01 August 2010

స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం

ఆ ఆ ఆ అల్లాయే దిగి వచ్చి అల్లాయే దిగి వచ్చి
ఆయ్ మియా ఏమి కావాలంటే
మిద్దెలొద్దు మేడలొద్దూ
పెద్దలెక్కే గద్దెలొద్దంటాను
ఉన్ననాడు లేనినాడు ఒకే ప్రాణమై నిలిచే
ఒక్క దోస్తే చాలంటాను
ఒక్క నేస్తం కావాలంటాను

స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం
హోయ్ స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం
స్నేహమే నాకున్నది స్నేహమేరా పెన్నిధి
స్నేహమే హోయ్
స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం
హోయ్ స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం

గుండెనే పలికించితే
గుండెనే పలికించితే కోటి పాటలు పలుకుతాయ్
మమతనే పండించితే మణుల పంటలు దొరుకుతాయ్
బాధలను ప్రేమించు భాయీ ఈ ఈ
బాధలను ప్రేమించు భాయీ లేదు అంతకు మించి హాయి
స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం
హోయ్ స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం

హేయ్ కత్తిలా పదునైన చురుకైన మావాడు
మెత్తబడిపోయాడు ఎందుకో ఈనాడు
ఆ కత్తిలా పదునైన చురుకైన మావాడు
మెత్తబడిపోయాడు ఎందుకో ఈనాడు
ఏమిటో ఈ బాధ ఆ ఆ ఏమిటో ఈ బాధ
నాకైనా చెప్పు భాయి
ఆ రహస్యం కాస్త ఇకనైనా విప్పవోయి
ఆ రహస్యం కాస్త ఇకనైనా విప్పవోయి
నిండుగా నువ్వు నేడు నవ్వాలి
అందుకు నేనేమి ఇవ్వాలి
నిండుగా నువ్వు నేడు నవ్వాలి
అందుకు నేనేమి ఇవ్వాలి
చుక్కలను కోసుకుని తెమ్మంటావా
దిక్కులను కలిపేయమంటావా
దింపమంటావా
దింపమంటావా ఆ చంద్రుణ్ణి
తుంచమంటావా ఆ సూర్యుణ్ణి
ఏమి చేయాలన్నా చేస్తాను
కోరితే ప్రాణమైన ఇస్తాను
ఏమి చేయాలన్నా చేస్తాను
కోరితే ప్రాణమైన ఇస్తాను
దోస్తీకి నజరానా ఆ ఆ
దోస్తీకి నజరానా చిరునవ్వురా నాన్న
దోస్తీకి నజరానా చిరునవ్వురా నాన్న
ఒక నవ్వేచాలు వద్దులే వరహాలు నవ్వరా
నవ్వెరా హోయ్ మావాడు నవ్వెరా నిండుగా
నవ్వెరా మావాడు నవ్వెరా నిండుగా
నవ్వెరా నా ముందు రంజాను పండుగా

స్నేహమే హోయ్
స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం
స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips