07 June 2010

తెలుసా .. నీకు తెలుసా ...

తెలుసా .. నీకు తెలుసా ...
ప్రేమంటే ఒకే తార ఉదయించే గగనమని

తెలుసా .. నీకు తెలుసా ...
ప్రేమంటే.. ఒకే మనిషి నివసించే భువనమని
ఒకే పాట వినిపించే కావ్యమని
ఒకే దివ్వె వెలుగొందే కోవేలని
అదే అదే ఆ హృదయమని .. ప్రనయమని ..ప్రాణమని

తెలుసా .. నీకు తెలుసా ...
ప్రేమంటే.. ఒకే మనిషి నివసించే భువనమని
ఒకే మురళి పలికే గోకులమని
ఒకే కెరటం ఉప్పొంగే యమున అని
అదే అదే నా జీవమని .. గానమని .. మౌనమని

తెలుసా ..

శీత గాలి వీచినపుడు లేత ఎండలా
ఎండ కన్ను సోకినపుడు మంచు కొండలా
ఆదుకొనే వెచ్చని మమత ..
ఆవిరయే చల్లని ఎడగా
ఒకే శృతి ఒకటే లయ ఒకటే స్వరము
విన్న రాగామోకటే .. అదే అదే అనురాగమని
మౌన యోగమని ప్రేమ దీపమని

తెలుసా .. నీకు తెలుసా ...

శరత్కాల నదులలోని తేట నీటిలా
పుష్య మాస సుమ గళాన తేనే వాసలా
సుప్రసన్న సుందర కవిత
సుప్రభాత మరందగులిక
ఒక పార్వతి ఒక శ్రీపతి ఒక సరస్వతి

సర్వమంగళ మంగల్యే శివే సర్వార్ధ సాదకే
శరణ్యే త్రాయంబకే దేవి నారాయని నమో స్తుతే

ఉన్న మాసం ఒకటే .. అదే అదే మమకారము
వృత్తి కారణం భ్రమ్మకు జననం

తెలుసా .. నీకు తెలుసా ...
తెలుసా .. నీకు తెలుసా ...

No comments: