మనసులకు లాలిపాట మన కథల జాలిపాట
రెప్పలేని క౦టి పాపకే
నాపాపకి దూరాన ఉన్న తల్లి గారాల జోలపాట
ఏ దేవుడీ చేరాతలో నాపాపగా నిన్ను చేసే
నాదేవుడే చేజేతులా ఈ అమ్మనే బొమ్మ చేసే
నీదిక్కుగా నేను౦డగా నాదివ్వె నీలోన మెరిసే
కన్నీటి లో కమలాలకై ఏ తుమ్మెదో వేచి చూసే
నాగీతమోగీతమై.. నా క౦టి జలపాతమై ..
నీతల్లిగా జోల నేపాడనా నీడోల నేనూపనా
ఏజన్మ కీ స్త్రీ జన్మమే నీకొద్దు నా చిట్టీ తల్లి
ఏకాకిలా ఓ కాకిలా మారి౦ది ఈ కన్నతల్లి
ఈకోవెలా నాకో వెలా తెచ్చి౦ది ఈనాడు తల్లి
నావెన్నెలే ఆవేదనై పొ౦గి౦ది నా క౦ట మళ్ళి
వాల్మికి వారి౦చినా వగచి౦ది ఆ జానకి
నీ జోల కావాలి ఈ అమ్మకి నాతల్లిగా జన్మకి
No comments:
Post a Comment