సీతాలు సింగారం మాలచ్చి బంగారం
సీతామాలచ్చిమంటే శ్రీలచ్చిమవతారం
సీతాలు సింగారం మాలచ్చి బంగారం
సీతామాలచ్చిమంటే శ్రీలచ్చిమవతారం
మనసున్న మందారం మనిషంత బంగారం
బంగారు కొండయ్యంటే భగవంతుడవతారం
మనసున్న మందారం మనిషంత బంగారం
బంగారు కొండయ్యంటే భగవంతుడవతారం
సీతాలు సింగారం
కూసంత నవ్విందంటే పున్నమి కావాల
ఐతే నవ్వనులే ఏ ఏ
కాసంత చూసిందంటే కడలే పొంగాల
ఇక చూడనులే ఏ ఏ
కూసంత నవ్విందంటే పున్నమి కావాల
కాసంత చూసిందంటే కడలే పొంగాల
ఎండితెరమీద పుత్తడిబొమ్మ ఎలగాల ఎదగాల
ఆ ఎదుగుబొదుగు ఎలుగు కన్నుల ఎన్నెల కాయాల
నువ్వంటుంటే నేవింటుంటే నూరేళ్ళు నిండాల ఆ
సీతాలు సింగారం మాలచ్చి బంగారం
బంగారు కొండయ్యంటే భగవంతుడవతారం
మనసున్న మందారం
దాగుడుమూతలు ఆడావంటే దగ్గరకే రాను
ఐతే నేనే వస్తాలే ఏ ఏ
చక్కలగింతలు పెట్టావంటే చుక్కైపోతాను
ఎగిరొస్తాలే ఏ ఏ
దాగుడుమూతలు ఆడావంటే దగ్గరకే రాను
చక్కలగింతలు పెట్టావంటే చుక్కైపోతాను
గుండె గుడిలోన దివ్వెవు నువ్వై వెలిగి వెలిగించాల
నీ వెలుగుకు నీడై బ్రతుకుకి తోడై వుండిపోవాల
నువ్వంటుంటే నేవింటుంటే నూరేళ్ళు బతకాల ఆ
సీతాలు సింగారం మాలచ్చి బంగారం
బంగారు కొండయ్యంటే భగవంతుడవతారం
లాలల లాలల లాలల లాలల
No comments:
Post a Comment