||పల్లవి||
నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు సిద్ధం రా ఫ్రెండు
తక్కినవన్నీ పక్కన పెట్టి పట్టర ఓ పట్టు
వెయ్యర సై అంటూ నడుం చుట్టూ ఉడుంపట్టు
చిందెయ్యర రై అంటూ పదం వింటు పద అంటు ||నచ్చిన ఫుడ్డు||
||చరణం 1||
వినరో పిట పిటలాడే పిట్టల కొక్కొరొకో....కొక్కొరొకో
పదరో చిట పటాలాడే ఈడుకి దిక్కదిగో
కసిగా కుత కుత ఉడికే కళ్ళకి విందిదిగో
ఎదలో కిత కిత పెట్టే కన్నెల చిందిదిగో
చెక్కిలి నొక్కుల చిక్కులలో చిక్కని మక్కువ చిక్కులురో
చక్కిలిగింతల తొక్కిడిలో ఉక్కిరి బిక్కిరి తప్పదురో
అక్కర తీర్చే అంగడిరో అందాల అందాలు అందాలి పదరా ||నచ్చిన ఫుడ్డు||
||చరణం 2||
సరిగా వెతికితే సరదా దొరకక తప్పదురో
జతలో అతికితె జరిగే చొరవిక చెప్పకురో
త్వరగా కలబడి ఖానా పీనా కానీరో
మరిగే కలతకు చెమటల దాణా కానుకరో
తుళ్ళెను అందం కళ్ళెదుర ఒల్లని పందెం చెల్లదురా
మల్లెల గంధం చల్లునురా అల్లరి బంధం అల్లునురా
అత్తరు సోకు కత్తెరరా మొత్తంగ మెత్తంగ కోస్తుంది కదరా ||నచ్చిన ఫుడ్డు||
No comments:
Post a Comment