30 September 2007

స్వప్న వేణువేదో

స్వప్న వేణువేదో సంగీతమాలపించే
సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే
జోడైన రెండు గుండెల ఏక తాళమో
జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమో
లే లేత పూల బాసలు కాలేవా చేతి రాతలు

నీదే ప్రాణం నీవే సర్వం నీకై చేసా వెన్నెల జాగారం
ప్రేమ నేడు రేయి పగలు హారాలల్లే మల్లెలు నీకోసం
కోటి చుక్కలు అష్ట దిక్కులు నిన్ను చూచు వేళ
నిండు ఆశలే రెండు కన్నులై చూస్తే నేరాన
కాలాలే ఆగిపోయినా గానాలే మూగబోవునా
నాలో మోహం రేగే దాహం దాచేదెపుడో పిలిచే కన్నుల్లో

ఓడే పందెం గెలిచే బంధం రెండూ ఒకటే కలిసే జంటల్లో
మనిషి నీడగా మనసు తోడుగా మలచుకున్న బంధం
పెను తుఫానులే ఎదురు వచ్చినా చేరాలీ తీరం
వారేవా ప్రేమ పావురం వాలేదే ప్రణయ గోపురం

చంద్రుళ్ళో ఉండే కుందేలు

చంద్రుళ్ళో ఉండే కుందేలు కిందికొచ్చిందా
కిందికొచ్చి నీలా మారిందా
చుక్కల్లో ఉండే జిగేలు నిన్ను మెచ్చిందా
నిన్ను మెచ్చి నీలో చేరిందా
నువ్వలా సాగే దోవంతా నావలా తూగే నీవెంట
నువ్వెళ్ళే దారే మారిందా నీవల్లే తీరే మారి ఏరై పారిందా నేలంతా
గువ్వలా దూసుకువచ్చావే తొలి యవ్వనమా తెలుసా ఎక్కడ వాలాలో
నవ్వులే తీసుకు వచ్చావే ఈడు సంబరమా తెలుసా ఎవ్వరికివ్వాలో

కూచిపూడి అన్న పదం కొత్త ఆట నేర్చిందా
పాపలాంటి లేత పదం పాఠశాలగా
కూనలమ్మ జానపదం పల్లె దాటి వచ్చిందా
జావళీల జాణతనం బాటచూపగా
కుంచెలో దాగే చిత్రాలు ఎదురొచ్చేలా
అంతటా ఎన్నో వర్ణాలు
మంచులో దాగే చైత్రాలు బదులిచ్చేలా
ఇంతలా ఏవో రాగాలు

ఆకతాయి సందడిగా ఆగలేని తొందరగా
సాగుతున్న ఈ పయనం ఎంత వరకో
రేపు వైపు ముందడుగా లేని పోని దుందురుకా
రేగుతున్న ఈ వేగం ఎందుకొరకో
మట్టికి మబ్బుకి ఈ వేళ దూరమెంతంటే
లెక్కలే మాయం అయిపోవా
రెంటినీ ఒక్కటి చేసేలా తీరమేదంటే
దిక్కులే తత్తర పడిపోవా

శివపూజకు

శివపూజకు చివురించిన సిరి సిరి మువ్వ
సిరి సిరి మువ్వ సిరి సిరి మువ్వ
మృదుమంజుల పదమంజరి పూచిన పువ్వా
సిరి సిరి మువ్వ సిరి సిరి మువ్వ
యతిరాజుకు జతిస్వరముల పరిమళమివ్వా
సిరి సిరి మువ్వ సిరి సిరి మువ్వ
నటనాంజలితో బ్రతుకును తరించనీవా
సిరి సిరి మువ్వ సిరి సిరి మువ్వ

పరుగాపక పయనించవే తలపులనావా
కెరటాలకు తలవంచితే తరగదు త్రోవ
ఎదిరించిన సుడిగాలిని జయించినావా
మదికోరిన మధుసీమలు వరించి రావా

పడమర పడగలపై మెరిసే తారలకై
పడమర పడగలపై మెరిసే తారలకై రాత్రిని వరించకే సంధ్యాసుందరి
తూరుపు వేదికపై వేకువ నర్తకివై
తూరుపు వేదికపై వేకువ నర్తకివై ధాత్రిని మురిపించే కాంతులు చిందనీ
నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ
నిదురించిన హృదయరవళి ఓంకారం కానీ

శివపూజకు చివురించిన సిరి సిరి మువ్వ
సిరి సిరి మువ్వ సిరి సిరి మువ్వ
మృదుమంజుల పదమంజరి పూచిన పువ్వా
సిరి సిరి మువ్వ సిరి సిరి మువ్వ

తన వేళ్ళే సంకెళ్ళై కదలలేని మొక్కలా
ఆమనికై ఎదురు చూస్తూ ఆగిపోకు ఎక్కడా
అవధి లేని అందముంది అవనికి నలుదిక్కులా
ఆనందపు గాలివాలు నడపనీ నిన్నిలా
ప్రతిరోజొక నవగీతిక స్వాగతించగా
వెన్నెల కిన్నెరగానం నీకుతోడుగా
పరుగాపక పయనించవే తలపులనావా
కెరటాలకు తలవంచితే తరగదు త్రోవ

చలితచరణ జనితం నీ సహజ విలాసం
జ్వలిత కిరణ కలితం సౌందర్య వికాసం
నీ అభినయ ఉషోదయం తిలకించిన రవినయనం
గగనసరసి హృదయంలో వికసిత శతదళ శోభల సువర్ణకమలం

పరుగాపక పయనించవే తలపులనావా
కెరటాలకు తలవంచితే తరగదు త్రోవ

కొత్తగా రెక్కలొచ్చెనా

కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వపిల్లకి
మెత్తగా రేకు విచ్చెనా
మెత్తగా రేకు విచ్చెనా
కొమ్మ చాటునున్న కన్నెమల్లికి
కొమ్మ చాటునున్న కన్నెమల్లికి
కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా

కొండగాలి మార్చింది కొంటె వాగు జోరు
కులుకులెన్నో నేర్చింది కలికి ఏటినీరు
బండరాల హోరు మారి పంటచేల పాటలూరి
మేఘాల రాగాల మాగాణి ఊగేల
సిరిచిందులేసింది కనువిందు చేసింది

కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా

వెదురులోకి ఒదిగింది కుదురులేని గాలి
ఎదురులేక ఎదిగింది మధురగానకేళి
భాషలోన రాయలేని రాసలీల రేయిలోని
యమునాతరంగాల కమనీయ శృంగార కళలెన్నో చూపింది కలలెన్నో రేపింది

కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వపిల్లకి
మెత్తగా రేకు విచ్చెనా
మెత్తగా రేకు విచ్చెనా
కొమ్మ చాటునున్న కన్నెమల్లికి
కొమ్మ చాటునున్న కన్నెమల్లికి
కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా

ఆకాశంలో

ఆకాశంలో ఆశల హరివిల్లు
ఆనందాలే పూసిన పొదరిల్లు
అందమైన ఆ లోకం అందుకోనా
ఆదమరిచి కలకాలం ఉండిపోనా

మబ్బుల్లో తూలుతున్న మెరుపైపోనా
వయ్యారి వానజల్లై దిగిరానా
సంద్రంలో పొంగుతున్న అలనైపోనా
సందెల్లో రంగులెన్నో చిలికేనా
పిల్లగాలే పల్లకీగా దిక్కులన్నీ చుట్టిరానా
నా కోసం నవరాగాలే నాట్యమాడెనుగా

స్వర్గాల స్వాగతాలు తెలిపే గీతం
స్వప్నాల సాగరాల సంగీతం
ముద్దొచ్చే తారలెన్నో మెరిసే తీరం
ముత్యాల తోరణాల ముఖద్వారం
శోభలీనే సొయగాన చందమామ మందిరాన
నా కోసం సురభోగాలే వేచినిలిచెనుగా

ఘల్లుఘల్లుఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు

ఘల్లుఘల్లుఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు
ఝల్లుఝల్లుఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు
నల్లమబ్బు చల్లనీ చల్లని చిరుజల్లు
పల్లవించనీ నేలకి పచ్చని పరవళ్ళు

ఘల్లుఘల్లుఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు
ఝల్లుఝల్లుఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు
వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు
ఎల్లలన్నవే ఎరగని వేగంతో వెళ్ళు

ఘల్లుఘల్లుఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు
ఝల్లుఝల్లుఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు

లయకే నిలయమై నీ పాదం సాగాలి
మలయానిల గతిలో సుమబాలగతూగాలి
వలలో ఒదుగునా విహరించే చిరుగాలి
సెలయేటికి నటనం నేర్పించే గురువేడి
తిరిగే కాలానికి తీరొకటుంది
అది నీ పాఠానికి దొరకను అంది
నటరాజస్వామి జటాజూటిలోకి చేరకుంటే విరుచుకుపడు సురగంగకు విలువేముంది విలువేముంది

ఘల్లుఘల్లుఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు
ఝల్లుఝల్లుఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు

దూకే అలలకు ఏ తాళం వేస్తారు
కమ్మని కలలపాట ఏ రాగం అంటారు
అలలకు అందునా ఆశించిన ఆకాశం
కలలా కరగడమా జీవితాన పరమార్ధం
వద్దని ఆపలేరు ఉరికే ఊహని
హద్దులు దాటరాదు ఆశలవాహిని
అలుపెరగని ఆటలాడు వసంతాలు వలదంటే విరివనముల పరిమళముల విలువేముంది విలువేముంది

