18 November 2010

చూడచక్కని జింకపిల్లరా శ్రీరామచంద్రా

చూడచక్కని జింకపిల్లరా శ్రీరామచంద్రా
హొయ్ చెంగుమంటు చెంతకొచ్చెరా శ్రీరామచంద్రా
నీ కోసమే నే పుట్టి పెరిగా ఇన్నాళ్లుగా నీకోసం వెతిగా
నీ తోడుంటే ప్రతీరోజూ పండగే నువులేకుంటే బతికేది దండగే
నీ జల్లోని పువ్వయ్యినే ఉంటానే పువ్వుల బుల్లెమ్మా
కళ్ళునావి చూపులు నీవిరా శ్రీరామచంద్రా
మాటనాది మనసు నీదిరా ఓ రామచంద్రా

చెంపకుచారెడు కళ్లు చామంతులు పూస్తే వళ్లు నీ నవ్వే మల్లెలు జల్లే చిలకమ్మ
అన్నీ నీకే ఇస్తా నీ వెంటనే నడిచొస్తా నీ వాకిలి ముందుర ముగ్గయై నేనుంటా
గుండెల నిండా ప్రేముండాలి భామ
దాన్ని ఏం చెయ్యాలో నువ్వే చెబుదువురామా
నలుగురి ముందు తాళిని కట్టేయ్ మామ ఆ తరువాతేంజేయాలో చెబుతాలేమా
ఊరంతా పచ్చంగా పందిర్లెయ్యనా
పదుగుర్లో పదిలంగా పెళ్లాడేయ్యనా
నీ మెళ్లోని గొలుసయి నీ గుండెల్లో కాపురమెట్టేయనా ||మాట||

గుళ్లో దేవుని కన్నా నువ్వేలే నాకు మిన్న నీ కాలికి అంటిన మన్నే బొట్టంటా
మేడలు మిద్దెలు కన్నా ముద్దొచ్చే పెదవులు మిన్న నీ కమ్మని ముద్దే కట్నం లెమ్మన్నా
కొంగలు జారే కమ్మని రాతిరిలోనా నువు కోరిన పండు కొరికిస్తాలే మామా
కాటుక మరకలు అంటే కౌగిలిలోనా తెల్లారులు నిన్ను కరిగిస్తాలే భామా
నీ మాటేనే వింటా ఏనాటికీ
సయ్యంటే సయ్యంటా సయ్యాటకి
చెంగట్టేసి పట్టేసి చుట్టేస్తా సిగ్గుల చిలకమ్మా

No comments:

Post a Comment