02 June 2010

అక్షరాలు ఈ వేళ అగ్ని విరజిమ్మాలి

అక్షరాలు ఈ వేళ అగ్ని విరజిమ్మాలి..
అక్షరాలు ఈ వేళ అగ్ని విరజిమ్మాలి..భావాలు పదునెక్కి భాష ఎరుపెక్కాలి..
అక్షరాలు ఈ వేళ అగ్ని విరజిమ్మాలి..భావాలు పదునెక్కి భాష ఎరుపెక్కాలి..
అక్షరాలు ఈ వేళ అగ్ని విరజిమ్మాలి..

చీకటి కుటీరాన్న చేతలను వెలిగించి..అణువణువులో ఆశ ఆవిష్కరించాలి...
ఉద్రిక్తమై పొంగు ఊహ ఊపిరి మీద బంగారు భవితకై బాట నిర్మించాలి..

అక్షరాలు ఈ వేళ అగ్ని విరజిమ్మాలి..భావాలు పదునెక్కి భాష ఎరుపెక్కాలి..
అక్షరాలు ఈ వేళ అగ్ని విరజిమ్మాలి..

పాత రాతి ఉగాల రోత ఆలోచనలు జనజీవతం లోనుంచి తరలింపచేయాలి ..
లోకాన్న శోకాల చీకట్లు తొలగించీ.. నవ జీవన ప్రభలోన నర్తింప చేయాలి

అక్షరాలు ఈ వేళ అగ్ని విరజిమ్మాలి..భావాలు పదునెక్కి భాష ఎరుపెక్కాలి..
అక్షరాలు ఈ వేళ అగ్ని విరజిమ్మాలి..

కారు చీకటిలోన కాంతి రేకై నిలచి.. దీనులకు హీనులకు దిక్సూచీ కావాలి..
మనిషి మనసున మమత మధువులోలికించాలి ..క్రాంతి అసనాలలో శాంతి వికసించాలి..

అక్షరాలు ఈ వేళ అగ్ని విరజిమ్మాలి..భావాలు పదునెక్కి భాష ఎరుపెక్కాలి..
అక్షరాలు ఈ వేళ అగ్ని విరజిమ్మాలి..

No comments:

Post a Comment