అనగనగా ఆకాశం ఉంది

అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది
మేఘం వెనుక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది
కరిగే నింగి చినుకయ్యింది చినుకే చిటపట పాటయ్యింది
చిటపట పాటే తాకిన నేల చిలకలు వాలే చెట్టాయ్యింది
నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి
రాగాల గువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి
ఊగే కొమ్మల్లోన చిరుగాలి ఖవ్వాలి పాడి కచ్చేరి చేసే వేళల్లో
గుండెల గుమ్మంలోన సరదాలే సయ్యాటలు ఆడి తాళాలే వేసే వేళల్లో
కేరింతలే ఏ దిక్కున చూస్తున్నా కవ్వింతగా
నీ చెలిమే చిటికేసి నను పిలిచే నీకేసి
నువు చెవిలో చెప్పే ఊసుల కోసం నేనొచ్చేసా పరుగులు తీసి
చుక్కల్లోకం చుట్టు తిరగాలి అనుకుంటు ఊహ ఊరేగే వెన్నెల దారుల్లో
నేనున్నా రమ్మంటు ఓ తార నాకోసం వేచి సావాసం పంచే సమయంలో
నూరేళ్ళకి సరిపోయే ఆశలని పండించగా
ఆ స్నేహం చిగురించి ఏకాంతం పులకించి
అనుబంధాలే సుమగంధాలై ఆనందాలే విరబూస్తూ ఉంటే
నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి

ఎక్కడ ఉన్నా

ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది
నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది అరే ఇదేం గారడీ
నేను కూడ నువ్వయానా పేరుకైనా నేను లేనా
దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావన


నిద్దర తుంచే చల్లని గాలి వద్దకు వచ్చి తానెవరంది
నువ్వే కాదా చెప్పు ఆ పరిమళం
వెన్నెల కన్నా చల్లగ ఉన్న చిరునవ్వేదో తాకుతు ఉంది
నీదే కాదా చెప్పు ఆ సంబరం
కనుల ఎదుట నువ్వు లేకున్నా మనసు నమ్మదే చెబుతున్నా
ఎవరు ఎవరితో ఏమన్నా నువ్వు పిలిచినట్టనుకున్నా
ఇది హాయో ఇది మాయో నీకైనా తెలుసునా
ఏమిటౌతోందో ఇలా నా ఎద మాటున
దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావన
కొండల నుంచి కిందికి దూకే తుంటరి వాగు నాతో అంది
నువ్వు అలా వస్తూ ఉంటావని
గుండెల నుంచి గుప్పున ఎగసే ఊపిరి నీకో కబురంపింది
చెలి నీకై చూస్తూ ఉంటానని
మనసు మునుపు ఎపుడూ ఇంత ఉలికి ఉలికి పడలేదు కద
మనకు తెలియనిది ఈ వింత ఎవరి చలవ ఈ గిలిగింత
నాలాగే నీక్కూడ అనిపిస్తూ ఉన్నదా
ఏమి చేస్తున్నా పరాకే అడుగడుగునా
దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావన

కళ్ళల్లోకి కళ్ళు పెట్టి

కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు
మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళూ తెలుసు
నువ్వు నేను ఇద్దరున్నామంటే నమ్మనంటూ ఉంది మనసు

ఈనాడే సరికొత్తగా మొదలైందా మన జీవితం
గతమంటూ ఏంలేదని చెరిగిందా ప్రతి ఙాపకం
కనులు మూసుకుని ఏం లాభం
కలైపోదుగా ఏ సత్యం
ఎటూ తేల్చని నీ మౌనం
ఎటో తెలియని ప్రయాణం
ప్రతి క్షణం ఎదురయే నన్నే దాటగలదా

గాలిపటం గగనానిదా ఎగరేసే ఈ నేలదా
మోహమయం నీ చెలిమిదా ముడివేసే ఇంకొకరిదా
నిన్నామొన్నలని నిలువెల్ల
నిత్యం నిన్ను తడిమే వేళ
తడే దాచుకున్న మేఘంలా
ఆకాశాన నువ్వు ఎటువున్నా
చినుకులా కరగక శిలై ఉండగలవా

ఆకాశం దిగివచ్చి

ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి
ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి
చెరి సగమవమని మనసులు కలుపుతు తెర తెరిచిన తరుణం
ఇదివరకెరగని వరసలు కలుపుతు మురిసిన బంధు జనం
మా ఇళ్ళ లేత మావిళ్ళ తోరణాలన్ని పెళ్ళి శుభలేఖలే
అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైనవీ గాలులే
చెంపలో విరబూసే అమ్మాయి సిగ్గు దొంతరలు
ఆ సొంపులకు ఎర వేసే అబ్బాయి చూపు తొందరలు
ఏ వరాలో ఈ జవరాలై జతపడు సమయంలో
వానవిల్లే వధువుగ మారి ఒదిగిన వేడుకలో
తన సరసన విరిసిన సిరిసిరి సొగసుల కులుకుల కలువకు కానుకగా
ఎద సరసున ఎగసిన అలజడి అలలే తాకగా
విన్నవారెవరసలు సన్నాయి వారి సంగతులు
సనసన్నగా రుసరుసలు వియ్యాల వారి విసవిసలు
సందు చూసి చక చక ఆడే జూద శిఖామణులు
పందిరంతా ఘుమ ఘుమలాడే విందు సువాసనలు
తమ నిగనిగ నగలను పదుగురి ఎదురుగ ఇదిగిదిగో అని చూపెడుతూ
తెగ తిరిగే తరుణుల తికమక పరుగులు చూడగా

ఉన్నమాట చెప్పనీవు

ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటె ఒప్పుకోవు ఇంకెలాగె సత్యభామ
నన్ను దాటి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యోరామ
అనుకున్నా తప్పు కదా మోమాటం ముప్పు కద
మనసైతే ఉంది కదా మన మాటేం వినదు కద
పంతం మానుకో భయం దేనికో

వద్దన్నకొద్ది తుంటరిగా తిరగకలా నా వెనక
నిద్దర్లో కూడ వంటరిగా వదలవుగా
నన్నాశపెట్టి ఈ సరదా నేర్పినదే నువ్వు గనక
నా కొంగు పట్టి నడవనిదే కుదరదుగా
అడుగడుగున ఎదురైతే ఏ దారి తోచదుగా
అటు ఇటు ఎటు తేల్చవుగా మన కథ నువు తొందరగా
ప్రతీ చోట నీ నవ్వే పిలుస్తోందిగా

ఆమాయకంగ చూడకలా వేడుకలా చిలిపి కల
అయోమయంగ వెయ్యకలా హాయి వల
నీ మీదకొచ్చి ఉరితాడై వాలదుగా వాలు జడ
దానొంక చూస్తే ఎందుకట గుండె ధడ
మరి మరి శృతి మించి ఇలా నను మైమరపించకలా
తడబడి తల వంచి ఇలా తలపును అణిచేస్తే ఎలా
మరేం చెయ్యనే నీతో ఎలా వేగనే

ఒక్క సారి చెప్పలేవా

ఒక్క సారి చెప్పలేవా నువ్వు నచ్చావని
చెంత చేరి పంచుకోవా ఆశ నీ శ్వాసని
మన గుండె గుప్పెడంత తన ఊహ ఉప్పెనంత
ఒదిగుండమనక వదిలేయమంటు బతిమాలుకున్న వేళ
వెన్నెలేదో వేకువేదో నీకు తెలుసా మరి
నిదురపోయే మదిని గిల్లి ఎందుకా అల్లరి

చందమామ మనకందదని ముందుగానె అది తెలుసుకుని
చేయిజాచి పిలవద్దు అని చంటిపాపలకు చెబుతామా
లేనిపోని కలలెందుకని మేలుకుంటె అవి రావు అని
జన్మలోనె నిదరోకు అని కంటిపాపలకు చెబుతామా
కలలన్నవి కలలని నమ్మనని
అవి కలవని పిలవకు కలవమని
మది మీటుతున్న మధురానుభూతి మననడిగి చేరుతుందా

అందమైన హరివిల్లులతో వంతెనేసి చిరుజల్లులతో
చుక్కలన్ని దిగి వస్తుంటే కరిగిపోని దూరం ఉందా
అంతులేని తన అల్లరితో అలుపులేని తన అలజడితో
కెరటమెగిరి పడుతూ ఉంటే ఆకాశం తెగి పడుతుందా
మనసుంటే మార్గం ఉంది కద అనుకుంటే అందనిదుంటుందా
అనుకున్నవన్ని మనకందినట్టే అనుకుంటే తీరిపోదా

నా చూపే నిను వెతికినది

నా చూపే నిను వెతికినది నీ వైపే నను తరిమినది
నాకెందుకిలా ఔతోంది నా మదినడిగితె చెబుతుంది
నువ్వే నువ్వే తనలోనె ఉన్నావంటు
నీకే నీకే చెప్పాలి అంటున్నది

నిన్నే తలచిన ప్రతి నిమిషం ఏదో తెలియని తీయదనం
నాలో నిలవని నా హృదయం ఏమౌతుందని చిన్న భయం
గుండెలోన చోటిస్తాలే నన్ను చేరుకుంటే
వేలు పట్టి నడిపిస్తాలే నా వెంటే నీవుంటే

పెదవులు దాటని ఈ మౌనం అడిగేదెలాగ నీ స్నేహం
అడుగులు సాగని సందేహం చెరిపేదెలాగ ఈ దూరం
దిగులు కూడ తీయగలేదా ఎదురు చూస్తూ ఉంటే
పగలు కూడ రేయైపోదా నీవుంటే నా వెంటే

ఓ నవ్వు చాలు

నా చెలియ పాదాలు హంసలకే పాఠాలు
తాను పలికితె చాలు తేనె జలపాతాలు
ఓ నవ్వు చాలు ఎన్నెన్నొ వలలు వేస్తూ అల్లుకుంటుంది
ముత్యాల ఝల్లు మృదువైన ముల్లు మదిలో గుచ్చుకుంటుంది
ఆ సోగ కళ్ళ ఓ సైగ చాలు మనసే ఆగనంటుంది
చెక్కిళ్ళలోని నొక్కుల్లో చేరి మళ్ళీ తిరిగి రానంది
పట్టపగలెవరైనా రాతిరిని చూస్తారా
తన కురులు చూపిస్తా అవుననక ఛస్తారా


గుండెల్లో భోగి మంటలా ఎండల్లో లేత వెన్నెల
కొండల్లో ఏటి పరుగులా దూకుతున్న లయలో
గుమ్మంలో సందె వెలుగులా కొమ్మల్లో కొత్త చిగురులా
మబ్బుల్లో వెండి మెరుపులా ఆమెకెన్ని హొయలో
అలా నడిచి వస్తూంటే పూవుల వనం
శిలైపోని మనిషుంటే మనిషే అనం


గాలుల్లో ఆమె పరిమళం ఊపిరిలో నిండి ప్రతి క్షణం
ఎటు ఉన్నా నన్ను వదలదే ఎలా తప్పుకోను
గుర్తొస్తే ఆమె పరిచయం కవ్వించే పడుచు పసిదనం
రెప్పల్లో కైపు కలవరం ఎలా దాచుకోను
కలో కాదో నాకే నిజం తేలక
ఎలా చెప్పడం తాను నాకెవ్వరో
అదిరి పడకయ్యా ఇది ఆమె మాయ
ఇది కవిత కాదబ్బా మన్మధుడి దెబ్బ

ఏ చోట ఉన్నా

ఏ చోట ఉన్నా నీ వెంట లేనా
సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే
ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే
రేపు లేని చూపు నేనై శ్వాస లేని ఆశ నేనై మిగలనా
నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం
నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతి క్షణం నా మౌనం

నేల వైపు చూసే నేరం చేసావని
నీలి మబ్బు నిందిస్తుందా వాన చినుకుని
గాలి వెంట వెళ్ళే మారం మానుకోమని
తల్లి తీగ బంధిస్తుందా మల్లె పూవుని
ఏమంత పాపం ప్రేమ ప్రేమించడం
ఇకనైనా చాలించమ్మా వేధించడం
చెలిమై కురిసే సిరివెన్నెలవో క్షణమై కరిగే కలవా

వేలు పట్టి నడిపిస్తుంటే చంటిపాపలా
నా అడుగులు అడిగే తీరం చేరేదెలా
వేరెవరో చూపిస్తుంటే నా ప్రతి కల
కంటిపాప కోరే స్వప్నం చూసేదెలా
నాక్కూడ చోటేలేని నా మనసులో
నిన్నుంచగలనా ప్రేమ ఈ జన్మలో
వెతికే మజిలి దొరికే వరకు నడిపే వెలుగై రావా

నా మనసుకేమయింది నీ మాయలో పడింది

నా మనసుకేమయింది నీ మాయలో పడింది
నిజమా కలా తెలిసేదెలా
నాకు అలాగె ఉంది ఎన్నో అనాలనుంది
దాచేదెలా లోలోపల
మన ఇద్దరికి తెలియనిది ఏదో జరిగే ఉంటుంది
అందుకే ఇంతలా గుండె ఉలికి పడుతు ఉంది

చుక్కలే తెచ్చి ఇవ్వనా అంది నీ మీద నాకున్న ప్రేమ
కొత్తగా ఉంది బొత్తిగా నమ్మలేనంత ఈ వింత ధీమా
జంటగా వెంట నువ్వుంటే అందడా నాకు ఆ చందమామ
అందుకే నాకు నువ్వంటే మాటలో చెప్పలేనంత ప్రేమ
పంచుకున్న ముద్దులో ఇలా జతే పడి
పెంచుకున్న మత్తులో పడి మతే చెడి
గాలితో చెప్పనీ మన మొదటి గెలుపు ఇదని

ఎప్పుడూ గుండె చప్పుడు కొట్టుకుంటుంది నీ పేరు లాగ
ఎప్పుడో అప్పుడప్పుడు గుర్తుకొస్తొంది నా పేరు కొద్దిగ
ఒంటిగా ఉండనివ్వదు కళ్ళలో ఉన్న నీ రూపురేఖ
ఇంతగా నన్ను ఎవ్వరూ కమ్ముకోలేదు నీలా ఇలాగ
లోకమంటె ఇద్దరే అదే మనం అని
స్వర్గమంటె ఇక్కడే అంటే సరే అని
వెన్నెలే పాడనీ మన చిలిపి చెలిమి కథని

నా మనసుకేమయింది

నా మనసుకేమయింది నీ మాయలో పడింది
నిజమా కలా తెలిసేదెలా
నాకు అలాగె ఉంది ఎన్నో అనాలనుంది
దాచేదెలా లోలోపల
మన ఇద్దరికి తెలియనిది ఏదో జరిగే ఉంటుంది
అందుకే ఇంతలా గుండె ఉలికి పడుతు ఉంది

చుక్కలే తెచ్చి ఇవ్వనా అంది నీ మీద నాకున్న ప్రేమ
కొత్తగా ఉంది బొత్తిగా నమ్మలేనంత ఈ వింత ధీమా
జంటగా వెంట నువ్వుంటే అందడా నాకు ఆ చందమామ
అందుకే నాకు నువ్వంటే మాటలో చెప్పలేనంత ప్రేమ
పంచుకున్న ముద్దులో ఇలా జతే పడి
పెంచుకున్న మత్తులో పడి మతే చెడి
గాలితో చెప్పనీ మన మొదటి గెలుపు ఇదని

ఎప్పుడూ గుండె చప్పుడు కొట్టుకుంటుంది నీ పేరు లాగ
ఎప్పుడో అప్పుడప్పుడు గుర్తుకొస్తొంది నా పేరు కొద్దిగ
ఒంటిగా ఉండనివ్వదు కళ్ళలో ఉన్న నీ రూపురేఖ
ఇంతగా నన్ను ఎవ్వరూ కమ్ముకోలేదు నీలా ఇలాగ
లోకమంటె ఇద్దరే అదే మనం అని
స్వర్గమంటె ఇక్కడే అంటే సరే అని
వెన్నెలే పాడనీ మన చిలిపి చెలిమి కథని

చెలియా నీవైపే వస్తున్నా

చెలియా నీవైపే వస్తున్నా
కంట పడవా ఇకనైనా ఎక్కడున్నా
నిద్దర పోతున్న రాతిరినడిగా
గూటికి చేరిన గువ్వలనడిగా
చల్లగాలినడిగా ఆ చందమామనడిగా
ప్రియురాలి జాడ చెప్పరేమని
అందరినీ ఇలా వెంట పడి అడగాలా
సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా

అసలే ఒంటరితనం అటుపై నిరీక్షణం
అరెరే పాపమని జాలిగా చూసే జనం
గోరంత గొడవ జరిగితె కొండంత కోపమా
నన్నొదిలి నువ్వు ఉండగలవ నిజం చెప్పవమ్మా

నువ్వు నా ప్రాణం అని విన్నవించు ఈ పాటని
ఎక్కడో దూరానున్న చుక్కలే విన్నాగాని
కదిలించలేద కాస్త కూడ నీ మనస్సుని
పరదాలు దాటి ఒక్కసారి పలకరిచవేమే

కన్నుల్లో నీ రూపమే

కన్నుల్లో నీ రూపమే
గుండెల్లో నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే
నా శ్వాస నీ కోసమే
ఆ ఊసుని తెలిపేందుకు
నా భాష ఈ మౌనమే

మది దాచుకున్న రహస్యాన్ని వెతికేటి నీ చూపునాపేదెలా
నీ నీలికన్నుల్లో పడి మునకలేస్తున్న నా మనసు తేలేదెలా
గిలిగింత పెడుతున్న నీ చిలిపి తలపులతో ఏమో ఎలా వేగడం

అదిరేటి పెదవుల్ని బతిమాలుతున్నాను మదిలోని మాటేదని
తల వంచుకుని నేను తెగ ఎదురుచూసాను నీ తెగువ చూడాలని
చూస్తూనే వేలంత తెలవారి పోతుందో ఏమో ఎలా ఆపడం

ఎటో వెళ్ళిపోయింది

ఎటో వెళ్ళిపోయింది మనసు
ఇలా వంటరయ్యింది వయసు
ఓ చల్ల గాలి ఆచూకి తీసి కబురీయలేవా ఏమయిందో

ఏ స్నేహమో కావాలని ఇన్నాళ్ళుగా తెలియలేదు
ఇచ్చెందుకే మనసుందని నాకెవ్వరూ చెప్పలేదు
చెలిమి చిరునామా తెలుసుకోగానే రెక్కలొచ్చాయో ఏమిటో
ఎటో వెళ్ళిపోయింది మనసు
కలలన్నవే కొలువుండనీ కనులుండి ఏం లాభమంది
ఏ కదలిక కనిపించని శిలలాంటి బ్రతుకెందుకంది
తోడు ఒకరుంటే జీవితం ఎంతో వేడుకౌతుంది అంటూ
ఎటో వెళ్ళిపోయింది మనసు

నిగ్గదీసి అడుగు

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ
మారదు లోకం మారదు కాలం

గాలివాటు గమనానికి కాలిబాట దేనికి
గొర్రెదాటు మందకి నీ ఙానబోధ దేనికి
ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం
ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం
రామబాణమార్పిందా రావణ కాష్టం
కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం

పాత రాతి గుహలు పాల రాతి గృహాలైనా
అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా
వేట అదే వేటు అదే నాటి కథే అంతా
నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా
బలవంతులె బ్రతకాలనే సూక్తి మరవకుండ
శతాబ్దాలు చదవలేద ఈ అరణ్య కాండ

ఎవ్వరె నువ్వు

ఎవ్వరె నువ్వు నన్ను కదిపావు నీ లోకంలోకి లాగావు
కన్నులు మూసి తెరిచేలోగా నా ప్రాణం నువ్వైపోయావు
తెలవారింది లే లేమ్మంటూ వెలుగేదో చూపావు
నాకూ ఓ మనసుందంటూ తెలిసేలా చేశావు
మెరుపల్లే కలిసావు మైమరపే ఇచ్చావు నీలోనే కలిపావు..

ఎటు చూసినా ఏంచేసినా ఏదారిలో అడుగేసినా
నలువైపులా నా ఎదురే ఉందామైనా ఆమైనా
ఏ మబ్బులో దోగాడినా ఏ హాయిలో తేలాడినా
నాకింతగా ఆనందం ఉందా నిన్నా మొన్నా
ఎవ్వరికైనా ఏ ఎదకైనా ప్రేమలొ పడితే ఇంతేనా
ఔననుకున్నా కాదనుకున్నా అనుకోనిదే జరిగిందిగా
నా తీరుతెన్ను మారుతోందిగా..

చెలి చూపులో చిరుగాయమై మలిచూపులో మటుమాయమై
తొలిప్రేమగా నే మొదలౌతున్నా కలలే కన్నా
నా శ్వాసలో తను లీనమై నా నిన్నలన్నీ శూన్యమై
ఈ జీవితం చెలి కోసం అన్నా ఎవరేమన్నా
ఎక్కడి నేను ఎక్కడున్నాను చాలా దూరం నడిచాను
తీయని దిగులై పడి ఉన్నాను చెలిలేనిదే బ్రతికేదెలా
ఏ ఊపిరైన ఉత్తిగాలిలే..

ఏదో ఏదో

ఏదో ఏదో అయిపోతుంది
ఎదలో ఏదో మొదలయ్యింది
నిన్నే చూడాలని నీతో ఉండాలని
నేనే ఓడాలని నువ్వే గెలవాలని
పదే పదే అనిపిస్తుంది నీ పిలుపే వినిపిస్తుంది
అది ప్రేమో ఏమో తెలియని వింత యాతన
అది ప్రేమేనేమో ఎరుగని కొంటె భావన

కళ్ళేమో కలలు మాని నిన్ను వెతుకుతుంటే
మనసేమో పనులు మాని నిన్ను తలుచుకుంటే
కాళ్ళు నీతో కలిసి నడవాలని కలవర పడుతుంటే
చేయి నీతో చెలిమి చెయ్యాలని తొందర పెడుతుంటే
వేరే దారి లేక నా దారే నువ్వయ్యాక
తీరం చేరినాక ఈ కెరటం ఆగలేక
నిన్నే తాకాలని నీతో గడపాలని
ముద్దే ఇవ్వాలని పొద్దే పోవాలని
మనసేమో మనసిచ్చింది
వయసేమో చనువిచ్చింది
అది ప్రేమో ఏమో తెలియని వింత యాతన
అది ప్రేమేనేమో ఎరుగని కొంటె భావన

ఆరాటం హద్దు దాటి మాట చెప్పమంటే
మోమాట సిగ్గుతోటి పెదవి విప్పనంటే
ఉత్సాహం నిన్నే పొందాలని ఉరకలు వేస్తుంటే
ఉల్లాసం నీకై చెందాలని పరుగులు తీస్తుంటే
ఏమీ పాలుపోక సగపాలే నువ్వయ్యాక
ప్రాయం వచ్చినాక పరువం ఆగలేక
నువ్వే కావాలని నిన్నే కలవాలని
మనసే విప్పాలని మాటే చెప్పాలని
ఒళ్ళంతా పులకిస్తుంది తుళ్ళింత కలిగిస్తుంది
అది ప్రేమో ఏమో తెలియని వింత యాతన
అది ప్రేమేనేమో ఎరుగని కొంటె భావన

మౌనంగానే ఎదగమని

మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది

దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమా
దరికి చేర్చు దారులు కూడ ఉన్నాయిగా
భారమెంతో ఉందని బాధపడకు నేస్తమా
బాధవెంట నవ్వుల పంట ఉంటుందిగా
సాగర మధనం మొదలవగానే విషమే వచ్చింది
విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది
అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది
కష్టాల వారధి దాటిన వారికి సొంతమౌతుంది
తెలుసుకుంటె సత్యమిది
తలచుకుంటె సాధ్యమిది

చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో
మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో
పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో
మారిపోని కధలే లేవని గమనించుకో
తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు
నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలి
నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా
నీ అడుగుల్లో గుడికట్టి స్వర్గాలే తరియించగా
నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి
అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి

శృతి నీవు

శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి
శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి
దృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి
దృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి

నీ పదములొత్తిన పదము ఈ పదము నిత్య కైవల్యపధము
నీ కొలువుకోరిన తనువు ఈ తనువు నిగమార్ధ నిధులున్న నెలవు
కోరిన మిగిలిన కోరికేమి నిను కొనియాడు కృతుల పెన్నిధి తప్ప
చేరినా ఇక చేరువున్నదేమి నీ శ్రీ చరణ దివ్య సన్నిధి తప్ప

శ్రీనాధ కవినాధ శృంగార కవితా తరంగాలు నీ స్ఫూర్తులే
అల అన్నమాచార్య కలవాణి అలరించు కీర్తనలు నీ కీర్తులే
శ్రీనాధ కవినాధ శృంగార కవితా తరంగాలు నీ స్ఫూర్తులే
అల అన్నమాచార్య కలవాణి అలరించు కీర్తనలు నీ కీర్తులే
త్యాగయ్య గళసీమ రాజిల్లిన అనంత రాగాలు నీ మూర్తులే
ఈ కరుణ నెలకున్న ప్రతి రచనం జననీ భవ తారక మంత్రాక్షరం

బొమ్మను గీస్తే

బొమ్మను గీస్తే నీలా ఉ౦ది
దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మ౦ది
సర్లే పాప౦ అని దగ్గరకెళ్తే
దాని మనసే నీలో ఉ౦ద౦డి
ఆ ముద్దేదో నీకే ఇమ్మ౦ది

సరసాలాడే వయసొచ్చి౦ది
సరదా పడితే తప్పేము౦ది
ఇవ్వాలనే నాకూ ఉ౦ది
కానీ సిగ్గే నన్ను ఆపి౦ది
దానికి సమయ౦ వేరే ఉ౦ద౦డి

చలి గాలి ఉ౦ది చెలికి వణుకే పుడుతు౦ది
వెచ్చని కౌగిలిగా నను అల్లుకుపోమ౦ది
చలినే తరిమేసే ఆ కిటుకే తెలుస౦డి
శ్రమపడిపోక౦డి తమ సాయ౦ వద్ద౦డి
పొమ్మ౦టావె బాలికా ఉ౦టాన౦టే తోడుగా
అబ్బో ఎ౦త జాలిరా తమరికి నామీద
ఏ౦చేయాలమ్మ నీలో ఏదో దాగు౦ది
నీ వైపే నన్నే లాగి౦ది

అ౦ద౦గా ఉ౦ది తన వె౦టే పది మ౦ది పడకు౦డా చూడు అని నా మనస౦టు౦ది
తమకే తెలియ౦ది నా తోడై ఒకటు౦ది
మరెవరో కాద౦డి అది నా నీడేన౦డి
నీతో నడిచి దానికి అలుపొస్తు౦దే జాలకి
హయ్యో అలక దేనికి నా నీడవు నువ్వేగా
ఈ మాట కోస౦ ఎన్నాళ్ళుగా వేచు౦ది
నా మనసు ఎన్నో కలలే క౦టు౦ది

బొమ్మను గీస్తే....

అపుడో ఇపుడో

అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి
అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి
కలవో అలవో వలవో నా ఊహల హాసిని
మదిలో కథలా మెదిలే నా కలల సుహాసిని
ఎవరేమనుకున్నా నా మనస౦దే నువ్వే నేననీ...
తీపి కన్నా ఇ౦కా తీయనైన వేరే ఎది అ౦టే వె౦టనే నీ పేరని అ౦టానే
హాయి కన్నా ఎ౦తో హాయిదైన చోటే ఎమిట౦టే నువ్వు వెళ్ళే దారని అ౦టానే
నీలాల ఆకాశ౦ ఆ నీల౦ ఏద౦టే నీ వాలు కళ్ళళ్ళో ఉ౦దని అ౦టానే
నన్ను నేనే చాలా తిట్టుకు౦టా నీతో సూటిగా ఈ మాటలేవి చెప్పకపోతు౦టే
నన్ను నేనే బాగా మెచ్చుకు౦టా ఏదో చిన్న మాటే నువ్వు నాతో మాటాడావ౦టే
నా తోడే నేను౦టా నీ తోడే నాకు౦టే
ఏదేదో ఐపోదా నీ జతలేకు౦టే

నేను నేనుగా లేనే

నేను నేనుగా లేనే నిన్న మొన్నలా
లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా
ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా
ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా

పూల చెట్టు ఊగినట్టు పాల బొట్టు చిందినట్టు
అల్లుకుంది నా చుట్టు ఓ చిరునవ్వు
తేనె పట్టు రేగినట్టు వీణ మెట్టు ఒణికినట్టు
ఝల్లుమంది గుండెల్లో ఎవరే నువ్వు
నా మనసుని మైమరపున ముంచిన ఈ వాన
మీకెవరికి కనిపించదు ఏమైనా

చుట్టుపక్కలెందరున్నా గుర్తు పట్టలేక ఉన్నా
అంతమంది ఒక్కలాగే కనబడుతుంటే
తప్పు నాది కాదు అన్నా ఒప్పుకోరు ఒక్కరైనా
చెప్పలేని నిజమేదో నాకూ వింతే
కళ్ళను వదిలెళ్ళను అని కమ్మిన మెరుపేదో
చెప్పవ కనురెప్పలకే మాటొస్తే