08 August 2010

నాసరి నీవని నీగురి నేనని ఇపుడే తెలిసెనులే

తెలిసినదేమో తలచిన కొలదీ పులకలు కలిగెనులే
నీకు నాకు వ్రాసి ఉన్నదని ఎప్పుడో తెలిసెనులే
తెలిసినదేమో తలచిన కొలదీ కలవరమాయెనులే
నాసరి నీవని నీగురి నేనని ఇపుడే తెలిసెనులే

నా హృదయమునే వీణ జేసుకొని ప్రేమను గానము చేతువని ఆ ఆ ఆ
నా హృదయమునే వీణ జేసుకొని ప్రేమను గానము చేతువని
నీ గానము నా చెవి సోకగనే నా మది నీదై పోవునని
నీ గానము నా చెవి సోకగనే నా మది నీదై పోవునని
నీకు నాకు వ్రాసి ఉన్నదని ఎప్పుడో తెలిసెనులే

నను నీ చెంతకు ఆకర్షించే గుణమే నీలో ఉన్నదని ఆ ఆ ఆ ఆ ఆ
నను నీ చెంతకు ఆకర్షించే గుణమే నీలో ఉన్నదని
ఏమాత్రము నీ అలికిడి అయినా నా ఎద దడదడలాడునని
ఏమాత్రము నీ అలికిడి అయినా నా ఎద దడదడలాడునని
నాసరి నీవని నీగురి నేనని ఇపుడే తెలిసెనులే
తెలిసినదేమో తలచిన కొలదీ కలవరమాయెనులే
నాసరి నీవని నీగురి నేనని ఇపుడే తెలిసెనులే

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips