04 June 2010

నమ్మలేని కలే నిజమాయెనా చెలియ వలన

నమ్మలేని కలే నిజమాయెనా చెలియ వలన
అందువల్లే ఇలా చెలరేగెనా చిలిపి తపన
హే నువ్వే నువ్వే నా ఎద లయ పలికిన వలపు తననన
హే నువ్వే నువ్వే చొటడిగితే మనసున కాదనగలనా

నమ్మలేని కలే నిజమాయెనా చెలియ వలన
అందువల్లే ఇలా చెలరేగెనా చిలిపి తపన

అద్దం ముందు కన్ను చూడమంటే నన్ను
ఇద్దరున్నాం అంటుందెలా
పువ్వులాంటి నన్ను చాకులాంటి నిన్ను
ఒక్క చోట చేర్చిందిలా
తళతళ మెరుపులా చేరుకుందే ప్రేమ వెలుగిలా
అల్లుకుందే కొంటె వలా
నేనంతా నువ్వైపోయేలా

ఇన్నినాళ్ళు నీలోఎక్కడొ ఏ మూలో
ఇంత ప్రేమ దాచావెలా
పెంచుకున్నదంతా నాతో పంచుకుంటే
చిట్టి గుండె మోసేదెలా
ప్రేమంటేనే వింత కదా
భారమైనా తెలికైపోదా
సత్యభామా పద పద
నీ తోడై నేనున్నా కదా

నమ్మలేని కలే నిజమాయెనా చెలియ వలన
అందువల్లే ఇలా చెలరేగెనా చిలిపి తపన

No comments: