08 December 2011

ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళా చూపేదేలా

ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళా చూపేదేలా
ఎడారిలో గోదారిలా
నాలో అలా ఆపేదెలా
ఈ మాయని నమ్మేది ఎలా
ఈ మాటని చెప్పేదెలా
నీ పరిచయం లోన పొందా జన్మ మరలా

ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళా చూపేదేలా
ఎడారిలో గోదారిలా
నాలో అలా ఆపేదెలా

నిన్నలోని నిమిషమైన గురుతు రాదే ఈక్షణం
నేటిలోని సంబరాన ఉరకలేసే జీవనం
ఈ స్నేహమే వరం ఈ భావమే నిజం
ఇది తెలుపబోతే భాష చాల్లెదేలా
నా భాషలోన తీయనిదనం
నా బాటలోన పచ్చనిదనం
పసి పాపలాగా నవ్వే గుణం
నీ వల్లే నీ వల్లే వెలిగింది నా నీడ నీ నీడలో నే చేరాలని
నూరేళ్ళ పయనాలు చేయాలని
ఈ పరవశం లోన నిలిచా ప్రాణ శిలలా

ఎలా ఎలా ఎలా ఎలా
నాలో కళా చూపేదేలా
ఎడారిలో గోదారిలా
నాలో అలా ఆపేదెలా
ఈ మాయని నమ్మేది ఎలా
ఈ మాటని చెప్పేదెలా
నీ పరిచయం లోన పొందా జన్మ మరలా
I wanna hold you
I wanna hold you in my heart
I wanna hold you
I wanna hold you in my heart

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips