08 August 2010

ఎందుకయ్యా ఉంచినావు బందిఖానలో

ఎందుకయ్యా ఉంచినావు బందిఖానలో
అయ్యా అయ్యా ఓ రామయ్యా
ఎందుకయ్యా ఉంచినావు బందిఖానలో

రామదాసు కట్టించిన గుడిలో అంత మరమ్మతు జరుగుచుండగా
మా రామదాసు కట్టించిన గుడిలో అంత మరమ్మతు జరుగుచుండగా
నీ పదకమలము నిరతము గొలుచుచు
నీ భక్తుడనై ఉండికూడా నే ఉలకక పలకక ఉండిననా
గుడ్లప్పగించి చూచుచుంటిననా

ఎందుకయ్యా ఉంచినావు బందిఖానలో
అయ్యా అయ్యా ఓ రామయ్యా
ఎందుకయ్యా ఉంచినావు బందిఖానలో

రామయ్యా లావొకింతయు తగ్గలేదు
కడు స్వల్పంబయ్యె నా ఆహరమున్
చావుల్ తప్పిన ప్రాణవాయువుల
పట్టన్ కట్టగన్ తాల్లిటన్ లేవయ్యల్ కటా ఆ ఆ
ఇంత క్రూరముగ నను వేధింపగా పాడియాగ
రావా చిన్మయా రావా చిన్మయా కావవాదటయా
సంరంక్షింపవా రామయా రామయా ఆ ఆ

రామయ్యా ఎందుకయ్యా ఉంచినావు బందిఖానలో
అయ్యా అయ్యా ఓ రామయ్యా
ఎందుకయ్యా ఉంచినావు బందిఖానలో

హా ఇంత అరచినా పలుకవా సాక్షాత్కరింపవా
ఇక ఆ రామదాస భజనే నాకు గతా
రామయ్యా నిందిస్తున్నానని కుంగకే

నన్ను చెరలో వుంచి మేపుటకు ఎన్నో లక్షలు ఖర్చు కదా రామా
నన్ను చెరలో వుంచి మేపుటకు ఎన్నో లక్షలు ఖర్చు కదా
గుళ్ళో దక్షిణ నాకయె ఖర్చా ప్రజలిచ్చు దక్షిణ అంతా ఖర్చా
ఎవడబ్బసొమ్ముది నీ తాత సొమ్మా
ఎవడబ్బసొమ్ముది నీ తాత సొమ్మా
తిట్టకురా తిట్టకురా భక్తా సాక్షాత్కరించితినిరా చూడరా

ధన్యుడనైతినయా రామయ్యా ధన్యుడనైతినయా
రామయ్యా ధన్యుడనైతినయా రామయ్యా ధన్యుడనైతినయా
కన్నుల ఎదుటనే కనిపించితివా ఆ హా
నన్ను చేతితో తాక నిచ్చితివా రామా రామా
ఆహా ఆహా ఈ రూపం లో సాక్షాత్కరించావా తండ్రీ
నీ చరణాలను ముట్టనిచ్చితివా
నీ చరణాలను లాగనిచ్చితివా
నాకు విముక్తి నొసంగ వచ్చితివా
ధన్యుడనైతినయా రామయ్యా ధన్యుడనైతినయా

No comments: