08 December 2011

అనుకోనేలేదుగా కలకానేకాదుగా

అనుకోనేలేదుగా కలకానేకాదుగా
కలిసొచ్చే కాలమల్లె నిలిచావులే
అనుకుంటే చాలుగా కనువిందే చేయగా
కదిలోచ్చే తీరమల్లె కలిశా నేనే
ఒకే నువ్వు ఒకే నేను చెరో సగమైతే ప్రేమేలే
ఒకే చూపు ఒకే శ్వాస మరో జగమైతే మనమేలే
సుఖాలన్నీ మన చుట్టూ చేరే
శుభాలన్ని మన చుట్టమయ్యే నేడే

ఐదు ప్రాణాల సాక్షిగా నాలుగు కాలాల సాక్షిగా
మూడు పూటల్లో రెండు గుండెల్లో ఒక్కటే ప్రేమగా
కొంటె దూరాలు కొద్దిగా కంటి నేరాలు కొద్దిగా
కొన్ని కౌగిల్లు కొత్త ఎంగిళ్ళు ప్రేమగా మారగా
ఉల్లాసమే ఉద్యోగమాయే
సంతోషమే సంపాదనాయే
ఇదే బాటై ఎదే మాటై ఇలాగే లోకాలని ఏలాలిలే
ఒకే నువ్వు ఒకే నేను చేరోసగమైతే ప్రేమేలే
ఒకే నవ్వు ఒకే నడక మరోజగమైతే మనమేలే

అనుకోనేలేదుగా కలకానేకాదుగా
కలిసొచ్చే కాలమల్లె నిలిచావులే
నువ్వు అనుకుంటే చాలుగా కనువిందే చేయగా
కదిలోచ్చే తీరమల్లె కలిశా నేనే
ఒకే నువ్వు ఒకే నేను చెరో సగమైతే ప్రేమేలే
ఒకే చూపు ఒకే శ్వాస మరో జగమైతే మనమేలే

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips