గౌరవం నిలిపేనురా
సందేహమే లేదురా || స్నేహానికన్నా ||

త్యాగానికి అర్ధం స్నేహం
లోభానికి లొంగదు నేస్తం
ప్రాణానికి ప్రాణం స్నేహం
రక్తానికి రక్తం నేస్తం
నీది నాదను భేదం లేనిది
నిర్మలమైనిది స్నేహమురా
ధ్రువతారలా స్థిరమైనది
ఈ జగతిలో విలువైనది
ఈ స్నేహమొకటేనురా || స్నేహానికన్నా ||

స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం

ఆ ఆ ఆ అల్లాయే దిగి వచ్చి అల్లాయే దిగి వచ్చి
ఆయ్ మియా ఏమి కావాలంటే
మిద్దెలొద్దు మేడలొద్దూ
పెద్దలెక్కే గద్దెలొద్దంటాను
ఉన్ననాడు లేనినాడు ఒకే ప్రాణమై నిలిచే
ఒక్క దోస్తే చాలంటాను
ఒక్క నేస్తం కావాలంటాను

స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం
హోయ్ స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం
స్నేహమే నాకున్నది స్నేహమేరా పెన్నిధి
స్నేహమే హోయ్
స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం
హోయ్ స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం

గుండెనే పలికించితే
గుండెనే పలికించితే కోటి పాటలు పలుకుతాయ్
మమతనే పండించితే మణుల పంటలు దొరుకుతాయ్
బాధలను ప్రేమించు భాయీ ఈ ఈ
బాధలను ప్రేమించు భాయీ లేదు అంతకు మించి హాయి
స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం
హోయ్ స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం

హేయ్ కత్తిలా పదునైన చురుకైన మావాడు
మెత్తబడిపోయాడు ఎందుకో ఈనాడు
ఆ కత్తిలా పదునైన చురుకైన మావాడు
మెత్తబడిపోయాడు ఎందుకో ఈనాడు
ఏమిటో ఈ బాధ ఆ ఆ ఏమిటో ఈ బాధ
నాకైనా చెప్పు భాయి
ఆ రహస్యం కాస్త ఇకనైనా విప్పవోయి
ఆ రహస్యం కాస్త ఇకనైనా విప్పవోయి
నిండుగా నువ్వు నేడు నవ్వాలి
అందుకు నేనేమి ఇవ్వాలి
నిండుగా నువ్వు నేడు నవ్వాలి
అందుకు నేనేమి ఇవ్వాలి
చుక్కలను కోసుకుని తెమ్మంటావా
దిక్కులను కలిపేయమంటావా
దింపమంటావా
దింపమంటావా ఆ చంద్రుణ్ణి
తుంచమంటావా ఆ సూర్యుణ్ణి
ఏమి చేయాలన్నా చేస్తాను
కోరితే ప్రాణమైన ఇస్తాను
ఏమి చేయాలన్నా చేస్తాను
కోరితే ప్రాణమైన ఇస్తాను
దోస్తీకి నజరానా ఆ ఆ
దోస్తీకి నజరానా చిరునవ్వురా నాన్న
దోస్తీకి నజరానా చిరునవ్వురా నాన్న
ఒక నవ్వేచాలు వద్దులే వరహాలు నవ్వరా
నవ్వెరా హోయ్ మావాడు నవ్వెరా నిండుగా
నవ్వెరా మావాడు నవ్వెరా నిండుగా
నవ్వెరా నా ముందు రంజాను పండుగా

స్నేహమే హోయ్
స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం
స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం

ఆమనిలా పాడు మల్లియలా చూడు

ఆమనిలా పాడు మల్లియలా చూడు
ఆమనిలా పాడు మల్లియలా చూడు
కళ్ళళ్ళో కొలువున్నావు గుండెల్లో జత కోరేవు
శతకోటి పువ్వుల పొంగువో
ఆమనిలా పాడు మల్లియలా చూడు

నన్నే మురిపించే వనమో వలపే విరిసి
నీ కన్నుల చిలికే స్వరమో కలలై కురిసె
నన్నే మురిపించే వనమో వలపే విరిసి
నీ కన్నుల చిలికే స్వరమో కలలై కురిసె
సాగరమ్ము పొంగు రీతి సాగె గంధమే లలల
ఈ క్షణం వరాల ప్రేమ నా కు ప్రాణమే లలలల ల
సోయగం నా బంధనం నందనం హరిచందనం నేనే నీవు హోయ్ హోయ్

ఆమనిలా పాడు మల్లియలా చూడు
కళ్ళళ్ళో కొలువున్నావు ఆ ఆ గుండెల్లో జత కోరేవు ఉ ఉ
శతకోటి పువ్వుల పొంగువో
ఆమనిలా పాడు మల్లియలా చూడు

ఊరించే అల్లరి తలపే ఊరేగేనే
మరిపించే ఊహలు తెలిపే నా ఎదలోనే
ఊరించే అల్లరి తలపే ఊరేగేనే
మరిపించే ఊహలు తెలిపే నా ఎదలోనే
తీయని రాగాలుతోటి పల్లవించెనె లలలలల
తీరని స్వప్నాలు నేదు ఆలకించెనే లలలల
ఏ క్షణం నీవే జగం జీవితం నీకంకితం
నేనే నీవూ హో హో

ఆమనిలా పాడు మల్లియలా చూడు
ఆమనిలా పాడు మల్లియలా చూడు
కళ్ళళ్ళో కొలువున్నావు ఆ ఆ గుండెల్లో జత కోరేవు
శతకోటి పువ్వుల పొంగువో
ఆమనిలా పాడు మల్లియలా చూడు