14 August 2010

దేశం మనదే తేజం మనదే

నాననినాన నాననినాన
నాన నాన నననా నానా
దేశం మనదే తేజం మనదే ||2||
ఎగురుతున్న జెండా మనదే
నీతి మనదే జాతి మనదే
ప్రజల అండదండా మనదే
అందాల బంధం ఉంది ఈ నేలలో
ఆత్మీయరాగం ఉంది ఈ గాలిలో
ఏ కులమైనా ఏ మతమైనా ||2||
భరతమాతకొకటేలేరా
ఎన్ని బేధాలున్నా మాకెన్ని తేడాలున్నా
దేశమంటే ఏకమవుతాం అంతా ఈవేళా...
వందేమాతరం అందామందరం
వందేమాతరం ఓ... అందామందరం ||దేశం మనదే||
అందాల బంధం ఉంది ఈ నేలలో
ఆత్మీయరాగం ఉంది ఈ గాలిలో
ఏ కులమైన ఏ మతమైన
భరతమాతకొకటేలేరా
రాజులు అయినా పేదలు అయినా
భరతమాత సుతులేలేరా
ఎన్ని దేశాలున్నా మాకెన్ని దోషాలున్నా
దేశమంటే ప్రాణమిస్తాం
అంతా ఈవేళా...
వందేమాతరం అందామందరం
వందేమాతరం ఓ... అందామందరం
వందేమాతరం... వందేమాతరం...
వందేమాతరం... వందేమాతరం...
వందేమాతరం... వందేమాతరం...

No comments: