03 August 2010

మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా

పల్లవి:

మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా
మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా
మెత్తగా అడిగితే లేదనేది లేదుగా
మెత్తగా అడిగితే లేదనేది లేదుగా
మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా

చరణం1:

నీది కానిదేది లేదు నాలో నిజానికే నేనున్నది నీలో
నీది కానిదేది లేదు నాలో నిజానికే నేనున్నది నీలో
ఒక్కటే మనసున్నది ఇద్దరిలో
ఒక్కటే మనసున్నది ఇద్దరిలో ఆ ఒక్కటి చిక్కెనీ గుప్పిటిలో
హా

మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా
మెత్తగా అడిగితే లేదనేది లేదుగా
మెత్తగా అడిగితే లేదనేది లేదుగా
మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా

చరణం2:

నిన్ను చూచి నన్ను నేను మరచినాను
నన్ను దోచుకొమ్మనీ నిలిచినాను
నిన్ను చూచి నన్ను నేను మరచినాను
నన్ను దోచుకొమ్మనీ నిలిచినాను
దోచుకుందమనే నేను చూచినాను
దోచుకుందమనే నేను చూచినాను
చూచి చూచి నువ్వె నన్ను దోచినావు

మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా
మెత్తగా అడిగితే లేదనేది లేదుగా
మెత్తగా అడిగితే లేదనేది లేదుగా
మెల్ల మెల్ల మెల్లగా

చరణం3:

కన్నులకీ కట్టినావు ప్రేమ గంతలు
కన్నె మనసు ఆడినదీ దాగుడు మూతలు
కన్నులకీ కట్టినావు ప్రేమ గంతలు
కన్నె మనసు ఆడినదీ దాగుడు మూతలు
దొరికినాము చివరకు తోడు దొంగలం
దొరికినాము చివరకు తోడు దొంగలం
దొరలమై ఏలుదాము వలపు సీమను
హా

మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా
మెత్తగా అడిగితే లేదనేది లేదుగా
మెత్తగా అడిగితే లేదనేది లేదుగా
మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా
మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips