29 August 2010

ఏమైందో ఎటు వెళ్ళిందో నిను చూసిన నా హృదయం

ఏమైందో ఎటు వెళ్ళిందో నిను చూసిన నా హృదయం
నీతోనే తను చేరిందో కావాలని నీ స్నేహం
రావా రాలేవా నే బ్రతికే ప్రతి నిముషం నీకోసం
రావా రాలేవా నే బ్రతికే ప్రతి నిముషం నీకోసం
ఏమైందో ఎటు వెళ్ళిందో నిను చూసిన నా హృదయం
నీతోనే తను చేరిందో కావాలని నీ స్నేహం

ఎందరు ఉన్నా అందరులోనూ కనిపించేదీ నీ రూపే
ఎవరేమన్నా ఏమంటున్నా వినిపించేదీ నీ మాటే
కనుపాపలలో కమ్మని కలగా కదలాడేదీ నీ తలపే
నేనేమౌతున్నా నీకోసమనే నిలుచున్నది నా శ్వాస
ఏనాడైనా నిను దరి చేరేనని బ్రతికేస్తున్నది ఆశ
రావా రా లేవా నే బ్రతికే ప్రతి నిమిషం నీ కోసం

ఏమైందో ఎటు వెళ్ళిందో నిను చూసిన నా హృదయం
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

నవ్వే ఎరుగని పెదవులపైనా
చిరునగవై నీ వొచ్చావే
ప్రేమే తెలియని నా మనసునకు
ప్రేమను ప్రేమగా పంచావే
నీ పరిచయమే జరగకపోతే
జీవితమంతా వృదయేగా
నిను చూసిన క్షణమే నీలో సగమై
నా నీడను నే మరిచా
నీ ఊహలతో నా మనసును నింపి
నీకోసమే నే వేచా రావా రా లేవా
నే బ్రతికే ప్రతి నిమిషం నీ కోసం

ఏమైందో ఎటు వెళ్ళిందో నిను చూసిన నా హృదయం
నీతోనే తను చేరిందో కావాలని నీ స్నేహం
రావా రాలేవా నే బ్రతికే ప్రతి నిముషం నీకోసం

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips