03 August 2010

అడగక ఇచ్చిన మనసే ముద్దు

పల్లవి:

అడగక ఇచ్చిన మనసే ముద్దు
అందీ అందని అందమె ముద్దు
విరిసి విరియని పువ్వే ముద్దు
తెలిసి తెలియని మమతే ముద్దు

అడగక ఇచ్చిన మనసే ముద్దు
అందీ అందని అందమె ముద్దు
విరిసి విరియని పువ్వే ముద్దు
తెలిసి తెలియని మమతే ముద్దు
అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు

చరణం1:

నడకలలో నాట్యం చేసే
నడుము చూస్తే పిడికెడు ముద్దు
నడకలలో నాట్యం చేసే
నడుము చూస్తే పిడికెడు ముద్దు
పొగడి పొగడి బులిపించే
నీ చిలిపి పలుకులు చిటికెడు ముద్దు
పొగడి పొగడి బులిపించే
నీ చిలిపి పలుకులు చిటికెడు ముద్దు
అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు

చరణం2:

చకచకలాడే పిరుదులు దాటే
జడను చూస్తే చలాకి ముద్దు
చకచకలాడే పిరుదులు దాటే
జడను చూస్తే చలాకి ముద్దు
కలకాలం తల దాచొకొమ్మనే
ఎడదను చూస్తే ఎంతో ముద్దు
కలకాలం తల దాచొకొమ్మనే
ఎడదను చూస్తే ఎంతో ముద్దు
అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు

చరణం3:

పచ్చని చేలే కంటికి ముద్దు
నెచ్చెలి నవ్వు జంటకి ముద్దు
చెట్టు చేమా జగతికి ముద్దు
నువ్వు నేను ఉహుహుహు
చెట్టు చేమా జగతికి ముద్దు
నువ్వు నేను

అడగక ఇచ్చిన మనసే ముద్దు
అందీ అందని అందమె ముద్దు
విరిసి విరియని పువ్వే ముద్దు
తెలిసి తెలియని మమతే ముద్దు
అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips